రామప్ప చెరువు

(రామప్పచెరువు నుండి దారిమార్పు చెందింది)

రామప్ప చెరువు, తెలంగాణ రాష్ట్రం లోని ప్రాచీనమైన చెరువులలో ఒకటి. రామప్ప చెరువు ములుగు జిల్లా, వెంకటాపూర్ మండలం, పాలెంపేట గ్రామ శివార్లలో ఉంది.ఇది వరంగల్లుకు సుమారు 70 కి.మీ. దూరంలో ఉంది. రామప్ప చెరువును సా.శ. 1213 లో[1] కాకతీయుల కాలంలో కాకతీయ సేనాని రేచర్ల రుద్రుడు నిర్మించాడు. [2] ఈ చెరువు ప్రక్కనే ఉన్న రామప్ప దేవాలయంతో పాటే ఈ చెరువును నిర్మించారు.[3] ఈ చెరువు ద్వారా ప్రస్తుతం 10 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది.

రామప్ప చెరువు
రామప్ప చెరువు
ప్రదేశంపాలంపేట, తెలంగాణ
అక్షాంశ,రేఖాంశాలు18°14′19″N 79°56′23″E / 18.238477°N 79.939784°E / 18.238477; 79.939784
రకంమానవ నిర్మితం
స్థానిక పేరు[రామప్ప చెరువు] Error: {{Native name}}: unrecognized language tag: telugu (help)  (language?)
ప్రవహించే దేశాలు India
తీరంపొడవు156 కిలోమీటర్లు (35 మై.)
ప్రాంతాలుపాలంపేట
1 Shore length is not a well-defined measure.

ఒకవైపు కొండను సరిహద్దుగా చేసుకుని ఈ చెరువునునిర్మించారు. అనేక ఊట కాలువలు ఈ చెరువు లోకి నీటిని చేరవేస్తాయి. ఆ విధంగా ఇది వర్షాభావ పరిస్థితులను తట్టుకుని నీటితో కళకళ లాడుతూ ఉంటుంది.[4]

పర్యాటక ప్రాధాన్యత

మార్చు

13 వ శతాబ్దంలో నిర్మించిన రామప్ప చెరువుకు, దాన్ని ఆనుకుని ఉన్న రామప్ప దేవాలయానికీ ఎంతో చారిత్రిక ప్రాధాన్యత ఉంది. దానితో ఈ ప్రాంతం చారిత్రిక పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది. రామప్ప చెరువు పరిసరాల్లో ఉన్న ప్రకృతి సౌందర్యం కారణంగా పర్యావరణ పర్యాటకంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే అక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన హరిత లేక్ వ్యూ రిసార్టు ఉంది. పర్యాటక విలువను మరింతగా పెంపొందించే ఉద్దేశంతో 2019 నవంబరులో ప్రభుత్వం ఇక్కడ కొన్ని కొత్త ప్రాజెక్టులను కూడా ప్రతిపాదించింది. చెరువు మధ్యలో ఉన్న ఒక ద్వీపంపై మహాశివుని విగ్రహాన్ని నెలకొల్పే ప్రతిపాదన వీటిలో ఒకటి. ఒక త్రీ స్టార్ రెస్టారెంటు నిర్మించే ప్రతిపాదన కూడా ఉంది[5]

మూలాలు

మార్చు
  1. జైన్, శరద్ కె; అగర్వాల్, పుష్పేంద్ర కె; సింగ్, విజయ్ పి (2007-05-16). హైడ్రాలజీ అండ్ వాటర్ రిసోర్సెస్ ఆఫ్ ఇండియా (in ఇంగ్లీష్). స్ప్రింగర్ సైన్స్ & బిసినెస్ మీడియా. p. 937. ISBN 978-1-4020-5180-7.
  2. తెలంగాన చరిత్ర, రచన-సుంకిరెడ్డి నారాయణరెడ్డి, పేజీ 133
  3. "Ramappa Cheruvu Information in Telugu". web.archive.org. 2019-11-25. Archived from the original on 2019-11-25. Retrieved 2019-11-25.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. Shanker (2018-01-18). "కాకతీయ సామ్రాజ్యంలో కళకళలాడిన జలాశయం ఇదే...!!". Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2020-06-05. Retrieved 2020-06-05.
  5. "Soon, Shiva statue to be built on Warangal's Ramappa Lake". The New Indian Express. Archived from the original on 2020-06-05. Retrieved 2020-06-05.