భీమ్స్ సెసిరోలియో

భీమ్స్ గా పిలువబడే భీమ్స్ సెసిరోలియో ఒక తెలుగు సినీ సంగీత దర్శకుడు, గీత రచయిత. పలు విజయవంతమైన సినిమాలకు సంగీతం అందించాడు[1][2]

భీమ్స్ సెసిరోలియో
తెలుగు సంగీతకారుడు భీమ్స్
వ్యక్తిగత సమాచారం
ఇతర పేర్లుభీమ్స్
వృత్తిసంగీత దర్శకుడు, నేపధ్య గాయకుడు, స్వరకర్త
వాయిద్యాలు
క్రియాశీల కాలం1999–ఇప్పటి వరకు

నేపధ్యము మార్చు

వీరి పూర్వీకులది రాజస్థాన్ రాష్ట్రము. వీరు ఖమ్మం జిల్లాలో స్థిరపడ్డారు. భీమ్స్ విద్యాభ్యాసమంతా ఇక్కడే సాగింది. ఇతడు తెలుగు భాషను చిన్నప్పటినుండి అభ్యసించడం వలన భాషపై మంచి పట్టు వచ్చింది. తొలుత గీతరచయితగా సినీ రంగంలో తన ప్రస్థానం ప్రారంభించాడు. ఆయుధం సినిమాలో ఒయ్ రాజు కళ్ళలో నీవే ... ఒయ్ రాజు గుండెల్లో నీవే అనే పాటను రాశాడు. ఈ పాట ప్రేక్షకుల ఆదరణ పొందింది. తర్వాత సంగీత దర్శకుడిగా తన ప్రస్థానాన్ని మార్చుకుని నువ్వా నేనా సినిమాకి సంగీతాన్ని అందించాడు. అందులోనే వయ్యారి బ్లాక్ బెర్రీ అనే పాటను ఆలపించాడు. ఈ పాట కూడా ప్రేక్షకుల ఆదరణ పొందింది. తర్వాత గాలిపటం, బెంగాల్ టైగర్ సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు. ఇతని సంగీతంలోని నవ్యత ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇతడికి మంచి భవిష్యత్తు ఉన్నదని ప్రేక్షకుల అభిప్రాయము.

సినీ జీవితము మార్చు

సంగీతదర్శకత్వం వహించిన సినిమాలు మార్చు

గీత రచన మార్చు

నేపధ్య గాయకుడు మార్చు

మూలాలు మార్చు

  1. "Bheems Ceciroleo - Music Director ● Playback Singer ● Lyricist". moviebuff.com. 2015-10-30. Archived from the original on 2015-12-23. Retrieved 2015-12-31.
  2. "ఇన్‌టు ది బిగ్ లీగ్".
  3. "Music Review: Bengal Tiger". timesofindia.com. 2015-10-30. Retrieved 2015-12-31.
  4. "Bheems Ceciroleo". timesmusic.com. 2015-10-30. Archived from the original on 2016-04-19. Retrieved 2015-12-31.
  5. "Top Albums and Songs by Bheems Ceciroleo". apple.com. 2015-10-30. Retrieved 2015-12-31.

బయటిలంకెలు మార్చు