హేమ తెలుగు సినిమా నటి, రాజకీయ నాయకురాలు. ఆమె తెలుగు, తమిళం, మలయాళం మరియు హిందీ భాషల్లో నటించారు. 1989లో బలకృష్ణ హీరోగా నటించిన ‘భలేదొంగ’ చిత్రం ద్వారా ఆమె వెండితెరకు పరిచయమయ్యారు. వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందుతున్న ‘కొండపొలం’ వరకూ ఆమె 509 చిత్రాల్లో నటించారు. మూడు టీవీ సీరియల్స్ లోనూ నటించారు.

హేమ
Hema Telugu actress.jpg
జననం
కృష్ణవేణి

1975, నవంబరు 12
వృత్తిసినిమా నటి, రాజకీయ నాయకురాలు
క్రియాశీల సంవత్సరాలు1989– ప్రస్తుతం
జీవిత భాగస్వామిసయ్యద్ జాన్ అహ్మద్[1]
పిల్లలుఇషా జాన్ [2]

జననంసవరించు

హేమ అసలు పేరు కృష్ణవేణి. ఆమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పుగోదావరి జిల్లా, రాజోలులో 1975 నవంబరు 12న జన్మించారు. ఆమె తండ్రి పేరు కోళ్ల కృష్ణ, తల్లి పేరు కోళ్ల లక్ష్మి.  భర్త పేరు జాన్ అహ్మద్. ఆమెకు ఒక పాప. పేరు ఇషా జాన్. ఆమె ఏడవ తరగతి వరకు చదువుకుంది.[3]

రాజకీయ జీవితంసవరించు

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అసోసియేషన్ లో కార్యవర్గ సభ్యురాలిగా రెండు సార్లు బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత జాయింట్ సెక్రటరీగా ఎంపికయ్యారు. గత ఎన్నికల్లో ఉపాధ్యక్ష పదవికి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగి 225 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఈసారి ప్రకాష్ రాజ్ ప్యానల్ తరఫున ఉపాధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. స్వతహాగా ఆమెకు రాజకీయాలన్నా, సేవా కార్యక్రమాలు చేపట్టడం అన్నా ఆసక్తి ఎక్కువ.హేమ 2014లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మండపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యింది.[4][5]ఆమె 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరింది.[6] హేమ 2021, ఏప్రిల్ 13న భారతీయ జనతా పార్టీ లో చేరింది.[7]

నటించిన చిత్రాల పాక్షిక జాబితాసవరించు

తెలుగుసవరించు

తెలుగు సినిమాలు[8]

  1. చిన్నారి స్నేహం (1989)
  2. కొడుకు దిద్దిన కాపురం (1989)
  3. స్వాతి చినుకులు (1989)
  4. ముద్దుల మావయ్య (1989)
  5. బాల గోపాలుడు (1989)
  6. పల్నాటి రుద్రయ్య (1989)
  7. ధర్మ యుద్ధం (1989)
  8. పైలా పచ్చిస్ (1989)
  9. వింత దొంగలు (1989)
  10. అయ్యప్ప స్వామి మహత్యం (1989)
  11. భలే దొంగ (1989)
  12. జయమ్ము నిశ్చయమ్మురా
  13. అగ్గిరాముడు (1990)
  14. డా.భవాని (1990)
  15. ఏడాది (1990)
  16. చెవిలో పువ్వు (1990)
  17. జయసింహ (1990)
  18. రంభ రాంబాబు (1990)
  19. లారీ డ్రైవర్ (1990)
  20. తొలి పొద్దు (1991)
  21. తేనెటీగ (1991)
  22. రౌడీ గారి పెళ్ళాం (1991)
  23. క్షణ క్షణం (1991)
  24. హలో డార్లింగ్ లేచిపోదామా (1992)
  25. ఆదర్శం (1992)
  26. డబ్బు భలే జబ్బు (1992)
  27. రౌడీ ఇన్‌స్పెక్టర్ (1992)
  28. మనీ (1993)
  29. రెండిళ్ళ పూజారి (1993)
  30. మాయదారి మొగుడు (1993)
  31. కొంగుచాటు కృష్ణడు (1993)
  32. పచ్చని సంసారం (1993)
  33. ప్రేమలేఖలు (1993)
  34. వారసుడు (1993)
  35. మెకానిక్ అల్లుడు (1993)
  36. పోలీస్ భార్య (1994)
  37. పరుగో పరుగు (1994)
  38. కోడలు దిద్దిన కాపురం (1997)
  39. జయం మనదే రా (2000)
  40. గొప్పింటి అల్లుడు (2000)
  41. మురారి (2001)
  42. నా మానసిస్తా రా (2001)
  43. నువ్వు నాకు నచ్చావ్ (2001)
  44. వ్యామోహం (2002)
  45. ప్రేమసల్లాపం (2002)
  46. సొంతం (2002)
  47. నీ స్నేహం (2002)
  48. నిన్నే ఇష్టపడ్డాను (2003)
  49. సింహాద్రి (2003)
  50. వసంతం (2003)
  51. ఒకరికి ఒకరు (2003)
  52. టైగర్ హరిశ్చంద్రప్రసాద్ (2003)
  53. దోస్త్ (2004)
  54. అంజలి ఐ లవ్ యూ' (2004)
  55. పల్లకిలో పెళ్లికూతురు (2004)
  56. ఆనందమానందమాయే (2004)
  57. మల్లీశ్వరి (2004)
  58. భద్రాద్రి రాముడు (2004)
  59. అమ్మాయి బాగుంది (2004)
  60. 143 (2004)
  61. ఫ్రెండ్ షిప్ (2005)
  62. అలెక్స్ (2005)
  63. నా అల్లుడు (2005)
  64. మనసు మాట వినదు (2005)
  65. శ్రావణమాసం (2005)
  66. అందగాడు (2005)
  67. అందరివాడు (2005)
  68. ఒక ఊరిలో (2005)
  69. ఏవండోయ్ శ్రీవారు (2006)
  70. 123 ఫ్రొం అమలాపురం (2005)
  71. సోగ్గాడు (2005)
  72. అతడు (2005)
  73. నువ్వంటే నాకిష్టం (2005)
  74. భగీరథ (2005)
  75. [[డేంజర్] (2005)
  76. సీతారాముడు (2006)
  77. రామాలయం వీధిలో బాలు మధుమతి (2006)
  78. శ్రీ రామదాసు (2006)
  79. మాయాజాలం (2006)
  80. నీ నవ్వు చాలు (2006)
  81. రూంమేట్స్ (2006)
  82. కొంటె కుర్రాళ్ళు (2006)
  83. స్టాలిన్ (2006)
  84. బాస్ (2006)
  85. టాటా బిర్లా మధ్యలో లైలా (2006)
  86. గోపి – గోడ మీద పిల్లి (2006)
  87. పెళ్ళైన కొత్తలో (2006)
  88. అన్నవరం (2006)
  89. అతిధి (2007)
  90. యమగోల మళ్ళీ మొదలయింది (2007)
  91. దేశముదురు (2007)
  92. జ్ఞాపకం (2007)
  93. కృషి (2008)
  94. కంత్రి (2008)
  95. దీపావళి (2008)
  96. ఆపద మొక్కులవాడు (2008)
  97. మిస్టర్ మేధావి (2008)
  98. ఇది సంగతి (2008)
  99. భలే దొంగలు (2008)
  100. గమ్యం (2008)
  101. గీత (2008)
  102. కాళిదాసు (2008)
  103. సవాల్ (2008)
  104. బుజ్జిగాడు (2008)
  105. గోరింటాకు (2008)
  106. ఆలయం (2008)
  107. సత్యం (2008)
  108. అష్ట చెమ్మ (2008)
  109. రెయిన్బో (2008)
  110. కౌసల్య సుప్రజ రామ (2008)
  111. బ్లేడ్ బాబ్జి (2008)
  112. అందమైన అబద్దం (2008)
  113. కుబేరులు (2008)
  114. చెడుగుడు (2008)
  115. రూ 999 మాత్రమే (2009)
  116. కొంచెం ఇష్టం కొంచెం కష్టం (2009)
  117. ఛలో ప్రేమిద్దాం (2021)
  118. పెళ్లిసందD (2022)
  119. కోతల రాయుడు (2022)
  120. ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు (2023)

మూలాలుసవరించు

  1. "HEMA SYED MANDAPETA (EAST GODAVARI)". myneta.info. Retrieved 6 September 2014.
  2. Sakshi (30 September 2020). "నటి హేమ కూతురు ఇషా పుట్టిన రోజు ఫోటోలు". Sakshi. Archived from the original on 25 జూన్ 2021. Retrieved 25 June 2021.
  3. Dr.Seshagirirao. "Tollywood photo profiles". Tollywood photo profiles. Dr.Seshagirirao. Archived from the original on 19 మార్చి 2017. Retrieved 10 February 2016.
  4. Deccan Chronicle (7 February 2018). "Stars to take poll position". Deccan Chronicle (in ఇంగ్లీష్). Archived from the original on 25 జూన్ 2021. Retrieved 25 June 2021.
  5. Sakshi (17 April 2014). "ఎన్నికల బరిలో సినీనటి హేమ". Sakshi. Archived from the original on 25 జూన్ 2021. Retrieved 25 June 2021.
  6. News Orbit (1 April 2019). "జగన్‌కు సినీనటుల బాసట | News Orbit". Archived from the original on 25 జూన్ 2021. Retrieved 25 June 2021.
  7. TV9 Telugu (13 April 2021). "బీజేపీలో చేరిన నటి హేమ.. ఫస్ట్ స్పీచ్‌తోనే బీజేపీ నేతలకు చుక్కలు.. వైరల్‌గా మారిన వీడియో - telugu actress hema hilarious speech after joining bjp in nellore district". TV9 Telugu. Archived from the original on 25 జూన్ 2021. Retrieved 25 June 2021.
  8. "Hema Profile". altiusdirectory.com. Archived from the original on 27 మే 2013. Retrieved 30 January 2013.
"https://te.wikipedia.org/w/index.php?title=హేమ&oldid=3834659" నుండి వెలికితీశారు