రాజశేఖర్ పాపోలు

రాజశేఖర్ పాపోలు ఒక తెలుగు చలనచిత్ర నిర్మాత. బృహస్పతి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను స్థాపించి టెక్నాలజీ రంగంలో విశేష సేవలు అందిస్తున్నారు.[1] అంతేకాకుండా బృహస్పతి ఎంటర్టైన్మెంట్స్ బ్యానరులో మీడియా సంస్థను ఏర్పాటుచేసి లేచింది మ‌హిళా లోకం అనే సినిమాను నిర్మించారు.[2] సెలబ్రిటీ సూపర్ 7 పేరుతో ఓ లీగ్ ని నిర్వహించారు.

రాజశేఖర్ పాపోలు
రాజశేఖర్ పాపోలు
జననం
రాజ

12-05-1987
ఇతర పేర్లుపి. రాజశేఖర్
వృత్తిబిజినెస్
సుపరిచితుడు/
సుపరిచితురాలు
చలనచిత్ర నిర్మాత, బృహస్పతి టెక్నాలజీస్ ఎండి
ఎత్తు5.6
జీవిత భాగస్వామిహైమావతి పాపొలు
పిల్లలుమోక్ష పాపోలు
తల్లిదండ్రులు
  • బ్రహ్మారావు (తండ్రి)
  • సీతామహాలక్ష్మి (తల్లి)

జీవిత విశేషాలు

మార్చు

పశ్చిమ గోదావరి జిల్లా, ఆకివీడు మండలం, పెదకాపవరం గ్రామంలో జన్మించారు. తండ్రి పేరు బ్రహ్మారావు, తల్లి పేరు సీతామహాలక్ష్మి.

బృహస్పతి టెక్నాలజీస్

మార్చు

రాజశేఖర్ మేనేజింగ్ డైరెక్టర్ గా బృహస్పతి టెక్నాలజీస్ ప్రారంభించబడి, సీసీ కెమెరాల ఏర్పాటులో దేశంలోనే ప్రముఖ సంస్థగా గుర్తింపు పొందింది.[3] సీసీ కెమెరాల ఏర్పాటుతోపాటు, ఇంటి ఆటోమేషన్‌ సిస్టమ్‌ ద్వారా లైటింగ్, రిఫ్రిజిరేటర్, ఏసి, ఫ్యాన్‌లు, హోమ్ థియేటర్, మ్యూజిక్ సిస్టమ్ వంటి ప్రతి ఎలక్ట్రానిక్ పరికరాన్ని స్మార్ట్ ఫోన్ నుండి ఆపరేట్ చేసే సదుపాయాన్ని కూడా అందిస్తున్నారు.[4]

సెలబ్రిటీ సూపర్ 7

మార్చు

బుల్లితెర, వెండితెరకు చెందిన కొంతమంది సెలబ్రిటీలలో సెలబ్రిటీ సూపర్ 7 పేరుతో బృహస్పతి టెక్నాలజీస్, బృహస్పతి ఎంటర్టైన్మెంట్ కలిసి ఒక క్రికెట్ లీగ్ నిర్వహించింది. ప్రతి మ్యాచ్‌లో దాదాపు 50 మందికి పైగా బుల్లితెర, వెండితెర సెలబ్రిటీలు పాల్గొన్నారు. బృహస్పతి టెక్నాలజీస్ ఎండి రాజశేఖర్, హీరో, నిర్మాత శ్రీరామ్, ఇండియన్ ఫుట్ బాల్ కోచ్ ప్రవీణ్, హీరో, నిర్మాత నంద కిషోర్, స్పోర్ట్స్ అనలిస్ట్ కార్తీక్, నటుడు, నిర్మాత లోహిత్ కుమార్ ఆధ్వర్యంలో ఈ మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో తిరుపతి టైగర్స్ సమీర్ టీం విజేతగా, కరీంనగర్‌ కింగ్స్ శ్రీరామ్ టీం రన్నరప్ గా నిలిచారు.[5]

సినిమాలు

మార్చు

బృహస్పతి ఎంటర్టైన్మెంట్స్ బ్యానరులో మీడియా సంస్థ ద్వారా సినిమారంగానికి సంబంధించిన అనేక కార్యక్రమాలు, ఈవెంట్లు నిర్వహించారు. లఘుచిత్రాల పోటీలను కూడా నిర్వహించి విజేతలకు బహుమతులు కూడా అందించారు. మంచు లక్ష్మి, శ్రద్ధాదాస్, హేమ ఇతర నటీమణులు ముఖ్యపాత్రలతో 'లేచింది మహిళా లోకం' అనే సినిమాతో నిర్మాతగా మారారు.[6][7]

మూలాలు

మార్చు
  1. Bureau, Our (2020-09-10). "Brihaspathi Technologies Pvt Ltd launches COVIPRO". www.thehindubusinessline.com (in ఇంగ్లీష్). Retrieved 2023-01-28.
  2. "Viral Video: Team Lechindi Mahila Lokam faces a serious issue". 123telugu.com (in ఇంగ్లీష్). 2022-05-24. Retrieved 2023-01-28.
  3. "CCTV Cameras are key to contain crime in the city, says CP Anjani Kumar". 2021-01-06. Retrieved 2023-01-28.
  4. "Demand for home automation systems booms in Hyderabad". The New Indian Express. Retrieved 2023-01-28.
  5. "పూర్తయిన సెలబ్రిటీ సూపర్ 7 లీగ్.. విజేతలుగా నిలిచిన తిరుపతి టైగర్స్ సమీర్!!". T2BLive (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-03-29. Retrieved 2023-01-28.
  6. Reddy, Divya (2022-05-07). "Surekha Vani Daughter: టాలీవుడ్‌లోకి సురేఖ వాణి కూతురు.. ఫస్ట్ లుక్ రిలీజ్." www.tv5news.in (in ఇంగ్లీష్). Retrieved 2023-01-28.
  7. Telugu, TV9 (2022-05-07). "Manchu Laxmi: 'లేచింది మహిళా లోకం' అంటోన్న మంచు లక్ష్మీ.. సిల్వర్‌ స్క్రీన్‌ ఎంట్రీ ఇస్తోన్న సురేఖ వాణి కూతురు." TV9 Telugu. Retrieved 2023-01-28.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)