రాబర్ట్స్‌గంజ్
రాబర్ట్స్‌గంజ్ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం సోన్‌భద్ర జిల్లా లోని పట్టణం. ఇది ఈ జిల్లాకు ముఖ్య పట్టణం. దీన్ని సోన్‌భద్ర అని కూడా పిలుస్తారు. పట్టణ పరిపాలనను మునిసిపల్ బోర్డు నిర్వహిస్తుంది.
రాబర్ట్స్‌గంజ్
సోన్‌భద్ర | |
---|---|
పట్టణం | |
Nickname: Robertsganj | |
Coordinates: 24°42′N 83°04′E / 24.7°N 83.07°E | |
దేశం | India |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
జిల్లా | సోన్భద్ర |
Named for | ఫ్రెడరిక్ రాబర్ట్స్ |
Elevation | 330 మీ (1,080 అ.) |
జనాభా (2011) | |
• Total | 36,689 |
అక్షరాస్యత | |
• in 2011 | 84% |
భాషలు | |
• అధికారిక | హిందీ |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 231216 |
టెలిఫోన్ కోడ్ | +91 5444 |
Vehicle registration | UP-64 |
రాబర్ట్స్ గంజ్ రాష్ట్రంలో ఆగ్నేయ మూలలో ఉంది. మునుపటి మీర్జాపూర్ జిల్లా లోని దక్షిణ భాగాన్ని విడదీసి 1989 మార్చి 4 న రాబర్ట్స్‌గంజ్ ముఖ్య పట్టణంగా సోన్‌భద్ర జిల్లాను ఏర్పాటు చేసారు. సోన్, కర్మనాశ, చంద్రప్రభ, రిహండ్, కన్హార్, రేణు, ఘగర్, బేలన్ నదులు ఈ జిల్లా గుండా ప్రవహిస్తున్నాయి. పట్టణానికి ఈ పేరు ఫ్రెడరిక్ రాబర్ట్స్, 1 వ ఎర్ల్ రాబర్ట్స్ మీదుగా వచ్చింది.
వింధ్య పర్వత శ్రేణికి, కైమూర్ శ్రేణికీ మధ్య ఉన్న ఈ ప్రాంతంలో ఆదిమానవులు ఊండేవారు. ఈ ప్రాంతంలో విరివిగా కనిపించే గుహా చిత్రాల ద్వారా ఇది తెలుస్తోంది.
భౌగోళికం
మార్చురాబర్ట్స్గంజ్ 24°42′N 83°04′E / 24.7°N 83.07°E వద్ద [1] సముద్రమట్టానికి 330 మీటర్ల ఎత్తున ఉంది. రాబర్ట్స్‌గంజ్ వింధ్యచల్ పర్వత శ్రేణుల ఆగ్నేయ భాగంలో ఉంది.
1885-93లో కాన్పూర్‌లో జన్మించిన బ్రిటిష్ ఇండియా సైన్యపు ఫీల్డ్ మార్షల్ ఫ్రెడరిక్ రాబర్ట్స్, 1 వ ఎర్ల్ రాబర్ట్స్, పేరు మీదుగా ఈ పట్టణానికి ఈ పేరు పెట్టారు.
రైలు
మార్చుసోన్భద్ర రైల్వే స్టేషను నుండి ఢిల్లీ, జమ్మూ, అలహాబాద్, రాంచీ, టాటానగర్, లక్నో, బరేలీ, వారణాసి, కాన్పూర్లకు రైలు సౌకర్యం ఉంది.
రోడ్డు
మార్చురాబర్ట్స్ గంజ్ నుండి లక్నో, అలహాబాద్, వారణాసి, మీర్జాపూర్ లకు చక్కటి రోడ్డు సౌకర్యం ఉంది. ఆరు లేన్ల రాష్ట్ర రహదారి 5 ఎ పట్టణం గుండా హథినాలా వరకు వెళ్ళి, అక్కడ జాతీయ రహదారి 75 ఇతో కలుస్తుంది.
వాతావరణం
మార్చురాబర్ట్స్ గంజ్‌లో వేసవి, శీతాకాల ఉష్ణోగ్రతల మధ్య అధిక వ్యత్యాసంతో ఉప ఉష్ణమండల వాతావరణాన్ని కలిగి ఉంది. సగటు ఉష్ణోగ్రతలు వేసవిలో 32°C - 42°C, శీతాకాలంలో 2°C - 15°C మధ్య ఉంటాయి. జూలై నుండి అక్టోబరు వరకు వర్షాకాలం.
జనాభా
మార్చు2011 జనగణన ప్రకారం [2] రాబర్ట్స్ గంజ్ (సోన్భద్ర) పట్టణాన్ని 25 వార్డులుగా విభజించారు, దీనికి ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతాయి. పట్టణ జనాభా 36,689, వీరిలో 19,294 మంది పురుషులు, 17,395 మంది మహిళలు.
రాబర్ట్స్ గంజ్ అక్షరాస్యత 84%. ఇది రాష్ట్ర సగటు 67.68% కన్నా ఎక్కువ. పురుషుల అక్షరాస్యత 89.32% కాగా, మహిళా అక్షరాస్యత రేటు 78.1%.