నందమూరి లక్ష్మీపార్వతి

(లక్ష్మీపార్వతి నుండి దారిమార్పు చెందింది)

లక్ష్మీపార్వతి (ఆగష్టు 10, 1962) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు రెండవ భార్యగా ప్రసిద్ధురాలు.

నందమూరి లక్ష్మీపార్వతి
Laxmiparvathi.jpg
నందమూరి లక్ష్మీపార్వతి
జననంనందమూరి లక్ష్మీపార్వతి
ఆగష్టు 10, 1962
ఇతర పేర్లులక్ష్మీపార్వతి
ప్రసిద్ధినందమూరి తారక రామారావు రెండవ భార్యగా ప్రసిద్ధురాలు.
తెలుగు రచయితలు
మతంహిందూ మతము
భార్య / భర్తనందమూరి తారక రామారావు
పిల్లలుఒక కుమారుడు

జననంసవరించు

1962, ఆగష్టు 10 న జన్మించింది. తెలుగులో రచయిత, తెలుగుదేశం పార్టీ అభిమానురాలైన లక్ష్మీపార్వతి తన భర్త వీరగంధం సుబ్బారావుతో కలిసి 1985లో ఎన్టీ రామారావు జీవితచరిత్ర వ్రాసే ఉద్దేశముతో ఆయన్ను కలుసుకున్నది. పట్టుదలతో ప్రయత్నించి రామారావు నుండి జీవితచరిత్ర వ్రాయటానికి అనుమతి సంపాదించి 1987లో రామారావు ఇంట్లోనే నివసించే అవకాశాన్ని పొందింది.[1] లక్ష్మీపార్వతి ఎన్టీ రామారావు జీవితచరిత్రను వ్రాసే సమయంలో రామారావుకు సన్నిహితమై 1993లో వివాహం చేసుకున్నది.

ఈమె తొలి భర్త హరికథా కళాకారుడు వీరగంధం వెంకట సుబ్బారావుతో ఒక కొడుకు (కోటేశ్వర ప్రసాద్) ఉన్నాడు. ఈమె మొదటి భర్తనుండి 1993 ఏప్రిల్ 15న గుంటూరు జిల్లా నరసరావుపేట కోర్టులో విడాకులు తీసుకున్నది.[2] 1993, సెప్టెంబరు 10న రామారావు ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ లక్ష్మీపార్వతిని వివాహం చేసుకోవాలని నిర్ణయించినట్టు ప్రకటించాడు. ఆ మర్నాడు సెప్టెంబరు 11న తిరుపతిలో సంప్రదాయబద్ధంగా వీరి వివాహం జరిగింది. ఎన్టీ రామారావు మరణానంతరము ఆయన జీవితచరిత్రను "ఎదురులేని మనిషి" అన్న పేరుతో 2004లో విడుదలచేసింది.

శాసనసభ సభ్యురాలిగాసవరించు

1996 అక్టోబరులో జరిగిన ఉప ఎన్నికలలో శ్రీకాకుళము జిల్లా పాతపట్నం నియోజకవర్గం నుండి పోటీ చేసిన లక్ష్మీ పార్వతి, తన సమీప ప్రత్యర్థియు తెలుగు దేశ అభ్యర్థియునైన వేణమ్మపై 14148 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

సూచికలుసవరించు