ప్రణయ్‌రాజ్ వంగరి

తెలుగు నాటక రంగ పరిశోధకుడు మరియు తెలుగు వికీపీడియా నిర్వాహకుడు.

ప్రణయ్‌రాజ్ వంగరి తెలుగు నాటక రంగ పరిశోధకుడు.[1], తెలుగు వికీపీడియా నిర్వాహకుడు. వినూత్న నాటకాలతో జనం దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తోన్న "పాప్ కార్న్ థియేటర్"కు ప్రధాన కార్యదర్శి.[2][3] 'వికీవత్సరం' అనే కాన్సెప్ట్‌తో వరుసగా 365రోజులు - 365 వ్యాసాలు రాసి, ప్రపంచం మొత్తంలో ఈ ఘనత సాధించిన మొదటి వికీపీడియన్‌గా చరిత్ర సృష్టించాడు.[4][5][6][7][8] ఆ ఛాలెంజ్‌ను అలాగే కొనసాగిస్తూ 2019, జూన్ 4న 1000 రోజులు - 1000 వ్యాసాలు పూర్తిచేశాడు. 2020, అక్టోబర్ 17 నాటికి 1500 రోజులు - 1500 వ్యాసాలు పూర్తిచేశాడు.[9]

ప్రణయ్‌రాజ్ వంగరి
Pranayraj.jpg
ప్రణయ్‌రాజ్ చిత్రం
జననం
రాజు వంగరి

మార్చి 25, 1985
విద్యఎం.ఫిల్ (రంగస్థల కళలు)
విద్యాసంస్థతెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్
క్రియాశీల సంవత్సరాలుమార్చి 8, 2013
ఉద్యోగంప్రాజెక్ట్ అసిస్టెంట్, థియేటర్ ఔట్రీచ్ యూనిట్ (టి.ఓ.యు)
సుపరిచితుడునాటకరంగ పరిశోధకుడు, తెలుగు వికీపీడియా నిర్వాహకుడు.
జీవిత భాగస్వామినాగరాణి బేతి
పిల్లలుయవనిక రాజ్, యవన్ రాజ్
తల్లిదండ్రులు
 • జానయ్య (తండ్రి)
 • కళమ్మ (తల్లి)
బంధువులుకవిత (అక్క), ఏలూరి మత్స్యగిరి (బావ), మనోజ్, ఉత్తేజ్ (అల్లుళ్లు)

జననంసవరించు

ప్రణయ్ 1985, మార్చి 25న యాదాద్రి భువనగిరి జిల్లా, మోత్కూర్ లో చేనేత కార్మికులైన వంగరి జానయ్య, కళమ్మ దంపతులకు జన్మించాడు.[10] తండ్రి జానయ్య సినీ అభిమాని, మహారాష్ట్రలోని సోలాపూర్ లో ఉన్నప్పుడు ఒక్కో తెలుగు సినిమాను 20-30 సార్లు చూసేవాడు, తల్లి కళమ్మ పెండ్లి అప్పగింత పాటలు, బతుకమ్మ పాటలు పాడుతుండేది. వాళ్ళ కళను చూసి ప్రణయ్ కి కళారంగం పట్ల ఆసక్తి ఏర్పడింది. రేడియోలో పాటలు వినడంతోపాటు సినిమా పాటల పుస్తకాలలో చూసి పాడటం నేర్చుకొని స్కూల్లో, వినాయక చవితి ఉత్సవాల్లో, ఊర్లో ఎవరిదైనా పెండ్లి అయితే వెళ్ళి అక్కడ పాటలు పాడేవాడు.[11]

విద్యాభ్యాసంసవరించు

మోత్కూర్‌లోని స్థానిక ఉన్నత పాఠశాల్లో పదివరకు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్, భువనగిరిలోని ఎస్.ఎల్.ఎన్.ఎస్. కళాశాలలో డిగ్రి పూర్తి చేసాడు. చిన్నతనం నుండి కళారంగంపై ఆసక్తి ఉండటంతో హైదరాబాద్ వెళ్ళి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో నాటకరంగం (థియేటర్ ఆర్ట్స్) లో పీ.జీ. పూర్తిచేసి, తెలుగులో ప్రపంచ నాటక సాహిత్య అనువాదాలు - ఒక పరిశీలన అనే అంశంపై ఎం.ఫిల్ (థియేటర్ ఆర్ట్స్) చేస్తున్నాడు.[12]

తొలినాళ్ళలోసవరించు

2006లో హైదరాబాదులో అడుగుపెట్టిన ప్రణయ్, హబ్సిగూడలోని హెరిటేజ్ ఫ్రెష్ సూపర్ మార్కెట్‌లో ఉద్యోగం చేసాడు. 2009లో సినిమా ఎడిటింగ్ నేర్చుకొని, కొన్ని షార్ట్ ఫిలిమ్స్‌కి ఎడిటింగ్ చేసాడు.

రంగస్థల ప్రస్థానంసవరించు

చిన్నప్పుడు ఊర్లో చిందు భాగవతాలు.. పౌరాణిక నాటకాలు చూసి తన ఫ్రెండ్స్‌తో కలిసి చిన్న చిన్న స్కిట్స్‌ వేసేవాడు. దాన్ని కొనసాగిస్తూ 2009లో తెలుగు విశ్వవిద్యాలయం రంగస్థల కళాలశాఖ లోని ఎం.పి.ఏ.లో చేరాడు.

నటించినవి - దర్శకత్వం చేసినవిసవరించు

 • నాటికలు: మాయ, ఆంటీగని, డింభకరాజ్యం, పిపీలకం, కల్పితం... కాని నిజం, సంభవామి పదేపదే, శ్రీకృష్ణదేవరాయలు, లయ, ఒహోం ఒహోం భీం, చీమకుట్టిన నాటకం, నేనేడుస్తున్న మీరు నవ్వుకోండి, అంతిమ సంస్కారం, రచ్చబండ (నాటిక).
 • నాటకాలు: యజ్ఞం, అంబేద్కర్ రాజగృహ ప్రవేశం, ఆకాశదేవర.
 • దర్శకత్వం: టాక్స్ ఫ్రీ

యువజనోత్సవాలుసవరించు

 • 2009లో శాస్త్రా విశ్వవిద్యాలయం, మైసూర్ లో జరిగిన దక్షిణ భారత యువజనోత్సవాలలో పాల్గొన్నాడు.
 • 2010లో తంజావూర్ విశ్వవిద్యాలయం, తంజావూరులో జరిగిన దక్షిణ భారత యువజనోత్సవాలలో పాల్గొన్న ప్రణయ్ బృందం, మూఖాభినయ పోటీలో మొదటి బహుమతిని... 2011లో తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో జరిగిన అఖిల భారత యువజనోత్సవాలలో రెండవ బహుమతిని సాధించింది.

థియేటర్ ఔట్రీచ్ యూనిట్సవరించు

యువ నాటకరంగాన్ని ప్రోత్సహించడంకోసం 2012లో హైదరాబాద్ విశ్వవిద్యాలయంలోని రంగస్థల కళాలశాఖ ఆధ్వర్యంలో డా. పెద్ది రామారావు సమన్వయకర్తగా ఏర్పాటుచేసిన థియేటర్ ఔట్రీచ్ యూనిట్ (టి.ఓ.యు)లో ప్రాజెక్ట్ అసిస్టెంట్‌గా చేరి, 2017 వరకు అందులో పనిచేశాడు. అలా ప్రణయ్‌కి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నాటకసంస్థలతో, నాటక ప్రముఖులతో పరిచయం ఏర్పడింది. టి.ఓ.యు. నిర్వహించిన వివిధ నాటకోత్సవాలకు, నాటకరంగ శిక్షణా కార్యక్రమాలకు నిర్వహకుడిగా పనిచేసాడు.

 
ఇటలీలో వికీపీడియా సృష్టికర్త జిమ్మీ వేల్స్ ను కలిసిన ప్రణయ్

పాప్‌కార్న్ థియేటర్ స్థాపనసవరించు

2014, ఫిబ్రవరి 17-23 వరకు న్యూఢిల్లీలో జరిగిన టిఫ్లి అంతర్జాతీయ చిన్నారుల నాటకోత్సవంలో పాల్గొన్న ప్రణయ్, తెలుగు నాటకరంగంలో కృషి చేస్తున్న యువతలో కొంతమంది మిత్రులతో కలిసి 2014, మార్చి 20న హైదరాబాదు అబీడ్స్ లోని గోల్డెన్ త్రెషోల్డ్ లో అమ్మ చెప్పిన కథ అనే నాటిక ప్రదర్శనతో పాప్‌కార్న్ థియేటర్ ను ప్రారంభించాడు. ఆ పాప్‌కార్న్ థియేటర్ ద్వారా చిన్నారులను, యువతను నాటకరంగంవైపు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాడు.[13]

ఇతర నాటకసంస్థలుసవరించు

1. దక్కన్ థియేటర్ స్కాలర్స్ అసోసియేషన్ సభ్యుడిగా ఉంటూ, తెలంగాణలో రంగస్థల విద్యను చదివినవారికి ప్రభుత్వ కళాశాలల్లో, పాఠశాలల్లో ఆధ్యాపకులుగా నియామకంకోసం ప్రయత్నిస్తున్నాడు. 2. తెలంగాణ రంగస్థల సమాఖ్యకు కోశాధికారిగా ఉంటూ తెలంగాణ నాటకరంగ చరిత్రను వెలికితీస్తూ, తెలంగాణలో యువ నాటకరంగ అభివృద్ధికి కృషి చేస్తున్నాడు.

టీవీరంగ ప్రస్థానంసవరించు

2010లో జెమినీ టీవీలో వచ్చిన "దేవత", 2015లో దూరదర్శన్ లో వచ్చిన "చంటిగాడు స్వయంవరం" ధారావాహికలకు సహాయ దర్శకుడిగా పనిచేసాడు.

చలనచిత్ర రంగంసవరించు

2015లో వచ్చిన "ఎ-ఫైర్" చిత్రానికి ప్రచారకర్తగా, 2017లో వచ్చిన "అవంతిక" చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేసాడు. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో మామిడి హరికృష్ణ పర్యవేక్షణలో రవీంద్రభారతిలోని పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ వేదికగా జరిగే వివిధ సినిమా కార్యక్రమాలకు కో-ఆర్డినేటర్‌గా చేస్తూ తెలంగాణ సినిమా నిర్మాణానికి కృషి చేస్తున్నాడు.

 
తెలుగు వికీపీడియా పదకొండవ వార్షికోత్సవంలో జ్యోతి ప్రజ్వలన చేస్తున్న ప్రణయ్

తెలుగు వికీపీడియాలో సేవలుసవరించు

తనకు తెలిసిన సమాచారాన్ని ఇతరులకు అందించే అలవాటున్న ప్రణయ్, తెలుగు భాషాభివృద్ధి చేయాలనే తలంపుతో 2013, మార్చి 8న తెలుగు వికీపీడియాలో చేరాడు. వికీపీడియాలో అనేక నాటకరంగ ప్రముఖులు, తెలుగు ప్రముఖుల, తెలంగాణ అంశాల వ్యాసాలతోపాటు అనేక విశేష వ్యాసాలను రాసి విజ్ఞాన సర్వస్వాన్ని భాషాభిమానుల చేరువకు చేరుస్తున్నాడు.[14] వికీ శిక్షణా శిబిరాలు, సమావేశాలు నిర్వహిస్తూ వివిధ కార్యక్రమాలలో పాల్గొంటున్నందుకు 2016, నవంబరు 8వ తేదిన తెలుగు వికీపీడియా నిర్వాహకుడి హోదా వచ్చింది.

 • 2014లో విజయవాడలో జరిగిన దశాబ్ది ఉత్సవాలకు, 2015లో తిరుపతిలో జరిగిన పదకొండో వార్షికోత్సవాలకు ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించాడు.[15][16]
 • 2016, జూన్‌లో ఇటలీలోని ఏసినో లారియోలో జరిగిన వికీమేనియా-2016 కార్యక్రమంలో తెలుగు వికీపీడియా తరపున పాల్గొన్నాడు.
 • 2016, ఆగస్టులో చండీగఢ్ లో జరిగిన వికీమీడియా ఇండియా కాన్ఫిరెన్స్ -2016లో తెలుగు వికీపీడియా తరపున పాల్గొని, పంజాబ్ ఎడిటథాన్ పోటీలో తెలుగు వికీపీడియా విజయం సాధించడంలో సహచరులతో పాటు విశేష కృషిచేసాడు.
 • తెలుగు వికీపీడియాలో వ్యాసాలు రాస్తూనే వికీపీడియా శిక్షణా శిబిరాలు, సమావేశాలు నిర్వహిస్తున్నాడు.
 • తెలుగు వికీపీడియా గురించి అందరికి తెలిసేలా వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారం కల్పిస్తున్నాడు. ప్రణయ్ కృషిని గుర్తించిన వికీమీడియా పౌండేషన్ వారు ప్రతి ఏటా నిర్వహించే వికీపీడియా అంతర్జాతీయ సదస్సులో భాగంగా 2016లో ఇటలీలో నిర్వహించిన "వికీమేనియా 2016"కు ఆహ్వానించారు.[17]
 • ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల వికీపీడియాలో జరుగుతున్న 100 రోజులు -100 వికీవ్యాసాలు అనే ఛాలెంజ్‌ను ప్రణయ్ పూర్తిచేసాడు. సెప్టెంబరు 8, 2016 నుండి డిసెంబరు 16, 2016 మధ్యకాలంలో 100 వికీ వ్యాసాలు పూర్తిచేసాడు.[18][19]
 • వికీపీడియాలో వ్యాసాలు రాస్తున్న ప్రణయ్ 'వికీవత్సరం' అనే కాన్సెప్ట్‌తో 365రోజులు - 365 వ్యాసాలు రాసి, ప్రపంచం మొత్తంలో ఈ ఘనత సాధించిన మొదటి వికీపీడియన్‌గా చరిత్ర సృష్టించాడు.[20] 2016, సెప్టెంబర్ 8న తెలుగు వికీపీడియాలో ప్రతిరోజు ఒక వ్యాసం చొప్పున రాస్తూ 2017, సెప్టెంబర్ 7న 'వికీవత్సరం' పూర్తిచేశాడు. ఈ సందర్భంగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రణయ్‌కు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అభినందనలు తెలిపాడు.[21] రాష్ట్ర మంత్రి కేటీఆర్ కూడా తన ట్విట్టర్, ఫేస్‌బుక్ ద్వారా అభినందనలు తెలుపడమేకాకుండా ప్రగతి భవన్ లోని తన ఛాంబర్‌లో సత్కరించాడు.[22]
 • 2019, జూన్ 4న 1000 రోజులు - 1000 వ్యాసాలు పూర్తిచేశాడు.[23][24]
 • అలాగే 2020, అక్టోబర్ 17 నాటికి 1500 రోజులు - 1500 వ్యాసాలు పూర్తిచేశాడు. అలాగే మరింత ముందుకు ఈ వికి ఛాలెంజ్‌ సాగుతూనే ఉంది.
 
2016లో జరిగిన హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో వికీపీడియా ఏర్పాటు చేసిన స్టాల్ లో ప్రణయ్ రాజ్
 • 2021లో తెలుగు వికీపీడియా ప్రాజెక్టు గ్రాంట్‌కు ఎంపికయ్యాడు.[25][26]

పురస్కారాలుసవరించు

 1. లోకలైజేషన్ (స్థానికీకరణ) అవార్డు - 2018: 2018 తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా జూన్ 1న తెలంగాణ ప్రభుత్వ సమాచార, సాంకేతిక (ఐటీ) శాఖ నిర్వహించిన వార్షిక నివేదిక కార్యక్రమంలో రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చేతలమీదుగా లోకలైజేషన్ (స్థానికీకరణ) విభాగంలో తొలి అవార్డును ప్రణయ్ అందుకున్నాడు.[27]
 2. ఐ స్టాండ్ ఫర్ ది నేషన్ - శ్రేష్ఠ పేవా పురస్కారం 2019 (గాంధీ జయంతి వేడుకలు, తారమతి బరాదారి, హైదరాబాదు. 02.10.2019)
 3. తెలంగాణ జాతీయ పురస్కారం - 2017 (తెలంగాణ కళాపరిషత్, ఖమ్మం వారి తెలంగాణ దసరా వేడుకలు-2017. 24.09.2017) - తెలుగు వికీపీడియా కృషి[28][29][30]
 4. తెలంగాణ ప్రతిభా పురస్కారం - 2017 (నటరాజ్ డ్యాన్స్ అకాడమీ, హైదరాబాద్, 28.07.2017) - తెలుగు వికీపీడియా కృషి[31][32]
 5. తెలంగాణ ఉగాది పురస్కారం - 2017 (తెలంగాణ కళాపరిషత్, ఖమ్మం. 19.03.2017) - తెలుగు వికీపీడియా కృషి[33]

మూలాలుసవరించు

 1. ప్రణయ్ రాజ్ కు ఉగాది పురస్కారం
 2. ఆంధ్రజ్యోతి, సాహిత్య వార్తలు (9 April 2017). "కళా..పాప్‌కార్న్." Archived from the original on 30 November 2018. Retrieved 30 November 2018.
 3. "గోల్డెన్ త్రెషోల్డ్ లో "దావత్"". Archived from the original on 2016-06-15. Retrieved 2017-03-21.
 4. ఈనాడు, ఆదివారం అనుబంధం సంచిక (15 October 2017). "రోజుకో వ్యాసం... ఏడాది యజ్ఞం!". Archived from the original on 15 October 2017. Retrieved 17 September 2018.
 5. నమస్తే తెలంగాణ, జిందగీ న్యూస్ (19 September 2017). "వికీ వ్యాసాల ప్రణయ్". Archived from the original on 19 September 2017. Retrieved 4 October 2017.
 6. ఈనాడు, ప్రత్యేక కథనాలు (18 September 2017). "వికీపీడియాలో తెలుగు వెలుగు". Retrieved 4 October 2017.
 7. వికీమీడియా బ్లాగ్, COMMUNITY, PROFILES, WIKIPEDIA. "Pranayraj Vangari has written a new Wikipedia article every day for the last year". blog.wikimedia.org. Retrieved 4 October 2017.
 8. inspiretelangana. "Pranay Raj Vangari: A guy from Hyderabad created World Record in Wikipedia". inspiretelangana.org. Retrieved 4 October 2017.
 9. ETV Bharat News (28 March 2021). "డిజిటల్‌ మాధ్యమంలో తెలుగువెలుగులు". Archived from the original on 24 ఆగస్టు 2021. Retrieved 24 August 2021.
 10. ఈనాడు, ప్రధానాంశాలు (28 March 2021). "చరిత్రలో మనకో పేజీ". www.eenadu.net. Archived from the original on 2 April 2021. Retrieved 2 April 2021.
 11. నమస్తే తెలంగాణ, లైఫ్ స్టోరి (బతుకమ్మ ఆదివారం సంచిక) (12 July 2020). "వికీపీడియానే.. ప్రణయ్‌ రాజ్యం!". ntnews. దాయి శ్రీశైలం. Archived from the original on 13 July 2020. Retrieved 13 July 2020.
 12. V6 Velugu (26 August 2021). "వికీపీడియాలో యాదాద్రి యువకుడి వ్యాసాలు" (in ఇంగ్లీష్). Archived from the original on 8 September 2021. Retrieved 8 September 2021.
 13. ఆంధ్రజ్యోతి. "కళా.. పాప్‌కార్న్". Archived from the original on 30 November 2018. Retrieved 29 July 2017.
 14. సాక్షి, హైదరాబాదు, పుట 20. (14 October 2015). "పుస్తకాలు ప్రజలకే అంకితం". Archived from the original on 14 October 2018. Retrieved 2 April 2021.CS1 maint: multiple names: authors list (link)
 15. The Hindu, Andhra Pradesh - Thirupathi (16 February 2015). "More online free content in Telugu Wikipedia soon". A.D. Rangarajan. Archived from the original on 7 May 2019. Retrieved 7 May 2019.
 16. యూత్ స్పెషల్ : అది అతనికో మిషన్
 17. కంప్యూటర్ ఫర్ యు పత్రిక - ఏప్రిల్ 2016 - 37వ పుట
 18. ప్రణయ్ రాజ్ ను సన్మానిస్తున్న హరికృష్ణ
 19. వెబ్ ఆర్కైవ్. "జ్ఞానా భాండాగారం తెలుగు వికీపీడియా". Retrieved 30 August 2017.
 20. వి6 న్యూస్, వార్తలు  » రాష్ట్రీయ వార్తలు (September 8, 2017). "వికీపీడియాలో మోత్కూరు వాసి ప్రపంచ రికార్డు". Archived from the original on 10 September 2017. Retrieved 4 October 2017.
 21. ఈనాడు, యాదాద్రి భువనగిరి జిల్లా ఎడిషన్.10.09.2017.
 22. telanganatoday (12 September 2017). "KTR congratulates Telugu Wikipedia Volunteer". Retrieved 4 October 2017.
 23. ఈనాడు, తెలంగాణ (6 June 2019). "వికీపీడియాలో వెయ్యి రోజుల్లో వెయ్యి వ్యాసాలు". Archived from the original on 6 June 2019. Retrieved 13 June 2019.
 24. మన తెలంగాణ, తెలంగాణ (6 June 2019). "వికీపీడియలో రికార్డు సృష్టించిన మోత్కూర్ యువకుడు". Archived from the original on 6 June 2019. Retrieved 13 June 2019.
 25. Eenadu. "'వికీపీడియా గ్రాంటు'కు ప్రణయ్‌రాజ్‌". Archived from the original on 24 ఆగస్టు 2021. Retrieved 24 August 2021.
 26. Namasthe Telangana (23 August 2021). "Wikipedia : వికీపీడియా ప్రాజెక్టు గ్రాంట్‌కు ప్రణయ్‌రాజ్‌ ఎంపిక". Archived from the original on 24 ఆగస్టు 2021. Retrieved 24 August 2021.
 27. నమస్తే తెలంగాణ, యాదాద్రి భువనగిరి జిల్లా (2 June 2018). "వికీపీడియా ప్రణయ్‌రాజ్ కు ఐటీశాఖ అవార్డు". Archived from the original on 19 September 2017. Retrieved 4 October 2017.
 28. ఈనాడు, యాదాద్రి భువనగిరి జిల్లా ఎడిషన్, (25.09.2017)
 29. సాక్షి, యాదాద్రి భువనగిరి జిల్లా ఎడిషన్, (25.09.2017)
 30. ఆంధ్రజ్యోతి, యాదాద్రి భువనగిరి జిల్లా ఎడిషన్, (25.09.2017)
 31. సాక్షి. "కళాకారులకు ప్రతిభా పురస్కారాలు". Archived from the original on 29 July 2017. Retrieved 29 July 2017.
 32. ఆంధ్రజ్యోతి. "పలువురికి ప్రతిభా పురస్కారాలు". Retrieved 29 July 2017.
 33. సాక్షి పత్రిక - యాదాద్రి జిల్లా ఎడిషన్ - 18వ పుట - ప్రణయ్ రాజ్ కు ఉగాది పురస్కారం

ఇతర లింకులుసవరించు