రమేష్ చంద్ సక్సేనా (1944 సెప్టెంబరు 20 - 2011 ఆగస్టు 16) [1] 1967లో ఒక టెస్ట్ మ్యాచ్ ఆడిన భారతీయ క్రికెటరు. అతను బీహార్ రంజీ జట్టులో గొప్ప బ్యాటరు. బీహార్, జార్ఖండ్‌లలో చాలా మంది క్రికెటర్లకు అతను మెంటర్‌గా ఉన్నాడు.

రమేష్ సక్సేనా
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
Ramesh Chand Saxena
పుట్టిన తేదీ(1944-09-20)1944 సెప్టెంబరు 20
ఢిల్లీ, బ్రిటిషు భారతదేశం
మరణించిన తేదీ2011 ఆగస్టు 16(2011-08-16) (వయసు 66)
జంషెడ్‌పూర్, జార్ఖండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుLegbreak
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 115)1967 జూన్ 8 - ఇంగ్లాండ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు First-class
మ్యాచ్‌లు 1 149
చేసిన పరుగులు 25 8,155
బ్యాటింగు సగటు 12.50 40.37
100లు/50లు 0/0 17/42
అత్యధిక స్కోరు 16 202*
వేసిన బంతులు 12 1,716
వికెట్లు 0 33
బౌలింగు సగటు 28.27
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 4/24
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 65/–
మూలం: CricInfo, 2022 నవంబరు 20

జీవితం, కెరీర్ మార్చు

సక్సేనా 1960/61 సీజన్‌లో 16 ఏళ్ల వయస్సులో ఢిల్లీ వర్సెస్ సదరన్ పంజాబ్ తరఫున ఫస్ట్-క్లాస్ ప్రవేశం చేశాడు. అతని మొదటి ఫస్ట్-క్లాస్ ఇన్నింగ్స్‌లో అజేయంగా 113 పరుగులు చేశాడు. [2] 1965-66 వరకు ఢిల్లీ తరపున ఆడి, తర్వాత బీహార్‌కు మారాడు. 1966-67 నుండి 1981-82 వరకు అక్కడ ఆడాడు. దులీప్ ట్రోఫీలో నార్త్ జోన్, ఈస్ట్ జోన్ల తరపున కూడా ఆడాడు. [3] అతని అత్యధిక స్కోరు, 1969-70 లో అస్సాంపై బీహార్ తరఫున 202 నాటౌట్. [4] అతను భారతదేశంలో స్పిన్ బౌలింగ్‌లో అత్యుత్తమ ఆటగాడిగా ఖ్యాతి పొందాడు. [5]


సక్సేనా 1967లో లీడ్స్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారతదేశం తరఫున తన తొలి మ్యాచ్‌ ఆడాడు. ఇంగ్లండ్ మొదట బ్యాటింగ్ చేసి 550/4 వద్ద డిక్లేర్ చేసింది. జెఫ్రీ బాయ్‌కాట్ అజేయంగా 246 పరుగులు, సక్సేనా 2 ఓవర్లు వేసాడు. వికెట్లేమీ తీసుకోలేదు. తర్వాత అతను ఫరోఖ్ ఇంజనీర్‌తో కలిసి భారత ఇన్నింగ్స్‌లో ఓపెనింగ్ చేశాడు. అయితే కేవలం 9 పరుగులకే ఔట్ అయ్యాడు. భారత్ 164 పరుగులకే ఆలౌట్ అయ్యి ఫాలో ఆన్ ఆడింది. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో మెరుగైన ప్రదర్శన చేసి, 510 పరుగులకు ఆలౌటైంది, అయితే 7 వ స్థానంలో బ్యాటింగ్ చేసిన సక్సేనా 16 పరుగులు మాత్రమే చేసాడు. ఆ తర్వాత ఇంగ్లండ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.[6] అతను ఆ సంవత్సరం చివర్లో భారత జట్టుతో కలిసి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో పర్యటించాడు కానీ ఎనిమిది టెస్ట్ మ్యాచ్‌లలో దేనిలోనూ ఆడలేదు.[7]

అతను ఐదు సీజన్లలో బీహార్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు. దులీప్ ట్రోఫీలో అనేక సార్లు ఈస్ట్ జోన్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు.

1980 లలో అతను టెస్ట్ సెలెక్టర్‌గా పనిచేశాడు. [8] గుండెపోటుతో, పర్యవసానంగా వచ్చిన అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో మరణించాడు. అతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. "Former India batsman Ramesh Saxena dies" Retrieved 15 September 2013.
  2. "Delhi v Southern Punjab 1960-61". Cricinfo. Retrieved 9 April 2019.
  3. "Ramesh Saxena". CricketArchive. Retrieved 9 April 2019.
  4. "Bihar v Assam 1969-70". CricketArchive. Retrieved 9 February 2020.
  5. Murzello, Clayton (21 September 2011). "Remembering Ramesh Saxena". mid-day.com. Retrieved 9 February 2020.[permanent dead link]
  6. "1st Test, India tour of England at Leeds, Jun 8-13 1967". Cricinfo. Retrieved 9 February 2020.
  7. T. L. Goodman, "India in Australasia, 1967-68", Wisden 1969, pp. 836–58.
  8. Wisden, 2012, p. 220.