రచన ఒక తెలుగు మాసపత్రిక. తెలుగులో సాహిత్యంలో విలువలు కనుమరుగవుతున్న నేపథ్యంలో ఉత్తమ సాహిత్యాన్ని అందరికీ అందించాలన్న ఆశయంతో స్థాపించబడిన పత్రిక 'రచన'. దీని వ్యవస్థాపకులు, ప్రధాన సంపాదకులు శ్రీ వై.వి.యస్.ఆర్.యస్. తల్పశాయి గారు.

px300
px300

కథలు, కథానికలు, కార్టూన్లు, వివిధ శీర్షికలు 'రచన'లో కోకొల్లలు. సాహితీ విలవలు కలిగిన కథలు మాత్రమే ప్రచురించటం 'రచన' తాలూకు విశిష్టత. తతిమ్మా పత్రికల్లో కనబడే సినిమా కబుర్లు, గాసిప్ కబుర్లు, వెకిలి కార్టూన్లు 'రచన'లో మచ్చుకు కూడా కనబడవు. సందర్భాన్నిబట్టి చలం, శ్రీశ్రీ, కా.రా., ముళ్ళపూడి వంటి రచయితల రచనల గురించి 'రచన' ప్రత్యేక శీర్షికలు వెలువరిస్తుంది.

ఎన్నారై రచయితలు 'రచన'లోని మరొక ప్రత్యేకత. చాలా పత్రికలు ఆంధ్రరాష్ట్రాన్ని దాటి తతిమ్మా దేశాలకు ముఖ్యంగా అమెరికా దేశానికి వాయుమార్గాన తమ సంచికలు చేరవేసినా, రచన ఎనారైలలో ప్రాముఖ్యత సాధించినట్లుగా అవేవీ ప్రాముఖ్యత సాధించలేకపోయాయి. రచనలో వివిధ శీర్షికలు, కథలు మున్నగువాటికి ఎన్నారైలు ఉత్సాహంగా తోడ్పడటం కద్దు.

'రచన' మైలురాళ్ళు

మార్చు

ఇది హైదరాబాదు నుండి వెలువడే మాసపత్రిక. కథలకి ప్రాధాన్యత. ఇది అంతర్జాలంలో దొరకదు. కానీ ప్రతి సంచికలోనుంచి కొన్ని పుటలను PDF రూపంలో ఈ పత్రిక అధికారిక వెబ్‌సైటు Archived 2008-06-16 at the Wayback Machineలో ఉంచుతారు. పూర్తిగా రచయితలే నిర్వహించే ఈ పత్రికను ప్రవాసాంధ్రులు ఎక్కువగా చదువుతారు. కథా సాహిత్యాన్ని ప్రోత్సహించే సాహితీ వైద్యం, కథాపీఠం, కథా ప్రహేళిక లాంటి శీర్షికలు ఈ పత్రికలో ఉన్నాయి. వీటిలో వసుంధర నిర్వహించే సాహితీ వైద్యం శీర్షిక కథా రచయితలు కా.గో.రే. ఔత్సాహికులకు ఉపయోగకరంగా ఉంటుంది.

'రచన' శీర్షికలు

మార్చు
  • సాహితీ వైద్యం
  • కథా పీఠం
  • అమెరికాకమ కబుర్లు

చిరునామా

మార్చు

1-9-286/2/P, విద్యానగర్ (రాంనగర్ గుండు దగ్గర), హైదరాబాద్ - 500 044

బయటి లింకులు

మార్చు