రత్నగిరి కృష్ణవేణి
రత్నగిరి కృష్ణవేణి రంగస్థల నటి.
రత్నగిరి కృష్ణవేణి | |
---|---|
జననం | రాజవరపు కృష్ణవేణి 1947 నూజివీడు, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్, |
నివాస ప్రాంతం | ఆంధ్రప్రదేశ్ |
వృత్తి | రంగస్థల నటి |
మతం | హిందు |
తండ్రి | రాజవరపు వీరాస్వామి |
తల్లి | రామమ్మ |
జననం
మార్చుకృష్ణవేణి 1947వ సంవత్సరం రాజవరపు వీరాస్వామి, రామమ్మ దంపతులకు కృష్ణా జిల్లా నూజివీడులో జన్మించింది. తన 9వ ఏట పునర్జన్మ నాటిక ద్వారా రంగస్థల ప్రవేశంచేసి, 5 దశాబ్దలలో శతాధికంగా నాటక/నాటిక ప్రదర్శనల్లో పాత్రలు ధరించింది.
నటిగా
మార్చుసాధన, కసాయిగుండె, మండే గుండెలు - ఎండే పెదవులు, నటన, నటరాజు, కళ్ళు, ఛాయ, మల్లెపూలు, తప్పెవరిది, పట్టాలు తప్పినబండి, ఊరుమ్మడి బతుకులు, కదలిక, రగిలిన జ్వాల, సార్వభౌముడు, కాలజ్ఞానం, దేవుడు, మద్యంలో మానవుడు, సర్పయాగం, పల్లెపడుచు, కీలుబొమ్మలు, అన్నాచెల్లెలు, నటనాలయం, విడాకులు, కనకపుష్యరాగం మొదలగు నాటిక/నాటకాల్లో నటించింది. కుంతి, శబరి ఏకపాత్రాభినయ ప్రదర్శలనలిచ్చింది. సినీ నటుటు రావుగోపాలరావు, కొమ్మినేని శేషగిరిరావు, ప్రసాద్ బాబు, నిర్మలమ్మ మొదలైనవారితో కలిసి నాటక ప్రదర్శనల్లో పాల్గొన్నది.
సత్కారాలు, అవార్డులు
మార్చు- సంస్కృతి సమ్మేళనం - గూడురు వారిచే, ఏలూరులో రంగస్థల నటుడు పీసపాటి నరసింహమూర్తి చేతుల మీదుగా
- కీ.శే. కామేశ్వరరావు మెమోరియల్ పరిషత్తు - నెల్లూరు వారిచే డా. ఎస్.పి.బాలసుబ్రమణ్యం చేతుల మీదుగా
- మద్రాసులోని పద్మశ్రీ డా. శివాజి గణేషన్ సంప్థవారిచే
- కళింగపట్నం కళాపరిషత్తు వారిచే ఎస్.వి. రంగారావు అవార్డు
- కడప - వై.ఎమ్.డి.ఏ. వారిచే శ్రీమతి పసుపులేటి కన్నాంబ అవార్డు
- శ్రీ వేంకటేశ్వర నాట్య కళాపరిషత్తువారి ప్రతిష్ఠాత్మక ’గరుడపురస్కారం‘ (రూ. 10,000/- నగదు), 2008 జూన్ 9, మహాతి కళాక్షేత్రం, తిరుపతి
మూలాలు
మార్చురత్నగిరి కృష్ణవేణి, కళాదీపికలు (సమకాలీన రంగస్థల నటీమణులు), ప్రథమ ముద్రణ, సంపాదకులు: వి.ఎస్. రాఘవాచారి., కళాదీపిక మాసపత్రిక, తిరుపతి, అక్టోబరు 2011, పుట. 32.