రచ్చబండ (నాటిక)
రచ్చబండ (నాటిక) గ్రామీణ నేపథ్యంలో వచ్చిన సాంఘిక నాటిక. ఈ నాటికను రచయిత రావుల పుల్లాచారి రచించగా గోవాడ క్రియేషన్స్ అసోసియేషన్ నిర్వహణలో నటుడు దర్శకుడైన డా. వెంకట్ గోవాడ దర్శకత్వం వహించాడు.
రచ్చబండ | |
---|---|
రచయిత | రావుల పుల్లాచారి |
దర్శకుడు | వెంకట్ గోవాడ |
తారాగణం | పిల్లలమర్రి పెద్దమల్లయ్య - మల్లేశ్ బలష్టు మల్లికాంబ - సురభి ప్రభావతి |
ఒరిజినల్ భాష | తెలుగు |
విషయం | సాంఘిక నాటిక |
నిర్వహణ | గోవాడ క్రియేషన్స్ అసోసియేషన్ |
కథ
మార్చుఐదెకరాల అసామిగా ఉన్న పిల్లలమర్రి పెద్దమల్లయ్య అనుకోని పరిస్థితుల్లో అప్పులపాలై, పొట్టకూటికోసం బర్లను కాస్తుంటాడు. అటువంటి సందర్భంలో ఊరు మోతుబరి భద్రయ్య బర్రె ఆయన దొడ్ల చావట్ల నుండి తప్పించుకుపోతుంది. ఆ బర్రెను పట్నంలో ఉన్న తన కొడుకుకు రవాణాచేసి, అమ్ముకున్నాడని పిల్లలమర్రి పెద్దమల్లయ్య మీద నింద వేస్తాడు. అంతేకాకుండా పిల్లలమర్రి పెద్దమల్లయ్యను రచ్చబండ దగ్గర పంచాయితి పిలుస్తాడు.
పెద్ద మనుషులు రచ్చబండ దగ్గరకి చేరగానే పక్క ఊరిలో కట్టేసిన బర్రె తిరిగొస్తుంది. కానీ అప్పటికే, చెయ్యని నేరానికి నిందపడ్డ మల్లయ్య కృంగిపోయి, అవమాన భారంతో చచ్చిపోతాడు. మల్లయ్య శవాన్ని రచ్చబండ దగ్గరకి తీసుకురావడం, బర్రె ఆ శవం దగ్గరికి వెళ్లడంతో నాటిక ముగుస్తుంది.
నటవర్గం
మార్చు- పిల్లలమర్రి పెద్దమల్లయ్య - మల్లేశ్ బలష్టు
- మల్లికాంబ - సురభి ప్రభావతి
- భద్రయ్య - మురళీధర్ గౌడ్
- దుర్గయ్య - జి.ఎల్. కుమార్
- లింగయ్య - లేఖానందస్వామి
- శివయ్య - చేగోండి చంద్రశేఖర్
- ఎర్రన్న - శ్రీనివాస్ రేణిగుంట్ల
- వ్యక్తులు - ప్రణయ్‌రాజ్ వంగరి, హనుమంతరాయుడు, సతీష్ వీరబోయిన, నిఖిల్ జాకబ్ తాటిపర్తి, గిరిబాబు దేవులపల్లి, సుధాకర్ తేళ్ళ, బెజాడు పర్వతాలు, రవీందర్, మధు, హనుమాన్, నరేందర్, బల్ల హను
ప్రదర్శనలు (కొన్ని)
మార్చు- మే 4, 2016 - త్యాగరాయగాన సభ, హైదరాబాద్- వంశీ ఆర్ట్స్ థియేటర్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో దాసరి నారాయణరావు జన్మదినం సందర్భం[1]
- జనవరి 25, 2016 - నంది నాటకోత్సవాలు 2016, కర్నూలు[2]
బహుమతులు
మార్చు- ఉత్తమ ఆహార్యం- మల్లేష్, ద్వితీయ ఉత్తమ రచన- రావుల పుల్లాచారి - నంది నాటకోత్సవాలు, 2016[3]
మూలాలు
మార్చు- ↑ ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి, సినిమా కబుర్లు. "దాసరి జన్మదినం సందర్భంగా రచ్చబండ నాటిక". Retrieved 24 April 2017.
{{cite news}}
: CS1 maint: multiple names: authors list (link)[permanent dead link] - ↑ సాక్షి. "ఊహలకు రూపం.. నటనకు ప్రాణం". Retrieved 24 April 2017.
- ↑ నమస్తే తెలంగాణ. "ఉత్తమ రచనగా రచ్చబండ". Retrieved 24 April 2017.[permanent dead link]