రామగుండం మండలం
రామగుండం మండలం, తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాకు చెందిన ఒక మండలం
రామగుండం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో పెద్దపల్లి జిల్లా, రామగుండం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 18°48′00″N 79°27′00″E / 18.8000°N 79.4500°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | పెద్దపల్లి జిల్లా |
మండల కేంద్రం | రామగుండం |
గ్రామాలు | 8 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 115 km² (44.4 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 2,77,041 |
- పురుషులు | 1,40,527 |
- స్త్రీలు | 1,36,514 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 66.65% |
- పురుషులు | 75.89% |
- స్త్రీలు | 57.07% |
పిన్‌కోడ్ | 505208, 505209 |
2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లాలో ఉండేది.[1] ప్రస్తుతం ఈ మండలం పెద్దపల్లి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 8 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మండల కేంద్రం రామగుండం
కరీంనగర్ జిల్లా నుండి పెద్దపల్లి జిల్లాకు మార్పు.
మార్చులోగడ రామగుండం గ్రామం/ మండలం కరీనగర్ జిల్లా, పెద్దపల్లి రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా రామగుండం మండలాన్ని (1+07) ఎనిమిది గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన పెద్దపల్లి జిల్లా,పెద్దపల్లి రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[2]
గణాంకాలు
మార్చు2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 2,77,041 - పురుషులు 1,40,527 - స్త్రీలు 1,36,514.
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 115 చ.కి.మీ. కాగా, జనాభా 229,644. జనాభాలో పురుషులు 116,748 కాగా, స్త్రీల సంఖ్య 112,896. మండలంలో 57,181 గృహాలున్నాయి.[3]
మండలం లోని పట్టణాలు
మార్చుమండలం లోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చుఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "పెద్దపల్లి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 227 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.