రామ్
రామ్ ఒక 2006 లో విడుదలైన తెలుగు కామెడీ డ్రామా చిత్రం. ఎన్.శంకర్ రచన దర్శకత్వం వహించడు. నితిన్, జెనీలియా, హ్రిశితా భట్, కృష్ణంరాజు ప్రధాన పాత్రల్లో నటించారు. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు. మంచి స్పందనలకు 2006 మార్చి 30 న విడుదలైన ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. అటుపై సుమీత్ ఆర్ట్స్ వారు 2008 లో ఈ చిత్రాన్ని హిందీ లోకి లెట్ లివ్: జీనే దో పేరుతో అనువదించారు.
రామ్ (2006 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎన్.శంకర్ |
---|---|
తారాగణం | నితిన్, జెనీలియా, అతుల్ కులకర్ణి, వేణు మాధవ్, ఆలీ, బ్రహ్మానందం, కృష్ణంరాజు, హ్రిశిత బట్టు, ప్రసాద్ బాబు |
నిర్మాణ సంస్థ | శ్రీ వెంకటరమణ పిక్చర్స్ |
విడుదల తేదీ | 30 మార్చి 2006 |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
కథ
మార్చురామ్ ( నితిన్ ), హైదరాబాద్‌లో హ్యాపీ-గో-లక్కీ వ్యక్తి. అతను కాబోయే సైకిల్ ఛాంపియన్. ఒక పోటీలో విజయం సాధించి అతడు, ముంబైలో జరిగే చివరి రౌండ్కు వెళ్తాడు. అయితే, ముంబైలో అతడి జీవితం ఊహించని మలుపులకు లోనౌతుంది. అతను తన కుటుంబం, ముఖ్యంగా తన తాత దశరత రామయ్య ( కృష్ణరాజు ) కు సంబంధించిన చిక్కుముడులను విప్పుతాడు.
తారాగణం
మార్చుపాటలు
మార్చుఈ చిత్రం లోని పాటలను చిన్ని చరణ్, చంద్రబోస్, భువనచంద్ర రాశారు. యువన్ శంకర్ రాజా స్వరపరిచాడు. 2006 మార్చి 10 న హైదరాబాద్ లోని తాజ్ బంజారాలో సంగీతం విడుదలైంది
క్రమసంఖ్య | పేరు | గాయనీ గాయకులు | నిడివి | ||||||
---|---|---|---|---|---|---|---|---|---|
1. | "షాక్" | షాన్, ఆంచల్ దత్తా భాటియా, సుచిత్ర, ప్రేంజీ అమరన్ | 4:39 | ||||||
2. | "నువ్వేనా" | హరిచరణ్, శ్వేతా మోహన్ | 4:23 | ||||||
3. | "మేడిన్ హైద్రాబాద్" | శంకర్ మహదేవన్ | 4:18 | ||||||
4. | "కుర్బానీ" | సాధనా సర్గం, యువన్ శంకర్ రాజా | 4:18 | ||||||
5. | "పిల్ల భలే" | టిప్పు, సైంధవి | 3:54 | ||||||
21:32 |