రాజీవ్ దుమ్ముగూడెం ఎత్తిపోతల పథకం

ఖమ్మం జిల్లాలో ఉన్న ఎత్తిపోతల పథకం

రాజీవ్ దుమ్ముగూడెం ఎత్తిపోతల పథకం, తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా, దుమ్ముగూడెం సమీపంలో ప్రతిపాదించబడిన ఎత్తిపోతల పథకం.[1] రాజీవ్ దుమ్ముగూడెం ఎత్తిపోతల పథకం, ఇందిరాసాగర్ రుద్రమ్మకోట దుమ్ముగూడెం ఎత్తిపోతల పథకం, దుమ్ముగూడెం నుండి సాగర్ టెయిల్ పాండ్ కెనాల్ ప్రాజెక్ట్ పేర్లతో మూడు లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు అమలులో ఉన్నాయి.[2] రాజీవ్ దుమ్ముగూడెం ఎత్తిపోతల పథకం 17°54′05″N 80°52′45″E / 17.90139°N 80.87917°E / 17.90139; 80.87917 (Pamulapalli) వద్ద ప్రారంభమై, దుమ్ముగూడెం చెరువు నుండి గోదావరి నది నీటిని తీసుకుని ఖమ్మం, వరంగల్ జిల్లాలలో 200,000 ఎకరాలకు సాగునీరు అందించడానికి ఈ పథకం ప్రణాళిక చేయబడింది. ఇందిరా దుమ్ముగూడెం ఎత్తిపోతల పథకం 17°33′49″N 81°14′49″E / 17.56361°N 81.24694°E / 17.56361; 81.24694 (Rudrammakota) వద్ద ప్రారంభమై, పోలవరం రిజర్వాయర్ వెనుక జలాల నుంచి గోదావరి నది నీటిని తీసుకుని ఖమ్మం, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని 200,000 ఎకరాలకు సాగునీరు అందించడానికి ఈ పథకం ప్రణాళిక చేయబడింది.

గోదావరిపై దుమ్ముగూడెం వాగు
నాగార్జున ఎడమ కాలువ డీప్ కట్

తెలంగాణ ప్రభుత్వం చేసిన రీడిజైనింగ్‌లో భాగంగా[3][4] రాజీవ్ దుమ్ముగూడెం ఎత్తిపోతల పథకం, ఇందిరా సాగర్ రుద్రమకోట ఎత్తిపోతల పథకాలతో విలీనం చేయబడి, సీతారామ ఎత్తిపోతల పథకంగా పేరు పెట్టబడింది. ఈ సాగునీటి పథకంలో నీటిని ఎత్తిపోసేందుకు సీతమ్మసాగర్ బ్యారేజీ పేరుతో 36.5 టిఎంసిల ప్రాజెక్టు కూడా రూపొందించబడుతోంది.

వివరాలు

మార్చు

దాదాపు 150 సంవత్సరాల క్రితం బ్రిటిష్ ఇండియా ఇంజనీర్ సర్ ఆర్థర్ కాటన్గోదావరి నదిపై దుమ్ముగూడెం ఆనకట్టను నిర్మించాడు.[5] నది నీటిని కాల్వలలోకి మళ్ళించడం కాకుండా లీన్ ఫ్లో సీజన్‌లో క్రాస్ ఓవర్ బ్రిడ్జ్‌గా ఉపయోగించడం కోసం ఇది నిర్మించబడింది. నదిని దాటడానికి భద్రాచలం పట్టణం సమీపంలో ఆల్ వెదర్ రోడ్డు వంతెన నిర్మాణం తర్వాత ఈ ఆనకట్ట ప్రాధాన్యత కోల్పోయింది. దుమ్ముగూడెం వాగుపై ఉన్న లెవెల్ డ్రాప్‌ను ఉపయోగించుకునేందుకు 24 మెగావాట్ల జలవిద్యుత్ స్టేషన్ కూడా నిర్మించబడింది.[6]

ప్రణాళిక

మార్చు

గోదావరి జలాలను కృష్ణానదికి అందించే రెండో భారీ నీటి పారుదల ప్రాజెక్టు ఇది. నాలుగు దశల్లో ఎత్తిపోతల పథకాలను ఏర్పాటు చేసి 119 టి.ఎమ్‌.సి.ల నీటిని నాగార్జునసాగర్‌ టేల్‌పాండ్‌కు తరలించబడుతాయి. దీని ద్వారా ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోని 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందడంతోపాటు గోదావరి జలాలు ఈ ప్రాజెక్టు నుంచి సాగర్‌ టేల్‌పాండ్‌ వరకు 291 కిలోమీటర్ల దూరం వెళతాయి. దీని లింకు కాల్వల్లో కిన్నెరసాని, ముర్రేడువాగు, మున్నేరు, పాలేరు, మూసీ నదులు కలుస్తాయి.

దుమ్ముగూడెం చెరువు నుంచి కాలువ ప్రారంభమవుతున్నందున ఈ ప్రాజెక్టును దుమ్ముగూడెం నుండి సాగర్ టెయిల్ పాండ్ లిఫ్ట్ కెనాల్ ప్రాజెక్ట్ అని కూడా పిలుస్తారు. ఈ లిఫ్ట్ కెనాల్ 165 టిఎంసి మేరకు దుమ్ముగూడెం చెరువు నుండి కృష్ణా నది పరీవాహక ప్రాంతానికి గోదావరి నది నీటిని అందిస్తుంది. కాలువ మొత్తం పొడవు 244 కి.మీ, కాలువ సామర్థ్యం 22,000 క్యూసెక్కులుగా ఉంది.[2]

మూలాలు

మార్చు
  1. The Hindu, 12 December 2010, "Kiran wants FCI to assess crop loss"
  2. 2.0 2.1 "Refer ongoing major projects, JYOTHI RAO PULE DUMMUGUDEM NAGARJUNA SAGAR SUJALA SRAVANTHI". Retrieved 2022-04-19.
  3. PTI. "Green nod for Rs 13,384 cr Sita Ram Irrigation project in Telangana". @businessline (in ఇంగ్లీష్). Retrieved 2022-04-19.
  4. "Sita Rama Lift Irrigation Project" (PDF). Department of Irrigation & CAD, Government of Telangana. Retrieved 2022-04-19.
  5. "Protest against 'demolition' of anicut". The Hindu. 2 November 2012.
  6. "Dummagudem hydel project". Archived from the original on 2018-01-17. Retrieved 2022-04-19.