నోయెల్ సీన్
నోయెల్ సీన్ భారతీయ ర్యాప్ కళాకారుడు, స్వరకర్త, సినీ నటుడు. అతను ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్నాడు. టాలీవుడ్ లో మొదటి ర్యాపర్ ( తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ), బహుముఖ నటుడిగా గుర్తింపు పొందిన అతను స్వతంత్రంగా సంగీత నిర్మాత, టెలివిజన్ వ్యాఖ్యాత, రేడియో జాకీ, గేయ రచయిత,స్వరకర్తగా గుర్తింపు, ప్రశంసలను పొందాడు.
నేపథ్యం సవరించు
నోయెల్ సీన్ 1982 నవంబర్ 28 న తెలంగాణ రాష్ట్ర ముఖ్యపట్టణమైన హైదరాబాద్‌లో శామ్యూల్, సారా దంపతులకు జన్మించాడు. అతని తండ్రి పదవీవిరమణ చేసిన సైనికొద్యోగి, తల్లి గృహిణి. నోయెల్ కు మరో ముగ్గురు తోబుట్టువులు ఉన్నారు. రక్షణ రంగానికి చెందిన కుటుంబానికి చెందిన బాలునిగా నోయెల్ సీన్ 10 వ తరగతి వరకు డిఎల్ఎస్ ఆర్‌సిఐ (రీసెర్చ్ సెంటర్ ఇమారత్) లో చదువుకున్నాడు. అతను డిఫెన్స్ లాబొరేటరీ కళాశాలలో ఇంటర్మీడియట్ ను పూర్తి చేసాడు. అతను ఎస్.వి.సి.ఎఫ్.ఎ లో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ డిగ్రీని అభ్యసించాడు. తరువాత అతను వెబ్ డిజైనర్ అయ్యాడు. అతను చిత్ర పరిశ్రమలో చేరే వరకు కాగ్నిజెంట్ లో ట్రైనీగా పనిచేశాడు. అతను 2019 జనవరి 3న సినిమా నటి ఈస్టర్ నోరోన్హాను వివాహం చేసుకున్నాడు. ఆ తరువాత కొద్ది రోజులకే వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో జూన్ 2019 లోనే విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. కోర్టు వారిరువురికీ విడాకులు మంజూరు చేసింది.[2]
జీవితం సవరించు
నోయెల్ సీన్ విద్యాభ్యాసం చేయుచున్న సమయంలో అతను గుర్తింపు పొందిన విలువిద్య శిక్షకుడు రవిశంకర్ ను కలుసుకున్నాడు. రవిశంకర్ అతనికి సినీ రంగంలోకి వెళ్ళేందుకు ప్రోత్సహిస్తూ దర్శకుడు తేజ కు కాస్టింగ్ దర్శకునిగా పనిచేస్తున్న రామానంద్ కు పరిచయం చేసాడు. అతనికి మొదటి సారి తెలుగు సినిమా పరిశ్రమలొ సంభవామి యుగే యుగే లో నటించే అవకాశం కలిగింది. తరువాత అతను దర్శకుడు కృష్ణకు పరిచయమయ్యాడు. అతను నోయల్ ను సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణికి పరిచయం చేసాడు. కీరవాణి అతనికి ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన తెలుగు సినిమా విక్రమార్కుడు లో ర్యాపింగ్ చేసే అవకాశం కల్పించాడు. ఇది నోయల్ కు భారీ గుర్తింపు తెచ్చి పెట్టింది. తద్వారా అతనిని 'మొదటి తెలుగు రాపర్' గా గుర్తించారు. ఆ తర్వాత అతను వెనక్కి తిరిగి చూడలేదు. 2007 లో, నోయెల్ చార్మి కౌర్‌తో కలిసి మంత్ర చిత్రంలో తెరపై కనిపించాడు. అదే సమయంలో నోయెల్ 93.5 రెడ్ ఎఫ్ఎమ్ కోసం రేడియో జాకీగా పనిచేసాడు. ఆ క్రమంలో అతను అనేక మంది అభిమానులను పొందాడు. ఆ తరువాత అతను అనేక పెద్ద ప్రాజెక్టులలో వరుసగా అనేక ముఖ్యమైన పాత్రలను పోషించాడు. తెలుగు చలనచిత్రంలో బహుముఖ నటుడిగా స్థిరపడ్డాడు. 2015 లో, నోయెల్ నటుడిగా అందరూ గుర్తించారు. అతను దర్శకుడు సుకుమార్ నిర్మాణంలోని సినిమా కుమారి 21 ఎఫ్ కు సంతకం చేసాడు. ఈ సినిమాలో అతను శంకర్ అనే ప్రతినాయకుని పాత్రను పోషించాడు. ఈ చిత్రంలో అతని నటన విమర్శకులతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. అతను త్వరలోనే హెబా పటేల్ సరసన నాన్నా నేను నా బాయ్ ఫ్రెండ్స్ చిత్రంలో కథానాయకునిగా అడుగుపెట్టాడు. ఈ చిత్రం బాగా విజయవంతమైంది. ఇది అతని కెరీర్ లో మరొక విజయవంతమైన సినిమాగా చేరింది.
టెలివిజన్ సవరించు
నోయెల్ 2010 లో జీ తెలుగులో సా రే గా మా పా లిల్ చాంప్స్‌తో టెలివిజన్ వ్యాఖ్యాతగా అడుగుపెట్టాడు. 2013 లో జెమిని టీవిలో సూపర్ కుటుంబం లో వ్యాఖ్యాతగా చేసాడు.
సంగీతం సవరించు
నోయెల్ అనేక స్వతంత్ర పాటలను స్వరపరచి, వాటిని తన అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో విడుదల చేశాడు. అతను గుర్తింపు పొందిన గీత రచయిత అనంత శ్రీరామ్‌తో కలిసి 'ది షేక్ గ్రూప్' అనే తెలుగు బ్యాండ్‌ను ఏర్పాటు చేశాడు. గాయకులు రమ్య బెహారా, మోహనా, డామిని, మౌనిమా, ఆదిరే అభి, ఆదిత్య, అరుణ్ కూడా ఈ బృందంలో ఒక భాగంగా ఉన్నారు. ఈస్టర్ నోరోన్హాతో కలిసి అతని తాజా వీడియో డెస్పాసిటో తెలుగు కవర్ ర్యాప్ పాటను తెలుగులో చేసాడు. అది వైరల్ అయ్యింది. 2 వారాలలోపు 1 మిలియన్ వీక్షణలను దాటింది. అతను కొంకణి సంగీత పరిశ్రమలో ఈస్టర్ నోరోన్హా చే చేయబడిన డిస్పాసిటో కొంకణి కవర్ వెర్షన్ ద్వారా ర్యాపర్ గా చేరాడు.
సినిమాలు సవరించు
ఇంకా విడుదల చేయని చిత్రాలను సూచిస్తుంది |
సంవత్సరం | సినిమా | పాత్ర |
---|---|---|
2006 | సంభవామి యుగే యుగే | |
2007 | మంత్రం | |
2008 | నేను మీకు తెలుసా | |
2009 | శశిరేఖా పరిణయం | |
2009 | మగధీర | |
2012 | ఈగా / నాన్ ఈ | నాని స్నేహితునిగా |
2012 | రే | |
2015 | గడ్డం గ్యాంగ్ | |
2015 | కుమారి 21 ఎఫ్ | శంకర్ |
2015 | నాన్నకు ప్రేమతో | నోయెల్ |
2016 | గుప్పెడంత ప్రేమ | అభి |
2016 | ప్రేమం | అర్జున్ |
2016 | నాన్నా నేను నా బాయ్ ఫ్రెండ్స్ | గోకుల్ |
2017 | రాజా మీరు కేక | శశాంక్ |
2018 | రంగస్థలం | ఎర్ర శ్రీను |
2018 | విజేత | రామ్ స్నేహితుడు |
2018 | హలో గురూ ప్రేమ కొసామే | కార్తీక్ |
2018 | పడి పడి లేచే మనసు | శ్రావణ్ |
2018 | ఎందుకో ఏమో | |
2020 | వలయం | |
2021 | మనిషి [3][4] | చందు |
2022 | దీర్ఝ ఆయుష్మాన్ భవ | |
2022 | డై హార్డ్ ఫ్యాన్ |
డిస్కోగ్రఫీ సవరించు
ఇంకా విడుదల చేయని చిత్రాలను సూచిస్తుంది |
సంవత్సరం | డిస్కోగ్రఫీ |
---|---|
2011 | BGOTN (క్రిస్టియన్ భక్తి ఆల్బమ్) |
2014 | లవ్ ఫీవర్ (సింగిల్) |
2015 | బాహుబలి నివాళి పాట |
2015 | బహా కిలికి (స్మిత నటించారు) |
2016 | భీమావరం బీట్ (సింగిల్) |
2016 | మాయీ (సింగిల్) |
2016 | బం చికి బం బం (కుమారి 21 ఎఫ్ నివాళి) |
2016 | హ్యాపీ మదర్స్ డే మమ్మీ (సింగిల్) |
2016 | మక్కికిర్కిరి ( రాహుల్ సిప్లిగుంజ్ నటించారు ) |
2016 | సలాం ఇండియా (ది షేక్ గ్రూప్ చేత) |
2016 | డబ్బూ చాలట్లే (ది షేక్ గ్రూప్ చేత) |
2018 | డెస్పాసిటో తెలుగు కవర్ (ఈస్టర్ నోరోన్హా నటించిన సింగిల్) |
2018 | డెస్పాసిటో కొంకణి కవర్ (ఈస్టర్ నోరోన్హా కలిగి) |
2019 | బేబీ (ఈస్టర్ నోరోన్హా నటించారు) |
2020 | హస్ట్‌లర్ తెలుగు రాప్ సాంగ్ |
గాయకుడు సవరించు
- జై సింహా - 2018 (తెలుగు)
- ఓ మనసా - 2016 (తెలుగు)
- కృష్ణాష్టమి - 2016 (తెలుగు)
- రే - 2015 (తెలుగు)
- డిస్కో - 2012 (తెలుగు)
- పూల రంగడు - 2012 (తెలుగు)
- ఆల్ ది బెస్ట్ - 2012 (తెలుగు)
- లవ్లీ - 2012 (తెలుగు)
- వైకుంఠపాళి- 2011 (తెలుగు)
- బాబ్లూ - 2011 (తెలుగు)
- ఆహా నా పెళ్ళంటా - 2011 (తెలుగు)
- అందరి బంధువయా - 2010 (తెలుగు)
- రామ రామ కృష్ణ కృష్ణ - 2010 (తెలుగు)
- సీతారాముల కళ్యాణం - 2010 (తెలుగు)
- ఊహా చిత్రం - 2009 (తెలుగు)
- లైఫ్ స్టైల్ - 2009 (తెలుగు)
- ఇందుమతి - 2009 (తెలుగు)
- కదల్నా సుమ్మా ఇల్లా - 2009 (తమిళం)
- ప్రేమాభిషేకం - 2008 (తెలుగు)
- కృష్ణార్జున - 2008 (తెలుగు)
- విశాఖ ఎక్స్‌ప్రెస్ - 2008 (తెలుగు)
- అందమైన మనసులో - 2008 (తెలుగు)
- విజయం - 2008 (తెలుగు)
- మంత్రం - 2007 (తెలుగు)
- విక్రమార్కుడు - 2006 (తెలుగు)
మూలాలు సవరించు
- ↑ Divya Goyal (1 September 2020). ""Wish You The Best," Writes Noel Sean After Divorce From Ester Noronha". NDTV. Retrieved 13 September 2020.
- ↑ "Bigg Boss Telugu 4's Expected Contestant Noel Sean Announces Divorce With Ester Noronha". News18. Retrieved 2020-09-07.
- ↑ HMTV (9 June 2021). "నోయల్ చెప్పిన శుభవార్త ఏంటంటే..?". Archived from the original on 20 జూలై 2021. Retrieved 20 July 2021.
- ↑ Sakshi (9 June 2021). "పెళ్లి గురించి కాదు.. నోయల్ శుభవార్త ఇదే". Archived from the original on 20 జూలై 2021. Retrieved 20 July 2021.