సురభి ప్రభావతి

సురభి ప్రభావతి నాటకరంగ, టివి, సినిమా నటి.[1]

సురభి ప్రభావతి
జననం
రేకందార్ ప్రభావతి

(1980-06-27) 1980 జూన్ 27 (వయస్సు 41)
జాతీయతభారతీయురాలు
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2003 - ప్రస్తుతం
తల్లిదండ్రులురేకందార్ కుమార్ బాబు, కమలమ్మ
బంధువులునాగేష్ (భర్త)

జననంసవరించు

ప్రభావతి 1980, జూన్ 27న శ్రీమతి కమలమ్మ, రేకందార్ కుమార్ బాబు దంపతులకు జన్మించింది.

రంగస్థల ప్రస్థానంసవరించు

బాలనటిగా గుణసుందరి నాటకంలో నటించి 2003లో మదన కామరాజు నాటకం ద్వారా రంగస్థలంపై అడుగుపెట్టిన ప్రభావతి, ఇప్పటివరకు సుమారు 700 నాటికలు, నాటకాల్లో వివిధ పాత్రలు పోషించింది. విప్రనారాయణ, శ్రీకాళహస్తీశ్వర సాయుజ్యం, మృత సంజీవని, గణపతి మహత్యం, శశిరేఖా పరిణయం, నరకాసుర నాటకాల్లో ఈవిడ ధరించిన పాత్రల ద్వారా విశేష ప్రశంసలు అందుకుంది.

నాటకాలుసవరించు

 1. మదన కామరాజు
 2. విప్రనారాయణ
 3. శ్రీకాళహస్తీశ్వర సాయుజ్యం
 4. మృత సంజీవని
 5. గణపతి మహత్యం
 6. శశిరేఖా పరిణయం
 7. నరకాసుర
 8. యజ్ఞం
 9. కవయిత్రి మొల్ల
 10. అంబేద్కర్ రాజగృహ ప్రవేశం
 11. బాపూబాట
 12. రాణి రుద్రమ

నాటికలుసవరించు

 1. రచ్చబండ
 2. సైకతశిల్పం
 3. త్యాగం
 4. పంపకాలు
 5. మాతృక[2]

సినిమాలుసవరించు

 1. బతుకమ్మ
 2. మహాత్మ
 3. ఆదిగరువు అమ్మ
 4. మిడిల్ క్లాస్ మెలోడీస్‌[3]
 5. సురాపానం (2022)

సీరియళ్లుసవరించు

 1. పూతరేకులు
 2. మాయాబజార్
 3. సరస్వతీ వైభవం

అవార్డులుసవరించు

ఈవిడ నంది, గరుడ (ఆయుష్మాన్‌భవ, నరకాసుర, విప్రనారాయణ) అవార్డులతోపాటు అనేక పరిషత్తుల నుండి ఎన్నో బహుమతులు అందుకుంది.

 1. ఉత్తమ నటి - మూడోదరి - పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్తు - 2012 (2012)
 2. ఉత్తమ నటి - రాణి రుద్రమ - శ్రీ కాళహస్తీశ్వర లలిత కళా పరిషత్, శ్రీకాళహస్తి (2018)[4]
 3. ఉత్తమ నటి - రైతేరాజు -అపర్ణ నాటక కళాపరిషత్‌, తాడిపత్రి, గొల్లప్రోలు మండలం, 2019 ఏప్రిల్ 5[5]

పురస్కారాలుసవరించు

మూలాలుసవరించు

 1. సురభి ప్రభావతి, కళాదీపికలు (సమకాలీన రంగస్థల నటీమణులు), ప్రథమ ముద్రణ, సంపాదకులు: వి.ఎస్. రాఘవాచారి., కళాదీపిక మాసపత్రిక, తిరుపతి, అక్టోబరు 2011, పుట. 56.
 2. నమస్తే తెలంగాణ. "ముగిసిన రంగస్థల సంబురాలు". Retrieved 27 June 2017.
 3. "ఆనంద్ దేవ‌ర‌కొండ‌, వ‌ర్ష బొల్ల‌మ్మ జంట‌గా వినోద్ అనంతోజు ద‌ర్శ‌క‌త్వంలో భ‌వ్య క్రియేష‌న్స్ చిత్రం `మిడిల్ క్లాస్ మెలోడీస్‌`". www.telugu.industryhit.com. 10 July 2020. Archived from the original on 12 August 2020. Retrieved 12 August 2020.
 4. జాతీయ పద్య నాటక పోటీల్లో రాణి రుద్రమకు ద్వితీయ బహుమతి, ఆంధ్రజ్యోతి, వరంగల్ అర్బన్ ఎడిషన్, 08.04.2018, పుట 7.
 5. ప్రజాశక్తి, జిల్లాలు (5 April 2019). "ముగిసిన రాష్ట్ర స్థాయి నాటక పోటీలు". www.prajasakti.com. Archived from the original on 7 August 2019. Retrieved 7 August 2019.
 6. సాక్షి, ఎడ్యుకేషన్ (9 April 2013). "41 మందికి ఉగాది పురస్కారాలు...15 మందికి హంస అవార్డులు". www.sakshieducation.com. Archived from the original on 17 April 2020. Retrieved 17 April 2020.
 7. తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాల ప్రకటన[permanent dead link]
 8. నవతెలంగాణ. "సినీరంగానికి రంగస్థలం పునాది". Retrieved 17 January 2017.

ఇతర మూలాలుసవరించు

 • సురభి ప్రభావతి, కళాదీపికలు (సమకాలీన రంగస్థల నటీమణులు), ప్రథమ ముద్రణ, సంపాదకులు: వి.ఎస్. రాఘవాచారి., కళాదీపిక మాసపత్రిక, తిరుపతి, అక్టోబరు 2011, పుట. 56.