రాంప్రీత్ మండల్

రాంప్రీత్ మండల్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఝంఝర్పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

రాంప్రీత్ మండల్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
23 మే 2019
ముందు బీరేంద్ర కుమార్ చౌదరి
నియోజకవర్గం ఝంఝార్‌పూర్

వ్యక్తిగత వివరాలు

జననం (1956-01-01) 1956 జనవరి 1 (వయసు 68)
దుర్గిపట్టి (ఖుతౌనా)
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ జనతాదళ్ (యునైటెడ్)
తల్లిదండ్రులు థాకన్ మండల్
జీవిత భాగస్వామి సరస్వతీ దేవి
సంతానం 5
నివాసం దుర్గిపట్టి
వృత్తి రాజకీయ నాయకుడు
మూలం [1]

రాజకీయ జీవితం

మార్చు

రాంప్రీత్ మండల్ జనతాదళ్ (యునైటెడ్) పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2006లో దుర్గిపట్టి గ్రామా సర్పంచ్‌గా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఝంఝర్పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి జేడీయూ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి రాష్ట్రీయ జనతాదళ్ అభ్యర్థి గులాబ్ యాదవ్‌పై 3,22,951 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

రాంప్రీత్ మండల్ 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఝంఝర్పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి జేడీయూ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి మండల్ వికాశీల్ ఇన్సాన్ పార్టీ అభ్యర్థి సుమన్ కుమార్ మహాసేత్‌పై 3,48,863 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2][3][4]

మూలాలు

మార్చు
  1. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Jhanjharpur". Archived from the original on 5 August 2024. Retrieved 5 August 2024.
  2. TimelineDaily (6 June 2024). "Know About JD(U)'s Ramprit Mandal And His Victory In Bihar's Jhanjharpur" (in ఇంగ్లీష్). Archived from the original on 5 August 2024. Retrieved 5 August 2024.
  3. TV9 Bharatvarsh (7 June 2024). "झंझारपुर लोकसभा सीट से जीतने वाले जेडीयू के रामप्रीत मंडल कौन हैं, जानिए अपने सांसद को". Archived from the original on 5 August 2024. Retrieved 5 August 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. "Lok Sabha polls 2024: Janata Dal (U), Telugu Desam Party winners full list". 5 June 2024. Archived from the original on 5 August 2024. Retrieved 5 August 2024.