నాగబాల సురేష్ కుమార్
నాగబాల సురేష్ కుమార్ (దండనాయకుల సురేష్ కుమార్) ప్రముఖ రచయిత, దర్శకుడు, నటుడు, నిర్మాత. రంగస్థలం, టివీ, సినిమా మూడు మాధ్యమాలలో పనిచేస్తున్నారు. తను రూపొందించిన సీరియల్ పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్నారు.[1]
జననం - విద్యాభ్యాసం
మార్చుసురేష్ కుమార్ 1959, ఆగష్టు 30న శ్రీనివాసరావు, హేమలత దంపతులకు ఆదిలాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ లో జన్మించారు. పొలిటికల్ సైన్స్ లో, హిస్టరీలో ఎం.ఏ. పూర్తిచేశారు.
సురేష్ కుమార్ నాన్న శ్రీనివాసరావు సంగీతకారుడు, తాత రామారావు రచయిత. దీంతో ఆయా రంగాలపై పుట్టుకతోనే ఈయనకు ఆసక్తి ఏర్పడింది. చిన్నతనంలోనే నవజ్యోతి సాహితీ సంస్థను స్థాపించి ఒరిస్సా, వెస్ట్ బెంగాల్లో నాటకాలు వేశారు. అలా 20 సంవత్సరాల వయస్సులోనే వందల కొద్ది ప్రదర్శనలు ఇచ్చారు.
వివాహం - పిల్లలు
మార్చుభార్య - లలిత, కుమారులు - సాయితేజ, మానస్, కూతురు - సుస్మిత.
నాటకరంగం
మార్చు1971లోనే రంగస్థలంలోకి అడుగుపెట్టారు. 1976లో రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో జాబ్ వచ్చింది. ఎమ్మార్వో స్థాయి వరకు పనిచేశారు. చిన్నప్పటి నుంచి కళలపట్ల ఆసక్తి ఉండడంతో కళల కోసం ఉద్యోగం మానేశారు. నాటకాలు, సీరియల్స్ చేస్తున్న క్రమంలో తనకూ ఓ బ్యానర్ ఉండాలని 1992లో తేజ ఆర్ట్స్‌ను స్థాపించి, 'బాలచంద్రుడు' అనే నాటికలో ఏకపాత్రాభినయం కూడా చేశారు.[1]
అదిలాబాద్ జిల్లా సాంస్కృతిక సమాఖ్య, నవజ్యోతి సాంస్కృతిక సంస్థ, ఎంప్లాయీస్ రి్క్రియేషన్ క్లబ్, ఓం సాయితేజా ఆర్ట్స్, భారత్ కల్చరల్ అకాడమీల... టెలివిజన్, టి.వి. రచయితల సంఘం స్థాపించారు. విశ్వా కమ్యూనికేషన్ అనే పేరుతో మార్కెటింగ్ ఏజెన్సీని కూడా నడిపిస్తున్నారు.
రచించిన నాటకాలు
మార్చు- క్విట్ ఇండియా
- ఇతిప్రచోదయాత్
- మార్చి ఫాస్ట్
- జనకయనాజాయతే శాద్ర:
- రేబిస్
- స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్
- ఏ చరిత్ర చూసినా...?
- పులిరాజా న్యాయం జయిస్తుంది
ప్రదర్శించిన ఇతర నాటికలు
మార్చు- అసురగణం
- పులీ! మేకలోస్తున్నాయి జాగ్రత్త!
- రామరాజ్యం
- మీరైలే ఏం చేస్తారు ?
- ఎడ్రస్ లేని మనుషులు
- యథాప్రజా - తథారాజా
- మంచంమీద మనిషి
- పెండింగ్ ఫైల్
- నాతిచరామి
- అతిథి దేవుళ్లొస్తున్నారు
ధారావాహికల దర్శకనిర్మాతగా
మార్చు1995లో మొదటి సీరియల్ శ్రీ ఆదిపరాశక్తి తీశారు. ఇది దక్షిణ భారతంలోనే మొదటి పౌరాణిక సీరియల్ గా గుర్తింపు పొందింది. నటి సనా ఆదిపరాశక్తిగా టీవీ రంగానికి పరిచయమయింది. ఆ సీరియల్ 8 భాషల్లో అనువాదమైంది. ఆ తర్వాత ఫారెస్ట్ అడ్వంచర్‌గా శభాష్ బేబీ, స్వాతిచినుకులు, స్వతంత్ర సంగ్రామం లాంటి సీరియల్స్ చేశారు.[1]
- నాగబాల
- శ్రీ ఆదిపరాశక్తి
- అపరాధి
- విజయసామ్రాట్
- వీరభీమ్
- అభయ
- శభాష్ బేబి
- సౌందర్యరేఖ
- ఆత్మయాత్ర
- సంగ్రామం
- స్వాతిచినుకులు
- నాకిష్టం ఎందుకంటే
- శాస్త్రం శస్త్రం
- మిస్టర్ బ్లాక్ అండ్ మిస్టర్ వైట్
- విశ్వసాయి
- తెలంగాణ త్యాగధనులు
- చాకలి ఐలమ్మ
వంటి 21 సీరియల్స్ పురాణ గాథలు, సృష్టి సీరియళ్ల రచన. 716 డాక్యుమెంటరీ చిత్రాల నిర్మాణం.
చిత్ర రచయితగా
మార్చు- శిరిడి సాయి - దర్శకుడు: కె. రాఘవేంద్రరావు, కథానాయకుడు: అక్కినేని నాగార్జున
- అవదూత
- మహారథి - దర్శకుడు: పి. వాసు, కథానాయకుడు: బాలకృష్ణ
- రణం - దర్శకుడు: అమ్మ రాజశేఖర్, కథానాయకుడు: గోపిచంద్
అవార్డులు
మార్చు- ఉగాది పురస్కారం - 2015, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం[2]
- 13 నంది అవార్డులు (ఆల్‌ఇండియా బెస్ట్ డైరెక్టర్‌గా 'అపరాధి'కి, 'ఆత్మయాత్ర')
- ఇందిరా ప్రియదర్శిని అవార్డు (డబ్బింగ్ సీరియల్ ఉద్యమానికి, తెలుగు టివి రంగానికి చేసిన సేవలకు గానూ ఈ అవార్డు వరించింది)
- డికేడ్స్ బెస్ట్ డైరెక్టర్, యువకళావాహిని
- దశాబ్ద ఉత్తమ నిర్మాత, జి.వి.ఆర్. అరాధన
- 2 బెస్ట్ డైరెక్టర్ - RAPA, బొంబాయి
- ఉగాది పురస్కారం, తెలుగు సినీ రచయితల సంఘం
- రఫా అవార్డు
- 2023: ఉత్తమ నాటక రచయిత విభాగంలో తెలుగు విశ్వవిద్యాలయం - కీర్తి పురస్కారం (2021)[3]
బిరుదులు
మార్చుయువసభాసామ్రాట్, కళాశిరోమణి, భక్త, ఆధ్యాత్మిక కరీటి, దర్శక ప్రవీణ, కళారత్న, సేవా శిరోమణి, విశిష్ట కళానిధి, కృషిరత్న.
రికార్డులు
మార్చువండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు, జీనియస్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ రికార్డు లో చోటు. అతి తక్కువ వ్యవధిలో వ్యక్తిగతంగా 686 డాక్యుమెంటరీ చిత్రాల నిర్మాణం చేసినందుకు.
కొత్తవారికి అవకాశం
మార్చు1995లో 'ఆది పరాశక్తి' అనే సీరియల్లో సనాకి ఓ పాత్ర ఇచ్చారు. మధుమణి కూడా ఛాన్స్ ఇచ్చారు. ఈయన అవకాశాలు ఇచ్చిన వాళ్లు ఇప్పుడు సీరియల్ డైరెక్టర్లుగా, కొంత మంది మ్యూజిక్ డైరెక్టర్స్‌గా తయారయ్యారు. మరి కొందరు సినిమాల్లో కూడా చేస్తున్నారు.
ఇతరములు
మార్చు'నాగబాల' భారతదేశంలో మొదటి సారి పాము మీద వచ్చిన సీరియల్. 'ఆదిపరాశక్తి' మైథాలాజికల్ సీరియల్. 'ఆత్మయాత్ర'... క్లోనింగ్ మీద వచ్చింది. జపాన్‌లో క్లోనింగ్ ద్వారా గొర్రెను సృష్టించారు. అయితే భవిష్యత్‌లో మనిషిని కూడా క్లోనింగ్ చేస్తారనుకొని ఆత్మయాత్ర తీశారు.
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 "టీవీ నగర్ ఏర్పాటుకు కృషి చేస్తా." Sakshi. 2019-01-09. Archived from the original on 2023-09-13. Retrieved 2023-09-13.
- ↑ "Nagabala Suresh Kumar Received Ugadi Puraskaram". www.ragalahari.com (in ఇంగ్లీష్). 2015-03-22. Archived from the original on 2020-11-26. Retrieved 2023-09-13.
- ↑ "తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాల ప్రదానం". EENADU. 2023-09-13. Archived from the original on 2023-09-13. Retrieved 2023-09-13.