రాధాకృష్ణ (2021 సినిమా)
రాధాకృష్ణ 2021లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీనివాస రెడ్డి సమర్పణలో ఆరాధ్య క్రియేషన్స్, శ్రీనివాస క్రియేషన్స్ బ్యానర్లపై శ్రీనివాస్ కానురు, పుప్పాల సాగరికా నిర్మించిన ఈ సినిమాకు ప్రసాద వర్మ దర్శకత్వం వహించాడు. అనురాగ్ రాజ్‌పుత్ , ముస్కాన్ శెట్టి, లక్ష్మీపార్వతి, సంపూర్ణేష్ బాబు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను డిసెంబర్ 20,[1] 2020న విడుదల చేసి, ఫిబ్రవరి 5, 2021న సినిమాను విడుదల చేశారు.[2]
రాధాకృష్ణ | |
---|---|
దర్శకత్వం | రజత్ రవిశంకర్ |
నిర్మాత | శ్రీనివాస్ కానురు, పుప్పాల సాగరికా |
తారాగణం | అనురాగ్ రాజ్‌పుత్ , ముస్కాన్ శెట్టి, లక్ష్మీపార్వతి, సంపూర్ణేష్ బాబు |
ఛాయాగ్రహణం | టి. సురేంద్ర రెడ్డి |
కూర్పు | డి. వెంకట ప్రభు |
సంగీతం | ఎమ్ఎమ్ శ్రీలేఖ |
నిర్మాణ సంస్థలు | ఆరాధ్య క్రియేషన్స్, శ్రీనివాస క్రియేషన్స్ |
విడుదల తేదీ | 5 ఫిబ్రవరి 2021 |
సినిమా నిడివి | 127 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
చిత్ర నిర్మాణం
మార్చురాధాకృష్ణ సినిమాలోని 'సిన్నపెద్ద సిగమోచ్చి ఊగెటట్టూ' పాటను దర్శకుడు పూరి జగన్నాథ్ విడుదల చేశాడు.[3]
నటీనటులు
మార్చు- అనురాగ్ రాజ్‌పుత్
- ముస్కాన్ శెట్టి
- లక్ష్మీపార్వతి [4]
- సంపూర్ణేష్ బాబు
- ఆలీ
- కృష్ణ భగవాన్
- చమ్మక్ చంద్ర
- అన్నపూర్ణ
- మణిచందన
- ఫణి
- రాకేష్
- ప్రసన్న ఆంజనేయులు
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: ఆరాధ్య క్రియేషన్స్, శ్రీనివాస క్రియేషన్స్
- నిర్మాత: శ్రీనివాస్ కానురు, పుప్పాల సాగరికా
- కథ, స్క్రీన్ ప్లే,: శ్రీనివాస రెడ్డి
- దర్శకత్వం: టి.డి.ప్రసాద్ వర్మ
- సంగీతం: ఎం.ఎం.శ్రీలేఖ
- సినిమాటోగ్రఫీ: టి.సురేందర్ రెడ్డి
- ఎడిటర్: డి. వెంకట ప్రభు
- ఆర్ట్: వి.ఎన్.సాయిమణి
- డాన్స్ : స్వర్ణ బాబు
- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఆలీ బాబా
మూలాలు
మార్చు- ↑ TV9 Telugu (20 December 2020). "కొండపల్లి బొమ్మలు: రాధాకృష్ణ మూవీ ట్రైలర్ లో స్పెషల్ అట్రాక్షన్.. లక్ష్మీపార్వతి. !". Archived from the original on 13 ఆగస్టు 2021. Retrieved 13 August 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Book My Show (2021). "Radha Krishna (2021)". Archived from the original on 13 ఆగస్టు 2021. Retrieved 13 August 2021.
- ↑ HMTV (23 August 2020). "ఇస్మార్ట్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ రిలీజ్‌చేసిన 'రాధాకృష్ణ' చిత్రంలోని పక్కా మాస్ సాంగ్." Archived from the original on 13 ఆగస్టు 2021. Retrieved 13 August 2021.
- ↑ Sakshi (22 February 2020). "లక్ష్మీ పార్వతి ప్రధాన పాత్రలో 'రాధాకృష్ణ'". Archived from the original on 8 ఆగస్టు 2021. Retrieved 13 August 2021.