చంద్రహారం (Chandraharam) 1954లో విడుదలైన తెలుగు సినిమా. దీనిని విజయా ప్రొడక్షన్స్ వారు కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో నిర్మించారు.

చంద్రహారం
(1954 తెలుగు సినిమా)
Chandraharam.jpg
దర్శకత్వం కమలాకర కామేశ్వరరావు (తొలి చిత్రం)
తారాగణం నందమూరి తారక రామారావు,
శ్రీరంజని,
సావిత్రి,
ఎస్.వి. రంగారావు
సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు
నిర్మాణ సంస్థ విజయా ప్రొడక్షన్స్
భాష తెలుగు

సంక్షిప్త చిత్రకథసవరించు

చందనరాజు ప్రాణం అతని మెడలోని హారంలో వుంటుంది. అతను ఒక చిత్రాన్ని గీసి ఆ ఊహాసుందరి (గౌరి)నే పెళ్ళి చేసుకుంటానంటాడు. ఆ రాజ్యాన్ని స్వంతం చేసుకోవాలనుకున్న ధూమకేతు తన సలహాదారైన నిక్షేపరాయున్ని పంపి ఆ పోలికలు వున్న అమ్మాయిని లేకుండా చేయాలనుకుంటాడు. ఇలా వుండగా రాకుమారుని పాట విని యక్షకన్య చంచల వచ్చి తనను ప్రేమించమని కోరి, భంగపడి అతని మెడలోని చంద్రహారాన్ని తీసుకుని పోతుంది. ఫలితంగా అతను మరణిస్తాడు. మరో యక్షిణి సహాయంతో మళ్ళీ జీవిస్తాడు. ఈ జీవన్మరణ సమస్యతో వున్న చందనరాజు గౌరిని చూసి వివాహం చేసుకుంటాడు. చివరకు ఆమె పాతివ్రత్య మహిమలే చంచలకు ఓటమి, యువరాజుకు ప్రాణగండం తప్పుతుంది.

సాంకేతికవర్గం[1]సవరించు

తారాగణం[1]సవరించు

విడుదల, స్పందనసవరించు

సాధారణంగా విజయా వారు తీసిన సినిమాలను విడుదల వరకూ దాచిపెట్టరు, సినమా రషెస్ ఎప్పటికప్పుడు ఇతర సినిమా జనానికి, డిస్ట్రిబ్యూటర్లకు, విలేకరులకు చూపుతూంటారు. అలా సినిమాను చూసిన సినీ జనమంతా సినిమా సూపర్ హిట్ అవుతుందన్నారు. విజయా వారు పాతాళ భైరవి తర్వాత ఆ స్థాయిలో నిలిచిపోవాలనుకుని ఈ సినిమా తీయడంతో, అందుకు తగట్టు మంచి ప్రచారం చేయించారు. ఆంధ్ర ప్రాంతంలోని అన్ని కేంద్రాల్లోనూ సినిమాను విడుదల చేశారు. సినిమాలో కథ మెల్లిగా సాగడం, హీరో ఎంతకూ నిద్రలేవకపోవడం వంటి అంశాల వల్ల సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇదే విషయాన్ని నెల్లూరు శేష్ మహల్ థియేటర్లో తొలిరోజు సినిమా చూస్తున్న నిర్మాతలను ఇంటర్వెల్ సమయంలో కొందరు యువకులు అడిగేశారు. అలా సినిమా పరాజయం పాలైంది.[2]

పాటలుసవరించు

  1. ఆంగికం భువనం - జయజయజయ విజయేంద్ర - ఘంటసాల బృందం
  2. ఇది నా చెలి ఇది నా సఖీ నా మనోహరీ - ఘంటసాల
  3. ఎవరివో ఎచటినుంటివో ఓ సఖీ ఎవరివో - ఘంటసాల, ఎ.పి.కోమల
  4. ఎవరే ఎవరే చల్లని వెన్నెల జల్లులు చిలకరించునది - కె. రాణి బృందం
  5. ఏమి శిక్ష కావాలో కోరుకొనవే ప్రేయసి - ఘంటసాల
  6. ఏనాడు మొదలిడితివో విధి ఏనాటికయ్యెనే నాటక సమాప్తి - ఘంటసాల
  7. ఏ సాధువులు యందు హింసల పడకుండ (పద్యం) - పి. లీల
  8. ఏంచేస్తే అది ఘనకార్యం మనమేంచేస్తే అది - పిఠాపురం బృందం
  9. నీకు నీవే తోడుగా లోకయాత్ర సేతువా - మాధవపెద్ది
  10. లాలి జయ లాలి లాలి శుభ లాలి సుగుణములే జయహారముగా - లలిత
  11. విఙ్ఞాన దీపమును వెలిగింపరారయ్య - ఘంటసాల, ఎ.పి. కోమల బృందం

వనరులు, మూలాలుసవరించు

  1. 1.0 1.1 సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి (22 December 2019). "ఫ్లాష్ బ్యాక్ @ 50 చంద్రహారం". ఆంధ్రభూమి దినపత్రిక. Retrieved 14 June 2020.
  2. బి., నాగిరెడ్డి (మార్చి 2009). జ్ఞాపకాల పందిరి. చెన్నై: బి.విశ్వనాథ రెడ్డి.

బయటి లింకులుసవరించు