రాజా మీరు కేక 2017లో తెలుగులో విడుదలైన క్రైమ్ కామెడీ సినిమా. ఆర్.కే స్టుడియోస్ బ్యానర్‌పై ఎమ్. రాజ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు కృష్ణ కిషోర్ దర్శకత్వం వహించాడు.తారకరత్న, లాస్య, నోయెల్, హేమంత్, రేవంత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జూన్ 16న విడుదలైంది.[1]

రాజా మీరు కేక
దర్శకత్వంకృష్ణ కిషోర్
రచనకృష్ణ కిషోర్
నిర్మాతఎమ్. రాజ్ కుమార్
తారాగణంతారకరత్న
లాస్య
శోభితా రాణా
నోయెల్
ఛాయాగ్రహణంరాం పి రెడ్డి
కూర్పుఎస్.బి.ఉద్ధవ్
సంగీతంశ్రీ చరణ్ పాకాల
నిర్మాణ
సంస్థ
ఆర్.కే స్టుడియోస్
విడుదల తేదీ
జూన్ 16, 2017 (2017-06-16)
దేశంభారతదేశం
భాషతెలుగు

రవి (రేవంత్), శ్వేత (లాస్య), శశాంక్ (నోయెల్), శీను (హేమంత్) నలుగు స్నేహితులు. రవి, శ్వేత.. నాగరాజు (తారక రత్న)కు చెందిన సాఫ్ట్‌వేర్‌ కంపెనీ లో పని చేస్తూ ఉంటారు. నాగరాజు (తారక రత్న) తన కంపెనీ షేర్లను బోర్డు మెంబర్లు వద్దు అని చెప్తున్నా వినకుండా ముఖ్య మంత్రి (పోసాని కృష్ణ మురళి) తో కలిసి రియల్ ఎస్టేట్ లో పెట్టడంతో ఆ కంపెనీ నష్టాల్లో కూరుకుపోతుంది. ఈ క్రమంలో శ్వేత (లాస్య) ఆత్మ హత్య చేసుకొని చనిపోతుంది. దీనికి అంతటికి కారణం అయిన నాగరాజు మీద ఏ విధంగా మిగిలిన ముగ్గురు స్నేహితులు ఎలా పగ తీర్చుకున్నారు? తరువాత ఏమి జారింది అనేదే మిగతా సినిమా కథ.[2]

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
 • బ్యానర్: ఆర్.కే స్టుడియోస్
 • నిర్మాత: ఎమ్. రాజ్ కుమార్
 • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కృష్ణ కిషోర్
 • సంగీతం:శ్రీ చరణ్ పాకాల
 • సినిమాటోగ్రఫీ: రాం పి రెడ్డి
 • పాటలు: కిట్టు విస్సాప్రగడ
 • ఆర్ట్ డైరెక్టర్: మారేష్ శివన్
 • ఎడిటింగ్: ఎస్‌.ఆర్‌.శేఖర్‌

మూలాలు

మార్చు
 1. Zee Cinemalu (15 June 2017). "వీకెండ్ రిలీజెస్ - జూన్ 16" (in ఇంగ్లీష్). Archived from the original on 10 June 2022. Retrieved 10 June 2022.
 2. Andhra Jyothy (16 June 2017). "రాజా మీరు కేక‌!". Archived from the original on 10 June 2022. Retrieved 10 June 2022.
 3. The Hans India (18 February 2017). "Raja Meeru Keka is content-driven, says Lasya" (in ఇంగ్లీష్). Archived from the original on 10 June 2022. Retrieved 10 June 2022.

బయటి లింకులు

మార్చు