వెంకటాపూర్ మండలం

తెలంగాణ ములుగు జిల్లా లోని మండలం

వెంకటాపూర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, ములుగు జిల్లాకు చెందిన మండలం.[1]

వెంకటాపూర్‌
—  మండలం  —
తెలంగాణ పటంలో ములుగు జిల్లా, వెంకటాపూర్‌ స్థానాలు
తెలంగాణ పటంలో ములుగు జిల్లా, వెంకటాపూర్‌ స్థానాలు
తెలంగాణ పటంలో ములుగు జిల్లా, వెంకటాపూర్‌ స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°20′36″N 79°56′38″E / 18.343446°N 79.943962°E / 18.343446; 79.943962
రాష్ట్రం తెలంగాణ
జిల్లా ములుగు జిల్లా
మండల కేంద్రం వెంకటాపూర్‌
గ్రామాలు 10
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 38,959
 - పురుషులు 19,476
 - స్త్రీలు 19,483
అక్షరాస్యత (2011)
 - మొత్తం 51.77%
 - పురుషులు 64.79%
 - స్త్రీలు 38.48%
పిన్‌కోడ్ {{{pincode}}}

గతంలో ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భాగంగా ఉండేది.ఇది సమీప పట్టణమైన వరంగల్ నుండి 60 కి. మీ. దూరంలో ఉంది. 2016 పునర్వ్యవస్థీకరణలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చేరిన ఈ మండలం, 2019 లో చేసిన మరో పునర్వ్యవస్థీకరణలో ములుగు జిల్లాలో భాగమైంది.[2][3] ప్రస్తుతం ఈ మండలం ములుగు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 10  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం.ఈ మండల ప్రధాన పరిపాలనా కేంద్రం, వెంకటాపూర్.

మండల గణాంకాలు

మార్చు
 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త వరంగల్​ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం - మొత్తం 38,959 - పురుషులు 19,476 - స్త్రీలు 19,483.

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 370 చ.కి.మీ. కాగా, జనాభా 33,159. జనాభాలో పురుషులు 16,550 కాగా, స్త్రీల సంఖ్య 16,609. మండలంలో 9,055 గృహాలున్నాయి.[4]

వరంగల్ జిల్లా నుండి జయశంకర్ జిల్లాకు

మార్చు

లోగడ వెంకటాపూర్ గ్రామం/ మండలం, వరంగల్ జిల్లా, ములుగు రెవెన్యూ డివిజను  పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా వెంకటాపూర్ మండలాన్ని (1+9) పది గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన జయశంకర్ (భూపాలపల్లి) జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[5].

జయశంకర్ జిల్లా నుండి ములుగు జిల్లాకు

మార్చు

2019 ఫిబ్రవరి 17 న ప్రభుత్వం ములుగు జిల్లాను ఏర్పాటు చేసింది. మరో 8 మండలాలతో పాటు వెంకటాపూర్ మండలాన్ని కూడా కొత్త జిల్లాలోకి చేర్చారు.[6]

మండలంలో ప్రముఖులు

మార్చు

మండలంలోని ప్రముఖులు ప్రముఖ ఆర్టిస్టు రెడ్డిరాజు సునీల్ వెంకటాపూర్ మండలంలో జన్మించారు. రాష్ట్రానికి ఎనలేని కీర్తి ప్రతిష్ఠలు తెచ్చారు. ఎందరో స్నేహితులకు రూ.3 వడ్డీకే రుణాలు ఇస్తూ ఇతోధికంగా సాయపడుతున్నారు.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

మార్చు
  1. అడవిరంగాపూర్
  2. తిమ్మాపూర్
  3. లక్ష్మీదేవిపేట
  4. రామనాథపల్లి
  5. నల్లగుంట
  6. రామానుజపురం
  7. నరసాపురం
  8. పాలంపేట
  9. వెంకటాపూర్

గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు

మార్చు
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 233 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "ములుగు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
  3. https://www.mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO%27s/New%20District%20Gos/MULUGU.PDF
  4. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
  5. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2017-08-26. Retrieved 2019-02-21.
  6. "మరో 2 కొత్త జిల్లాలు". ఈనాడు. Archived from the original on 17 Feb 2019. Retrieved 17 Feb 2019.

వెలుపలి లంకెలు

మార్చు