రాజ్యలక్ష్మి (నటి)

సినీ నటి, శంకరాభరణం ఫేం

రాజ్యలక్ష్మి తెలుగు సినిమా నటీమణి. ఈమె శంకరాభరణం సినిమాతో వెలుగులోనికి వచ్చిన తార.

రాజ్యలక్ష్మి

జన్మ నామంరాజ్యలక్ష్మి
జననం
తెనాలి, గుంటూరు జిల్లా
ప్రముఖ పాత్రలు శంకరాభరణం
చెవిలో పువ్వు
నెలవంక

నేపధ్యము సవరించు

గుంటూరు జిల్లా తెనాలి లోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తల్లి రంగస్థల కళాకారిణి.1979 లో పదవ తరగతి చదువుతున్నపుడు దర్శకుడు కె. విశ్వనాధ్ గారు శంకరాభరణం సినిమాలో నాయిక కోసం వెతుకుతున్నారని తెలిసి తల్లితో పాటు చెన్నై వెళ్ళి ఆయనను కలిసింది. తన చిత్రం లోని శారద పాత్ర కోసం ఆయన ఈమెను ఎంచుకున్నారు. ఆ చిత్రం ఘనవిజయం సాధించాక తమిళం, కన్నడ, మలయాళం, హిందీ సినిమాలలో నటించింది. నాయికగా దాదాపు 20 చిత్రాలలో నటించింది. ఈవిడ నటించిన చిత్రాలలో నెలవంక, చెవిలో పువ్వు, జస్టిస్ చౌదరి, అభినందన, వివాహభోజనంబు, అభిలాష, పసివాడి ప్రాణం, జననీ జన్మభూమి చిత్రాలు ఈమెకు ఎంతో పేరు తెచ్చాయి.

వివాహము సవరించు

ఒక వేడుకలో పరిచయమైన చెన్నైకు చెందిన వ్యాపారవేత్తను 1990 లో ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్ళి తర్వాత సింగపూర్ వెళ్ళి అక్కడ కొద్ది రోజులు గడిపింది. అక్కడే వీరికి ఇద్దరు అబ్బాయిలు జన్మించారు. 2004 లో వీరు తిరిగి చెన్నై వచ్చారు. తర్వాత పలు చిత్రాలు, టెలివిజన్ ధారావాహికలలో నటించడం కొనసాగించింది.

నటించిన సినిమాలు సవరించు

నిర్మాతగా సవరించు

బయటి లింకులు సవరించు

మూలాలు సవరించు

  1. Andhrajyothy (9 January 2022). "సీనియర్ నటి రాజ్యలక్ష్మీ తనయుడు హీరోగా 'పల్లె గూటికి పండగొచ్చింది'". Archived from the original on 9 January 2022. Retrieved 9 January 2022.