రాయదుర్గం పురపాలక సంఘం

రాయదుర్గం పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురంకు చెందిన మున్సిపాలిటీ.ఈ పురపాలక సంఘం అనంతపురం లోక్‌సభ నియోజకవర్గం లోని, రాయదుర్గం శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.

రాయదుర్గం పురపాలక సంఘం
రాయదుర్గం
స్థాపన1963
రకంస్థానిక సంస్థలు
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన
కేంద్రీకరణపౌర పరిపాలన
కార్యస్థానం
సేవలుపౌర సౌకర్యాలు
అధికారిక భాషతెలుగు
ప్రధానభాగంపురపాలక సంఘం
జాలగూడుఅధికార వెబ్ సైట్

చరిత్ర మార్చు

రాయదుర్గం పురపాలక సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురంలోని మునిసిపాలిటీ.రాయదుర్గం పట్టణంలో పట్టు చీరలు నేయటం ఒక కుటీర పరిశ్రమ. ఇక్కడి జనాభాలో అధిక శాతం చేనేత కార్మికులు అయితే కాలక్రమేణ చేనేత పరిశ్రమ కుంటుపడడంతో జీన్స్ పరిశ్రమ ఊపందుకుంది. ఇప్పుడు ఈ ప్రాంతం జీన్స్ ప్యాంట్లుకు ప్రసిద్ధి. ఇది సరిహద్దు ప్రాంతం కావడం చేత ఇక్కడి ప్రజలు అధిక శాతం తెలుగు, కన్నడ రెండు భాషలూ మాట్లడగలరు.1963 సంవత్సరంలో మునిసిపాలిటీగా స్థాపించబడింది.[1] ఈ పురపాలక సంఘం 49.కి.మీ.విస్తీర్ణం కలిగి ఉంది.31 ఎన్నికల వార్డులు ఉన్నాయి.

జనాభా గణాంకాలు మార్చు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం 61,749 జనాభా ఉండగా అందులో పురుషులు 30,911, మహిళలు 30,838 మంది ఉన్నారు.అక్షరాస్యత రాష్ట్ర సగటు 67.02% కంటే 69.59% ఎక్కువ. పురుషుల అక్షరాస్యత 76.75% కాగా, మహిళా 62.47% అక్షరాస్యులు ఉన్నారు.0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 7462 ఉన్నారు.[2]

ప్రస్తుత చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ మార్చు

ప్రస్త్తుత చైర్‌పర్సన్‌గా రాజశేఖర్, [3] వైస్ చైర్మన్‌గా మహబూబ్ బాషా పనిచేస్తున్నారు.[3]

పట్టణంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు మార్చు

  1. దశభుజ గణపతి ఆలయం: రాయదుర్గంలోని దశభుజ గణపతి మందిరం ప్రత్యేకమైంది. ఆ కళ్లు అచ్చంగా తండ్రి పోలికే, మూడుకన్నులతో ముక్కంటి బిడ్డ అనిపించుకున్నాడు. చేతులేమో అమ్మను తలపిస్తాయి, మహాశక్తిని గుర్తుకుతెచ్చేలా దశభుజాలు. మేనమామ లక్షణాలూ వచ్చాయి, విష్ణుమూర్తిలా చేతిలో సుదర్శనం.

మూలాలు మార్చు

  1. "Rayadurg Municipality". cdma.ap.gov.in. Municipal Administration & Urban Development Department, Govt. of Andhra Pradesh. Archived from the original on 2016-08-07. Retrieved 2020-07-10.
  2. "Rayadurg Municipality City Population Census 2011-2020 | Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2020-07-10.
  3. 3.0 3.1 "List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)" (PDF). State Election Commission. 2014. Archived from the original (PDF) on 6 సెప్టెంబరు 2019. Retrieved 13 May 2016.

వెలుపలి లంకెలు మార్చు