వింధ్య పర్వత శ్రేణులు

వింధ్య పర్వతాలు లేదా వింధ్య పర్వత శ్రేణి (ఆంగ్లం : Vindhya Range), (సంస్కృతం विन्‍ध्य ) పశ్చిమ మధ్య భారత ఉపఖండంలో గల పర్వతశ్రేణులు. ఈ పర్వత శ్రేణులు ఉత్తరభారత్, దక్షిణ భారత్ కు విడదీస్తున్నాయి. ఇవి అతి ప్రాచీన ముడుత పర్వతా శ్రేణులు.

ఈ పర్వతశ్రేణులు ప్రధానంగా మధ్యప్రదేశ్లో గలవు. వీటి పశ్చిమ భాగాలు గుజరాత్ లోనికి తూర్పుభాగాలలో (గుజరాత్ ద్వీపకల్పంలో) చొచ్చుకుపోయి ఉన్నాయి. వీటి తూర్పు భాగాలు మిర్జాపూర్ వద్దగల గంగానది వరకూ వ్యాపించియున్నాయి.

వీటి దక్షిణ వాలులు నర్మదా నది, అరేబియా సముద్రం వరకూ వ్యాపించియున్నవి.

పేరు వెనుక చరిత్రసవరించు

అమరకోశం రచయిత చేసిన ఒక వ్యాఖ్యానం ఆధారంగా వింధ్య అనే పదానికి సంస్కృత పదం వింధ్ (అడ్డుకోవడం) మూలం అని భావిస్తున్నారు. ఒక పౌరాణిక కథ (క్రింద చూడండి) వింధ్య ఒకసారి సూర్యుడు మార్గానికి ఆటంకంగా ఉందని పురాణం వివరిస్తుంది. [1] నిరంతరం పెరుగుతూ సూర్యుడి మార్గాన్ని అడ్డగిస్తున్న గొప్పపర్వతం అయిన వింధ్య అగస్త్యుడికి ఇచ్చిన మాటకు విధేయత చూపి ఆగిపోయిందని వాల్మీకి రామాయణం సూచిస్తుంది.[2] మరొక సిద్ధాంతం ఆధారంగా సంస్కృతంలో "వింధ్య" అంటే "వేట", ప్రాంతంలో నివసించే గిరిజన వేట - సేకరణ విధానంలో జీవించినల్ వేటగాళ్ళు నివసించిన ప్రాంతంగా ఈ ప్రాంతానికి ఈ పేరు సూచించబడి ఉండవచ్చు.[3]


వింధ్య పరిధి కూడా "వింధ్యాచల" లేదా "వింధ్యాచల్" అంటారు ప్రత్యయం అచల (సంస్కృతం), లేదా అచలే (హిందీ)అంటే చలించనిది అని అర్ధం. పర్వతం చలించనిది కనుక దీనికి అచలం అనే పేరును సూచిస్తుంది.[4][5] మహాభారతంలో కూడా వింధ్యపర్వతంగా సూచించబడింది. గ్రీకు భౌగోళికశాస్త్రవేత్త టోలెమీ విధియస్ (ఔండియన్) పర్వతాలు నర్మదోస్ (నర్మదా), ననగౌండా (తపతి) నదులకు మూలంగా ఉన్నాయని అభివర్ణించాడు. " దక్షిణపర్వత" కౌషితాకి ఉపనియాహద్ పేర్కొన్నాడు. ( "దక్షిణ మౌంటైన్") కూడా వింధ్యపర్వతంగా గుర్తించబడుతుంది.[6]

ఇవీ చూడండిసవరించు

మూలాలుసవరించు

బయటి లింకులుసవరించు

Coordinates: 24°37′N 82°00′E / 24.617°N 82.000°E / 24.617; 82.000

  1. Kalidasa, HH Wilson (1843). The Mégha dúta; or, Cloud messenger. pp. 19–20.
  2. "Sloka & Translation | Valmiki Ramayanam". www.valmiki.iitk.ac.in. Retrieved 2 April 2018.
  3. ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; Edward1885 అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
  4. Prabhakar Patil (2004). Myths and Traditions in India. BPI. p. 75. ISBN 9788186982792.
  5. Anura Goonasekera; Cees J. Hamelink; Venkat Iyer, సంపాదకులు. (2003). Cultural Rights in a Global World. Eastern Universities Press. p. 186. ISBN 9789812102355.
  6. ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; PKB అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు