దగ్గుబాటి రామానాయుడు

సినీ నిర్మాత, రాజకీయ నాయకుడు


డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు (జూన్ 6, 1936 - ఫిబ్రవరి 18, 2015) తెలుగు సినిమా నటుడు, ప్రముఖ నిర్మాత, భారత పార్లమెంటు మాజీ సభ్యుడు. ఇతను 1936వ సంవత్సరం జూన్ 6వ తేదీన ప్రకాశం జిల్లా కారంచేడులో జన్మించాడు. ఒకే వ్యక్తి శతాధిక చిత్రాలను నిర్మించి, ప్రపంచ రికార్డ్ సృష్టించిన నిర్మాతగా డి. రామానాయుడు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించాడు. మూవీ మోఘల్ గా ఈయన్ని అభివర్ణిస్తారు. అంతటితో ఆగకుండా నేటికీ నిర్మాతగా ఆయన కొనసాగుతూ వర్ధమాన నిర్మాతలకు స్ఫూర్తిగా నిలిచాడాయన. అంతేగాక తన సంపాదనలో ప్రధానభాగం సినిమా రంగానికే వెచ్చిస్తూ, స్టూడియో, ల్యాబ్‌, రికార్డింగ్‌ సదుపాయాలు, డిస్ట్రిబ్యూషన్‌, ఎగ్జిబిషన్‌, పోస్టర్స్ ప్రింటింగ్‌, గ్రాఫిక్‌ యూనిట్‌తో సహా సినిమా నిర్మాణానికి సంబంధించిన అన్ని సదుపాయాలను సమకూర్చడంతో పాటు పార్లమెంట్‌ సభ్యునిగానూ రాణించాడు. ఇతను 1999లో బాపట్ల నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా లోక్‌సభకు ఎన్నికైనాడు. 2004లో అదే స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయాడు. 2010 సెప్టెంబరు 9న భారత ప్రభుత్వం నాయుడికి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము ప్రకటించింది. 2015 ఫిబ్రవరి 18న హైదరాబాదులో కాన్సర్ వ్యాధితో బాధపడుతూ మరణించాడు[1].

దగ్గుబాటి రామానాయుడు
RamaNaidu.jpg
దగ్గుబాటి రామానాయుడు
జననందగ్గుబాటి రామానాయుడు
జూన్ 6, 1936
ప్రకాశం జిల్లా కారంచేడు
మరణం2015 ఫిబ్రవరి 18(2015-02-18) (వయసు 78)[1]
హైదరాబాద్, తెలంగాణ
మరణ కారణంకేన్సర్
నివాస ప్రాంతంహైదరాబాద్
ఇతర పేర్లుమూవీ మోఘల్
ప్రసిద్ధితెలుగు సినిమా నటుడు, ప్రముఖ నిర్మాత , భారత పార్లమెంటు మాజీ సభ్యుడు
రాజకీయ పార్టీతెలుగుదేశం పార్టీ
మతంహిందూ
భార్య / భర్తరాజేశ్వరి
పిల్లలుసురేష్, వెంకటేష్
తండ్రివెంకటేశ్వర్లు
Notes
ప్రపంచ రికార్డ్ సృష్టించిన నిర్మాతగా డి. రామానాయుడు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించాడు

వ్యక్తిగత జీవితంసవరించు

దగ్గుబాటి రామానాయుడు, 1936వ సంవత్సరం జూన్ 6వ తేదీన ప్రకాశం జిల్లా కారంచేడులో ఒక రైతు కుటుంబంలో జన్మించాడు. తండ్రి వెంకటేశ్వర్లు. రామానాయుడుకి ఒక అక్క, చెల్లెలు. మూడేళ్ళ వయసులోనే తల్లి చనిపోయింది. పినతల్లి వద్ద గారాబంగా పెరిగాడు. ఒంగోలులోని డాక్టరు బి.బి.ఎల్.సూర్యనారాయణ అనే బంధువు ఇంట్లో వుంటూ ఎస్సేసేల్సి దాకా విద్యాబ్యాసం చేశాడు. సూర్యనారాయణను చూశాక తానూ కూడా డాక్టరు కావాలని కలలుకనేవాడు. బడి లేనప్పుడు కాంపౌండరు అవతారం ఎత్తేవాడు. విజయవాడలో లయోలా కాలేజి ఏర్పాటు కోసం రెండు లక్షల చందాలు వసులుచేసినందుకు కృతజ్ఞ్యతగా క్రైస్తవ మిషనరీలు మద్రాసులోని ఆంధ్రా లయోలా కాలేజిలో సీటు కొరకు సాయం చేసారు. ఎప్పుడూ కాలేజిలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో, కబడ్డీ మైదానంలోనే కనిపించేవాడు. మొదటి సంవత్సరం పరీక్షలు తప్పడంతో, తండ్రి తీసుకువచ్చి చీరాల కళాశాలలో చేర్పించాడు. ఇక్కడ కాలేజి రాజకీయాలు తోడయాయి. రెండో సంవత్సరం పరీక్షలు కూడా తప్పాడు. రామానాయుడుకు మామ కూతురు రాజేశ్వరితో పెళ్ళి జరిగింది. పెళ్ళయిపోగానే ఆస్తి పంచివ్వమని తండ్రిని అడిగాడు కానీ తండ్రిమాట కాదనలేక మొదటి కొడుకు సురేష్ పుట్టేదాకా ఆస్తి విభజన వాయిదాపడింది. ఆతర్వాత, వందెకరాల పొలంతో సొంత సేద్యం మొదలుపెట్టాడు. వీరికి సురేష్, వెంకటేష్ ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు పేరు మీద సురేష్ ప్రొడక్షన్స్ స్థాపించారు.

సినిమా జీవితంసవరించు

కారంచేడులో 'నమ్మిన బంటు' షూటింగ్ లో ఎడ్లపందెం దృశ్యం చిత్రీకరణ జరిగేటప్పుడు, రామానాయుడు ఓ సీన్లో నటించాడు, హుషారుగా అటు ఇటు తిరుగుతుండగా సినిమావాళ్ళ దృష్టిని ఆకర్షించాడు. తిరిగి వెళ్తునప్పుడు 'మీరు సినిమాల్లోకి ఎందుకు కాకూడదు?' అని అక్కినేని అడికితే, ఊరు, వ్యవసాయం తప్పించి మరో ఆలోచన లేదని బధులు ఇచ్చాడు. ఇష్టం లేకున్నా రైసుమిల్లు వ్యాపారం మొదలు పెట్టాడు, ఓ రోజు హఠాత్తుగా సేల్స్-టాక్సవాళ్ళు వచ్చి, బిల్లులు రాయడములేదంటు రెండు లక్షల రూపాయలు జరిమానా విధించారు. దీనితో ఆ వ్యాపారం మిద విరక్తి వచ్చేసింది, మిల్లు ముసివేషి, ఊరు విడచి చెన్నపట్నం చేరుకున్నాడు. మహాబలిపురం రోడ్డులో పొలం కొన్నాడు, కాలక్షేపానికి రోజు తోడల్లుడితో కలిసి ఆంధ్ర కల్చరల్ అసోసియేషన్ కు వెళ్ళేవాడు. అక్కడే సినిమావాళ్ళతో పరిచయాలు అయ్యాయి. 'అనురాగం' చిత్ర నిర్మాతలు భాగస్వాముల కోసం ఎదురు చూస్తున్నామని కబురుపెట్టారు. రామానాయుడు తన తండ్రిని ఒప్పించి, దురలవాట్ల జోలికి వెళ్లనని మాటిచ్చాడు.జి.రామినీడు దర్శకత్వంలో 'అనురాగం' అనే చిత్రాన్ని నిర్మించి తొలి విజయాన్ని అందుకున్నారు. తన పెద్ద కుమారుడు సురేష్‌బాబు పేరున సురేష్ ప్రొడక్షన్స్ ప్రారంభించి 1964లో ఎన్టీఆర్ కథానాయకుడిగా 'రాముడు-భీముడు' చిత్రాన్ని నిర్మించి అఖండ విజయాన్ని అందుకున్నారు. అక్కినేని నాగేశ్వరరావు, ఆదుర్తి సుబ్బారావు, ఎస్వీ రంగారావు, గుమ్మడి వెంకటేశ్వరరావులతో ఎక్కువ సమయాన్ని గడిపేవారు. ఈ పరిచయాలతోనే ఆయనకు 'నమ్మిన బంటు' చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత పలు వ్యాపారాలు చేసిన ఆయన మళ్లీ జి.రామినీడు దర్శకత్వంలో 'అనురాగం' అనే చిత్రాన్ని నిర్మించి తొలి విజయాన్ని అందుకున్నారు. తన పెద్ద కుమారుడు సురేష్‌బాబు పేరున సురేష్ ప్రొడక్షన్స్ ప్రారంభించి 1964లో ఎన్టీఆర్ కథానాయకుడిగా 'రాముడు-భీముడు' చిత్రాన్ని నిర్మించి అఖండ విజయాన్ని అందుకున్నారు. సినీ నిర్మాణ రంగంలో అడుగు ముందుకే వేశారు. అయితే ఆ తర్వాత విపరీతంగా నష్టాల పాలైన ఆయన 1971లో ప్రేమ్‌నగర్ చిత్రాన్ని నిర్మించారు.'ప్రేమనగర్' విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. 21 మంది కొత్త దర్శకుల్ని, ఆరుగురు హీరోలను పరిచయం చేశారు

పురస్కారాలుసవరించు

పౌర పురస్కారాలు
ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు (దక్షిణ భారతదేశం)

మరణంసవరించు

చివరి సంవత్సరాల్లో క్యాన్సర్ వ్యాధితో బాధపడ్డ రామానాయుడు అదే వ్యాధి వల్ల 18 ఫిబ్రవరి 2015న హైదరాబాద్‌లో మరణించాడు[1]. 2002-03 సమయంలో రామానాయుడికి ప్రోస్టేట్ గ్రంథి కాన్సర్ ఉన్నట్టు వైద్యులు నిర్ధారించడంతో కొన్నాళ్ళపాటు అమెరికాలో వైద్యం చేయించుకున్నారు. 2015 సమయంలో మళ్లీ సమస్య తలెత్తడంతో హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో వైద్యులు చికిత్స చేశారు. కానీ ఫలితం లేకపోవడంతో 2015 ఫిబ్రవరి 15న మరణించారు.

ఫిల్మోగ్రఫీసవరించు

తెలుగుసవరించు

సంవత్సరం పేరు దర్శకుడు ప్రధాన తారాగణం
2015 గోపాల గోపాల కిషోర్ కుమార్ పార్ధసాని వెంకటేష్, పవన్ కల్యాణ్, శ్రీయ
2014 దృశ్యం శ్రీప్రియ వెంకటేష్, మీనా
2014 భీమవరం బుల్లోడు ఉదయ్ శంకర్ సునీల్, ఎస్తేర్
2013 మసాలా కె. విజయభాస్కర్ వెంకటేష్, రామ్, అంజలి, షాజన్ పదమ్సీ
2013 నేనేం చిన్నపిల్లనా? పి. సునీల్ కుమార్ రెడ్డి రాహుల్ రవీంద్రన్, తన్వి వ్యాస్, సంజన
2011 ముగ్గురు వి. ఎన్. ఆదిత్య నవదీప్, శ్రద్ధ దాస్
2010 ఆలస్యం అమృతం చంద్రమహేశ్ నిఖిల్, వెంకట్ యాదవ్, అరవింద్ కృష్ణ, మదాలస శర్మ
2009 బెండు అప్పారావ్ ఆర్. ఎం. పి ఇ.వి.వి. సత్యనారాయణ అల్లరి నరేష్, జివికే యాదవ్, కామ్న జెఠ్మలానీ, మేఘన
2008 "కౌసల్య సుప్రజ రామ" సూర్య ప్రసాద్ శ్రీకాంత్, శివాజి, ఛార్మి, గౌరి ముంగల్
2008 బలాదూర్ ఉదయ్ శంకర్ రవితేజ, అనుష్క
౨౦౦౭ తులసి బోయపాటి శ్రీనివాసరావు వెంకటేష్, నయనతార
2007 "మధుమాసం చంద్ర సిద్ధార్థ సుమంత్, స్నేహ, పార్వతి మిల్టన్
2006 శ్రీకృష్ణ 2006 విజయేంద్ర ప్రసాద్ శ్రీకాంత్, వేణు, గౌరీ ముంజల్
2005 సోగ్గాడు టి. రవి రెడ్డి రరుణ్, ఆర్తి అగర్వాల్
2005 నిరీక్షణ (2005 సినిమా) సీతా రామ్ ప్రసాద్ ఆర్యన్ రాజేష్, శ్రీదేవి
2005 బొమ్మలాట కె. ప్రకాశ్ సాయికుమార్, శ్రేయ, నరేష్
2004 మల్లీశ్వరి కె. విజయ భాస్కర్ వెంకటేష్, కత్రినా కైఫ్
2003 విజయం సింగీతం శ్రీనివాసరావు రాజా, గజాలా
2003 నీకు నేను నాకు నువ్వు రాజశేఖర్ ఉదయ కిరణ్, శ్రేయ
2003 హరివిల్లు బి. నరసింగరావు భానుచందర్, హరిత
2002 నువ్వు లేక నేను లేను కాశీ విశ్వనాథ్ తరుణ్, ఆర్తి అగర్వాల్
2002 నీ ప్రేమకై ముప్పలనేని శివ వినీత్, అబ్బాస్, లయ
2002 అల్లరి టి. రవి రెడ్డి నరేష్, నీలాంబరి, శ్వేతా అగర్వాల్
2002 హాయ్ ఇ.వి.వి. సత్యనారాయణ ఆర్యన్ రాజేష్, నికిత
2001 ప్రేమించు బి. సుబ్బారావ్ సాయి కిరణ్, లయ
2000 కలిసుందాం రా ఉదయ శంకర్ వెంకటేష్, సిమ్రాన్
2000 జయం మనదేరా ఎన్. శంకర్ వెంకటేష్, వెంకన్న యాదవ్, భానుప్రియ, సౌందర్య
1999 పెద్దమనుషులు బి. సుబ్బారావు సుమన్, రచన, హీరా
1999 ప్రేయసి రావే చంద్రమహేష్ శ్రీకాంత్, రాశి
1998 శివయ్య సురేష్ కృష్ణ రాజశేఖర్, సంఘవి, మోనికా బేడీ
1998 గణేష్ తిరుపతి స్వామి వెంకటేశ్, రంభ, మధుబాల
1997 ప్రేమించుకుందాం రా జయంత్ సి. పరాంజీ వెంకటేష్, అంజలీ జవేరీ
1997 సూపర్ హీరోస్ ఎవియస్ ఎవియస్, బ్రహ్మానందం
1996 'ధర్మ చక్రం సురేష్ కృష్ణ వెంకటేశ్, రమ్యకృష్ణ, ప్రేమ
1996 ఆహా నా పెళ్ళంట జంధ్యాల హరీష్, సంఘవి
1996 నాయుడు గారి కుటుంబం బి. సుబ్బారావు సుమన్, కృష్ణంరాజు, సంఘవి
1996 తాత మనవడు కె. సదాశివరావు కృష్ణం రాజు, వినీద్ కుమార్, సంఘవి
1995 కొండపల్లి రత్తయ్య దాసరి నారాయణరావు దాసరి నారాయణరావు, హరీష్, ఆమని
1995 తాజ్ మహల్ ముప్పలనేని శివ శ్రీకాంత్, మోనికా బేడీ, సంఘవి
1994 తోడి కోడళ్ళు బి. సుబ్బారావు సురేష్, మాలాశ్రీ
1994 సూపర్ పోలీస్ కె. మురళీ మోహన రావు వెంకటేష్, నగ్మా
1993 అక్కా చెల్లెళ్లు వి.సి. గుహనాధన్ సురేష్, మాలాశ్రీ
1993 'ఆంధ్రవైభవం ఎమ్.ఆర్. రాజాజీ డా.డి. రామానాయుడు, మురళీ మోహన్, జమున
1993 పరువు ప్రతిష్ట వి.సి. గుహనాధన్ సుమన్, సురేష్, మాలాశ్రీ
1992 సూరిగాడు దాసరి నారాయణ రావు దాసరి నారాయణ రావు, సుజాత
1992 ప్రేమ విజేత కె. సదాశివరావు హరీష్, రోజా
1991 ప్రేమ ఖైదీ ఇ.వి.వి. సత్యనారాయణ హరీష్, మాలాశ్రీ
1991 కూలీ నెం. 1 కె. రాఘవేంద్రరావు వెంకటేష్, టబు
1991 సర్పయాగం పరుచూరి బ్రదర్స్ శోభన్ బాబు, హరీష్, రోజా
1990 బొబ్బిలి రాజా బి. గోపాల్ వెంకటేష్, దివ్య భారతి
1989 ఇంద్రుడు చంద్రుడు సురేష్ కృష్ణ కమలహాసన్, విజయశాంతి
1988 ప్రేమ' సురేష్ కృష్ణ వెంకటేష్, రేవతి
1988 బ్రహ్మ పుత్రుడు ' దాసరి నారాయణరావు వెంకటేష్, రజని
1988 చినబాబు ఎ. మోహన్ గాంధీ నాగార్జున, అమల
1987 గురుబ్రహ్మ బి. సుబ్బా రావు ఎ. నాగేశ్వరరావు, శారద
1987 రాము వై. నాగేశ్వరరావు బాలకృష్ణ, రజని
1987 కలియుగ పాండవులు కె. రాఘవేంద్రరావు వెంకటేష్, కుష్బూ
1987 అహనా పెళ్ళంట జంధ్యాల రాజేంద్ర ప్రసాద్
1986 ప్రతిధ్వని బి. గోపాల్ శారద, అర్జున్, రజని
1895 శ్రీకట్న లీలలు పరుచూరి బ్రదర్స్ చంద్రమోహన్, తులసి
1985 మాగల్యబలం బి. సుబ్బారావు శోభన్ బాబు, జయసుధ
1984 సంఘర్షణ కె. మురళీ మోహన రావు చిరంజీవి, విజయశాంతి, నళిని
1984 కథానాయకుడు కె. మురళీమోహన రావు బాలకృష్ణ, విజయశాంతి
1983 ముందడుగు కె. బాపయ్య శోభన్ బాబు, కృష్ణ, శ్రీదేవి, జయప్రద
1982 దేవత కె. రాఘవేంద్రరావు శోభన్ బాబు, జయప్రద, శ్రీదేవి
1981 అగ్నిపూలు కె. బాపయ్య కృష్ణంరాజు, జయసుధ
1981 ప్రేమ మందిరం దాసరి నారాయణ రావు ఎ.ఎన్.ఆర్, జయప్రద
1980 కక్ష విసి. గుహనాథన్ శోభన్ బాబు, వాణిశ్రీ
1979 మండే గుండెలు కె. బాపయ్య శోభన్ బాబు, కృష్ణ, శ్రీదేవి
1979 ఒక చల్లనిరాత్రి కె.వాసు చంద్రమోహన్,మాధవి
1978 చిలిపి కృష్ణుడు బి.సుబ్బారావు కాంతారావు,రాజశ్రీ
1978 ఎంకి నాయుడుబావ బి.సుబ్బారావు శోభనబాబు,వాణిశ్రీ
1977 సావాసగాళ్ళు బి.సుబ్బారావు కృష్ణ,జయచిత్ర
1977 మొరటోడు సికే నగెష్ సత్యనారాయణ,జయసుధ
1976 సెక్రటరి ఎస్ ప్రకాష్ రావు ఎ.నాగేశ్వరరావు,వాణిశ్రీ
1975 అమ్మాయల శపథము జిచిఆర్ శేషగిరి రావు చంద్రమోహన్,లక్ష్మి
1975 సోగ్గాడు కె,బాపయ్య శోభన్‌బాబు,జయచిత్ర
1974 చక్రవాకం వి.మధుసూదన రావు శోభన్‌బాబు,వాణిశ్రీ
1973 జీవనతరంగాలు టి.రామారావు శోభన్‌బాబు,వాణిశ్రీ
1971 ప్రేమనగర్ కె.ఎస్.ప్రకాశరావు ఎ.నాగేశ్వరరావు,వాణిశ్రీ
1970 ద్రోహి కె.బాపయ్య జగ్గయ్య,వాణిశ్రీ
1969 బొమ్మలు చెప్పిన కథ జి.విశ్వనాథం కాంతారావు,విజయనిర్మల
1969 సిపాయి చిన్నయ్య జివిఆర్ శేషగిరి రావు ఎ.నాగేశ్వరరావు,కెఆర్ విజయ
1968 పాప కోసం జివిఆర్ శేషగిరి రావు జగ్గయ్య, దేవిక
1967 స్త్రీ జన్మ కె.ఎస్.ప్రకాశరావు ఎన్.టి.రామారావు,కృష్ణకుమారి
1966 శ్రీ కృష్ణ తులాభారం కె.కామేశ్వరరావు ఎన్.టి.రామారావు,జమున
1965 ప్రతిజ్ఞాపాలన సి.యస్. రావు కాంతారావు, రాజశ్రీ
1964 రాముడు భీముడు తాపి చాణక్య ఎన్.టి.ఆర్, జమున, సావిత్రి
1963 అనురాగం జి. రామినీడు జగ్గయ్య, భానుమతి

మూలాలుసవరించు

  1. 1.0 1.1 1.2 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-02-20. Retrieved 2015-02-18.
  2. "Padma Awards". pib. January 27, 2013. Retrieved January 27, 2013.