పిలాని
?Pilani రాజస్థాన్ • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 28°22′N 75°36′E / 28.37°N 75.6°E | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
విస్తీర్ణం • ఎత్తు |
• 279 మీ (915 అడుగులు) |
జిల్లా (లు) | ఝున్ఝును జిల్లా |
జనాభా | 26,219 (2001 నాటికి) |
కోడులు • పిన్‌కోడ్ • ప్రాంతీయ ఫోన్ కోడ్ |
• 333031 • +91-1596 |
పిలాని రాజస్థాన్ రాష్ట్రంలోని ఒక పట్టణం. ఇది బిట్స్ విద్యా సంస్థల ద్వారా ప్రసిద్ధి చెందినది
చరిత్ర
మార్చుఈ నగరం ఘనశ్యాం దాస్ యొక్క జన్మస్థలం, పిలానియా గోత్రానాకి సంభందించిన ఒకానొక వీరుని పరాక్రమానికి మెచ్చి అప్పటి రాజు ఈ ప్రాంతానికి ఈ పేరును నిర్ణయించాడు. పిలాని పట్టణం చాల చిన్న పట్టణం. ఇది సూరజ్ గర్ పట్టణానికి 6 కిలోమీటర్ల దూరంలో కలదు.
విద్యాసంస్థలు
మార్చుపిలాని ఘనశ్వాం దాస్ సొంత ఊరు కావడంతో అక్కడ పలు విద్యా సౌకర్యాలను ఏర్పాటు చేసారు. వాటిలో కొన్ని
- పిలానిలో ప్రతిష్థాత్మకమైన "బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్" (బిట్స్)సంస్థను 1964 లో స్థాపించారు.
- బి.కె. బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ (బికెబైట్)
- .ఇంద్రమని మాండేలియ బాలికా కళాశాల
- షాదిలాల్ కటారియా టీచర్ ట్రైనింగ్ కళాశాల
- జి.డి.బిర్లా మొమోరియల్ పాలిటెక్నిక్ ఇనిస్టిట్యూట్
- శ్రీధర్ యునివెర్సీటీ
- బిర్లా పబ్లిక్ స్కూల్
- బిర్లా బాలికా విద్యానికేతన్
- బిర్లా శిశు విహార్
రవాణా సౌకర్యాలు
మార్చుపిలాని పట్టణానికి నేరుగా రైలు సౌకర్యం లేదు. దగ్గర్లోని రైల్వే స్టేషను చిరావా వద్దనున్నది. 220 కి.మీ దూరంలో ఉన్న జైపూర్, 210 కి.మీ దూరంలో ఉన్న ఢిల్లీ నగరాలకి రోడ్డుమార్గాన చేరుకోవచ్చు.
ఇతర విశేషాలు
మార్చుపిలానిలో చూడవలసిన ప్రదేశాలలో కొన్ని
- బిట్స్ పిలాని కాంపస్
- బిర్లా మ్యూజియం
- ఆదిత్య బిర్లా మొమోరియల్ గ్రూప్ సర్స్వతి మందిరం
- శివగంగ కాలువ
- రామ మందిరం, ఉద్యానవనం
- షిర్డీ సాయిబాబా దేవాలయం, దుర్గ మందిరం