రాము 1987 లో విడుదలైన తెలుగు చిత్రం. దీనిని వై.నాగేశ్వరరావు దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో డి. రామానాయుడు నిర్మించాడు. ఇందులో నందమూరి బాలకృష్ణ, రజని ప్రధాన పాత్రల్లో నటించగా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంగీతం సమకూర్చాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్టైంది.[1][2]

రాము
(1987 తెలుగు సినిమా)
దర్శకత్వం వై.నాగేశ్వరరావు
నిర్మాణం డి.రామానాయుడు
కథ వి.సి. గుహనాథన్
చిత్రానువాదం వై.నాగేశ్వరరావు
తారాగణం బాలకృష్ణ,
రజని ,
శారద
సంగీతం యస్.పి. బాలసుబ్రహ్మణ్యం
సంభాషణలు జంధ్యాల
ఛాయాగ్రహణం ఎస్. గోపాలరెడ్డి
కూర్పు కె.ఎ. మార్తాండ్
నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

రాము ( నందమూరి బాలకృష్ణ ) అనాథ. న్యాయవాది రాఘవరావు ( జగ్గయ్య ), గాయత్రి దేవి ( శారద ) తమ నలుగురు పిల్లలలో ఒకరిగా కొడుకులాగా దత్తత తీసుకున్నారు. రాము చాలా తెలివిగలవాడు. తల్లిదండ్రులను చాలా ప్రేమిస్తాడు. వారి కోసం ఏదైనా చేస్తాడు. రాము వారి ఇంట్లో పనివాడి కుమార్తె అయిన సీతను ( రజని ) తో ప్రేమలో పడతాడు. రాముకు వారి ఇంటి వ్యవహారాలలో ఉన్న స్వేచ్ఛ, హక్కులు వారి స్వంత కుమారులు సతీష్, రమేష్ (హరి ప్రసాద్, భాస్కర్) లకు, అల్లుడు గోపాలానికీ ( సుధాకర్ ) నచ్చదు. కాబట్టి వారు ఒక కుట్ర చేసి రామును ఇంటి నుండి పంపించేసి అధికారాలన్నీ తమ చేతిలోకి తీసుకుంటారు. ఇప్పుడు రాము తన కుటుంబంతో తిరిగి కలవడమే మిగతా కథ

నటవర్గం

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు

పాటలు

మార్చు
సం. పాట పేరు గాయకులు పొడవు
1 "అనురాగాల" ఎస్పీ బాలు 5:19
2 "వానేమి చేస్తుంది" ఎస్పీ బాలు, ఎస్.జానకి 4:49
3 "కానీ కానీ ముందు" ఎస్పీ బాలు, పి.సుశీలా 4:40
4 "ఒంటి గంట కొట్టు" ఎస్పీ బాలు, పి.సుశీలా 4:41
5 "దండాలమ్మ దండాలమ్మ" ఎస్పీ బాలు, రమణ 5:06

మూలాలు

మార్చు
  1. "Heading". IMDb.
  2. "Heading-2". Nth Wall. Archived from the original on 2015-01-29. Retrieved 2020-08-29.