కిరాయి కోటిగాడు
కిరాయి కోటిగాడు 1983, మార్చి 17న విడుదలైన తెలుగు చలనచిత్రం. రాంప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై ఎన్. నాగలింగేశ్వరరావు నిర్మాణ సారథ్యంలో ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణ, శ్రీదేవి జంటగా నటించగా, కె. చక్రవర్తి సంగీతం అందించాడు.[1]
కిరాయి కోటిగాడు | |
---|---|
దర్శకత్వం | ఎ.కోదండరామిరెడ్డి |
రచన | సత్యానంద్ (మాటలు) |
స్క్రీన్ ప్లే | ఎ.కోదండరామిరెడ్డి |
కథ | సత్యమూర్తి |
నిర్మాత | ఎన్. నాగలింగేశ్వరరావు |
తారాగణం | కృష్ణ, శ్రీదేవి |
కూర్పు | కె. వెంకటేశ్వరారావు |
సంగీతం | కె. చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | రాంప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ |
విడుదల తేదీs | మార్చి 17,1983 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథ
మార్చుఇద్దరు భూస్వాముల చుట్టూ ఈ చిత్ర కథ తిరుగుతుంది. గ్రామంలో ప్రజలను దోపిడి చేయడానికి కోటిగాడు అనే వ్యక్తి వారికి సహకరిస్తుంటాడు. గ్రామంలోకి వచ్చిన సైనిక అధికారి రాంబాబు వారికి ఎదురు తిరుగుతాడు. దాంతో గ్రామంలో గొడవలు జరుగుతాయి. గౌరీ అనే గ్రామ అమ్మాయి కోటిగాడిని మంచి వైపు మళ్ళించడంతో అతను భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాడు.
తారాగణం
మార్చు- కృష్ణ - కోటిగాడు
- శ్రీదేవి
- రావు గోపాలరావు
- అల్లు రామలింగయ్య
- గిరిబాబు
- శ్రీధర్
- ముచ్చర్ల అరుణ
- జయమాలిని
- నిర్మల
- జయవిజయ
- శ్రీలక్ష్మి
- లావణ్య
- పి.జె.శర్మ
- టెలిఫోన్ సత్యనారాయణ
- సుత్తి వేలు
- చిడతల అప్పారావు
- భీమరాజు
- మదన్ మోహన్
- క్రాంతి
- సాయికుమార్
సాంకేతికవర్గం
మార్చు- చిత్రానువాదం, దర్శకత్వం: ఎ.కోదండరామిరెడ్డి
- నిర్మాత: ఎన్. నాగలింగేశ్వరరావు
- మాటలు: పి. సత్యానంద్
- కథ: సత్యమూర్తి
- సంగీతం: కె. చక్రవర్తి
- కూర్పు: కె. వెంకటేశ్వరారావు
- నిర్మాణ సంస్థ: రాంప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్
విడుదల - స్పందన
మార్చుఈ చిత్రం 1983, మార్చి 17న విడుదలైంది.[2] ఈ చిత్రం హైదరాబాదు ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ లోని దేవి థియేటర్ లో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో నడిచింది.[3] ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతమైంది.[4]
ఇతర వివరాలు
మార్చు- కృష్ణ పోషించిన కథానాయకుడు కోటిగాడు ఎంట్రీ సీన్ చిత్రానికి హైలెట్ గా నిలిచింది.
- ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించినందుకు దర్శకుడు కృష్ణతో కలిసి రామరాజ్యంలో భీమ రాజు అనే మరో చిత్రం రూపొందించాడు.
పాటలు
మార్చుపాటపేరు | గాయకులు | నిడివి |
---|---|---|
ఎక్కితొక్కి నీ అందం | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల | 4:08 |
నమస్తే సుస్వాగతం | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల. రచన: వేటూరి | 4:20 |
చీకటెప్పుడవుతుందో శ్రీరామ | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి | 3:32 |
పట్టుమీద ఉన్నాది | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల | 3:52 |
కూడబలుక్కుని కన్నారేమో | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల | 4:01 |
మూలాలు
మార్చు- ↑ Movie GQ. "Kirayi Kotigadu 1983 film". Retrieved 14 August 2020.
- ↑ "Kirayi Kotigadu film info". telugu.filmibeat.com. Retrieved 14 August 2020.
- ↑ Seetarama Raju (17 March 2019). "36 years for Kirayi Kotigadu". Retrieved 14 August 2020.
- ↑ Murali Krishna CH (26 February 2018). "Sridevi, the darling of Telugu Cinema". cinemaexpress.com. Archived from the original on 8 జూలై 2020. Retrieved 14 August 2020.