రాబిన్ ఉత్తప్ప

1985 నవంబర్ 11కర్ణాటక లోని కొడగులో జన్మించిన రాబిన్ ఉత్తప్ప (Robin Venu Uthappa) (Kannada: ರಾಬಿನ್‌ ವೆನು ಉತ್ತಪ್ಪ) ప్రస్తుతం భారత వన్డే, ట్వంటీ-20 క్రికెట్ జట్టులో మెరుపులు మెరిపిస్తున్న యువ క్రికెట్ ఆటగాడు. అతని తండ్రి వేణు ఉత్తప్ప హకీ క్రీడకు అంతర్జాతీయ రెఫరీ. 2006లో ఇంగ్లాండుతో జరిగిన 7 వ, చివరి వన్డేలో మొదటిసారిగా జట్టులోకి ప్రవేశించాడు. తొలి వన్డేలోనే ఓపెనర్ గా బరిలోకి దిగి 86 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ లో భారత తరఫున రంగప్రవేశం చేసిన మ్యాచ్ లోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ గా రికార్డు సృష్టించాడు.

బయటి లింకులుసవరించు