రాకాసి లోయ
(1983 తెలుగు సినిమా)
దర్శకత్వం విద్యాసాగర్ రెడ్డి
తారాగణం విజయ నరేష్,
విజయశాంతి
నిర్మాణ సంస్థ అమలేశ్వరి ఫిల్మ్స్
భాష తెలుగు

నిర్మాణంసవరించు

అభివృద్ధిసవరించు

పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన సాగర్ కు రాకాసి లోయ తొలి సినిమా. పన్నెండేళ్లకు పైగా దర్శకత్వ శాఖలో పనిచేసిన సాగర్ తనకు క్రాఫ్ట్ పై పట్టు వచ్చిందన్న నమ్మకం కలిగాకా కృష్ణ హీరో పాత్రలో "నటశేఖర సవాల్" అన్న స్క్రిప్ట్ రాసుకుని ఆయనను కథానాయక పాత్రలో చేయమంటూ వినిపించారు. కథ నచ్చినా అప్పటికి కిరాయి కోటిగాడు సినిమా విజయం సాధించడంతో కృష్ణ చాలా సినిమాల్లో నటిస్టూ బిజీ అయిపోయారు. దాంతో కొన్నాళ్ళు ఆగమని సూచించారు కృష్ణ. ఈ విషయం తెలిసిన విజయనిర్మల అసిస్టెంట్ విఠల్ సాగర్ ని కలిసి నరేష్ హీరోగా ఓ సినిమా చేసిపెట్టమని కోరారు. దాంతో ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది. మొదటి సినిమా కనుక కమర్షియల్ సక్సెస్ పొందాలంటే యాక్షన్ సినిమా సరైనదని, దానికి ఎడ్వంచర్ తోడైతే ఇంకా బావుంటుందని భావించి ఈ స్క్రిప్ట్ అభివృద్ధి చేసుకున్నారు.
రాకాసిలోయ అనే టైటిల్ నిర్ణయించడానికి వెనుక దర్శకుని చిన్ననాటి కల ఉంది. సాగర్, ఆయన స్నేహితులు చిన్నతనంలో చందమామ కథల పుస్తకంలోని రాకాసిలోయ సీరియల్ చదివి పెద్దయ్యాకా దాన్ని సినిమాగా తీయాలనుకోవడమే కాక పలురకాలుగా తీసేందుకు అమాయకమైన ప్లాన్లు వేసుకునేవారు. అలా సినిమా కథకు, ఆ ధారావాహిక కథకు సంబంధం లేకున్నా ఈ ఎడ్వంచర్ కథకు సరిపోవడం, చిన్ననాటి నుంచి తనకు ఆ పేరంటే ఉన్న ఆకర్షణ కలిసి సినిమాకు దర్శకుణ్ణి రాకాసి లోయ అన్న పేరు పెట్టేలా చేశాయి.[1]

విడుదల, స్పందనసవరించు

రాకాసిలోయ సినిమా ప్రేక్షకాదరణ పొంది కమర్షియల్ గా మంచి సక్సెస్ గా నిలిచింది.[1]

మూలాలుసవరించు

  1. 1.0 1.1 "మొదటి సినిమా-సాగర్, నవతరంగం వెబ్సైట్లో". మూలం నుండి 2010-06-26 న ఆర్కైవు చేసారు. Retrieved 2015-08-21. Cite web requires |website= (help)