రామ్ అసుర్

(రామ్‌ అసుర్‌ నుండి దారిమార్పు చెందింది)

రామ్‌ అసుర్‌ 2021లో విడుదల కానున్న తెలుగు సినిమా. ఎఎస్‌పి మీడియా హౌస్‌, జీవీ ఐడియాస్‌ బ్యానర్ల పై అభిన‌వ్ స‌ర్ధార్‌, వెంక‌టేష్ త్రిప‌ర్ణ నిర్మించిన ఈ సినిమాకు వెంకటేష్‌ త్రిపర్ణ దర్శకత్వం వహించాడు. అభినవ్‌ సర్దార్‌, రామ్‌ కార్తిక్‌, చాందిని తమిళ్‌రాసన్‌, శాని సాల్మాన్‌, శెర్రి అగర్వాల్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా నవంబర్‌ 19న విడుదల కానుంది.[2]

రామ్ అసుర్
దర్శకత్వంవెంకటేష్‌ త్రిపర్ణ
రచనవెంకటేష్‌ త్రిపర్ణ
నిర్మాతఅభిన‌వ స‌ర్ధార్‌
వెంక‌టేష్ త్రిప‌ర్ణ
తారాగణంవిజయ్ శంకర్
సంపత్ కుమార్
చందులాల్
ఛాయాగ్రహణంజె. ప్రభాకర్ రెడ్డి
సంగీతంభీమ్స్ సెసిరోలియో
నిర్మాణ
సంస్థలు
ఎఎస్‌పి మీడియా హౌస్‌, జీవీ ఐడియాస్‌
విడుదల తేదీs
19 నవంబర్ 2021 (థియేటర్ రిలీజ్)
14 జనవరి 2022 (అమెజాన్‌ ప్రైమ్‌ ఓటీటీ)[1]
దేశం భారతదేశం
భాషతెలుగు
బడ్జెట్3.5 crores
బాక్సాఫీసు5 crores

చిత్ర నిర్మాణం

మార్చు

ఈ సినిమా పేరు మొదట ‘పీనట్ డైమండ్’ అనే పేరుతో షూటింగ్ ప్రారంభించి,[3] మాస్ ఆడియెన్స్ కు రీచ్ కాదనే ఉద్దేశ్యంతో సినిమా పేరును ‘రామ్ అసుర్’గా మార్చారు.[4][5]

రామ్ (రామ్ కార్తీక్) కృత్రిమంగా వజ్రం చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. ఈ విషయంలో ఆయన ఎంత ప్రయత్నించినా విజయం సాధించలేడు. అదే సమయంలో ప్రేమించిన అమ్మాయి ప్రియ(షెర్రీ అగర్వాల్‌) అతడిలో వదిలి వెళ్లిపోవడంతో బాగా డిస్టర్బ్ అవుతాడు. ఎలాగైనా జీవితంలో మళ్లీ లేచి నిలబడాలి అనే ఉద్దేశంతో ఫ్రెండ్ సాయంతో రామాచారి (శుభలేఖ సుధాకర్)ను కలవగా సూరిని (అభినవ్ సర్దార్) కలవమని సూచిస్తాడు. ఇంతకీ సూరికి, రామ్ కు సంబంధం ఏంటి ? అస్సలు సంబంధం లేని వీళ్లిద్దరి జీవితాలు ఎలా కలిశాయి..? రామ్ కృత్రిమ వజ్రం చేసాడా లేదా? అనేదే మిగతా సినిమా కథ.[6]

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్లు: ఎఎస్‌పి మీడియా హౌస్‌, జీవీ ఐడియాస్‌
  • నిర్మాత: అభిన‌వ్ స‌ర్ధార్‌, వెంక‌టేష్ త్రిప‌ర్ణ
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకటేష్‌ త్రిపర్ణ
  • సంగీతం: భీమ్స్ సిసిరోలియో
  • సినిమాటోగ్రఫీ: జె. ప్రభాకర్ రెడ్డి

మూలాలు

మార్చు
  1. Sakshi (14 January 2022). "ఓటీటీలోకి వచ్చేసిన రామ్‌ అసుర". Archived from the original on 14 జనవరి 2022. Retrieved 14 January 2022.
  2. Eenadu (26 October 2021). "నవంబరులో 'రామ్‌ అసుర్‌'". Archived from the original on 14 November 2021. Retrieved 14 November 2021.
  3. Namasthe Telangana (14 June 2021). "రెండు కాలాల కథ". Archived from the original on 14 November 2021. Retrieved 14 November 2021.
  4. Andrajyothy (26 October 2021). "కొత్త టైటిల్‌ రామ్‌ అసుర్‌". Archived from the original on 14 November 2021. Retrieved 14 November 2021.
  5. Namasthe Telangana (25 October 2021). "రామ్‌ అసుర్‌ కథ". Archived from the original on 14 November 2021. Retrieved 14 November 2021.
  6. 10TV (19 November 2021). "Ram Asur Movie : మూవీ రివ్యూ" (in telugu). Archived from the original on 19 November 2021. Retrieved 19 November 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)