రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ

భారతదేశంలో రాజకీయ పార్టీ

రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (ఆర్ఎల్ఎస్పీ) అనేది బీహార్ లోని రాజకీయ పార్టీ. 2013, మార్చి 3న ఉపేంద్ర కుష్వాహా ఈ పార్టీని ప్రారంభించాడు.[1][2] నితీష్ కుమార్, ఉపేంద్ర కుష్వాహా మధ్య వైరం ఫలితంగా పార్టీ ఉనికిలోకి వచ్చింది. ఆ తర్వాత కుష్వాహా నితీష్ కుమార్ నాయకత్వంలోని జనతాదళ్ (యునైటెడ్) ను విడిచిపెట్టి తన స్వంత పార్టీని స్థాపించాడు.[3] ఇది 2015 నుండి అనేక తిరుగుబాట్లను, విద్రోహాలను ఎదుర్కొంది.[4][5][6] నితీష్, కుష్వాహా మధ్య సంబంధాలు సాధారణీకరించబడిన తర్వాత, ఉపేంద్ర కుష్వాహా 2021 మార్చి 14న ఈ పార్టీని జెడియులో విలీనం చేశాడు.[7]

రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ
స్థాపకులుఉపేంద్ర కుష్వాహా
స్థాపన తేదీ3 మార్చి 2013 (11 సంవత్సరాల క్రితం) (2013-03-03)
రద్దైన తేదీ14 మార్చి 2021 (3 సంవత్సరాల క్రితం) (2021-03-14)
ఈసిఐ హోదారాష్ట్ర పార్టీ
కూటమిఎన్.డి.ఎ. (2014—2018)
యుపిఎ (2018—2020)
గ్రాండ్ డెమోక్రటిక్ సెక్యులర్ ఫ్రంట్
(2020—2021)
Election symbol

పార్టీ చరిత్ర మార్చు

నేపథ్యం మార్చు

 
రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ బీహార్ రాష్ట్ర ప్రధాన కార్యాలయం.

ఉపేంద్ర కుష్వాహ 2007లో జనతాదళ్ (యునైటెడ్) నుండి తొలగించబడ్డాడు.[8] కుష్వాహ 2009 ఫిబ్రవరిలో రాష్ట్రీయ సమతా పార్టీని స్థాపించాడు. బీహార్‌లోని నితీష్ కుమార్ ప్రభుత్వం కొయేరీ కులాన్న, నిరంకుశ పాలనను దూరం చేసిందని ఆరోపించిన నేపథ్యంలో పార్టీ స్థాపించబడింది. పార్టీ ఏర్పాటుకు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఛగన్ భుజబల్ మద్దతు ఇచ్చాడు.[9] 2009 నవంబరులో కుష్వాహా, కుమార్ మధ్య సంబంధాలను చక్కదిద్దడంతో పార్టీ జనతాదళ్ (యునైటెడ్)లో విలీనం చేయబడింది.[8]

2013 జనవరి 4న, ఆ సమయంలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఉపేంద్ర కుష్వాహా జనతాదళ్ (యునైటెడ్) కి రాజీనామా చేశాడు. నితీష్ నమూనా విఫలమైందని, శాంతిభద్రతలు 7 సంవత్సరాల క్రితం ఉన్నంత అధ్వాన్నంగా మారాయని ఆరోపించాడు. నితీష్ కుమార్ తన ప్రభుత్వాన్ని నిరంకుశ మార్గాల ద్వారా నడుపుతున్నారని, ఆయన జనతాదళ్ (యునైటెడ్)ని తన "పాకెట్ ఆర్గనైజేషన్"గా మార్చుకున్నారని ఆరోపించాడు.[3]

2020 బీహార్ శాసనసభ ఎన్నికలలో, సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్ వాదీ జనతాదళ్ డెమోక్రటిక్, ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్, జనవాదీ సోషలిస్ట్ పార్టీలు కలిసి ఏర్పాటు చేసిన గ్రాండ్ డెమోక్రటిక్ సెక్యులర్ ఫ్రంట్‌లో ఈ పార్టీ చేరింది.

ఎన్నికల్లో పోటీ మార్చు

బీహార్ రాష్ట్ర ఎన్నికలు మార్చు

ఎన్నికలు ఓట్లు సీట్లు సంకీర్ణ
# % ± స్థానం # ± స్థానం
2015 976,940 2.56   6వ
2 / 243
  7వ జాతీయ ప్రజాస్వామ్య కూటమి [10]
2020 744,221 1.77%   TBA
0 / 243
  2 గ్రాండ్ డెమోక్రటిక్ సెక్యులర్ ఫ్రంట్

బీహార్‌లో సాధారణ ఎన్నికలు మార్చు

ఎన్నికలు ఓట్లు సీట్లు సంకీర్ణ
# % ± స్థానం # ± స్థానం
2014 2,460,537 6.97   6వ
3 / 40
  4వ జాతీయ ప్రజాస్వామ్య కూటమి [11] [12]
2019 1,462,518 3.66   3.93 6వ
0 / 40
  3   యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ [13]

ఇవికూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. "RLSP chief Upendra Kushwaha quits as Union Minister". Business Line (in ఇంగ్లీష్). 10 December 2018. Archived from the original on 30 November 2020. Retrieved 2020-04-25.
  2. Lansford, Tom, ed. (2015). "India – National Democratic Alliance". Political Handbook of the World 2015. United States: CQ Press. ISBN 978-1-4833-7157-3.
  3. 3.0 3.1 "JD(U) MP Upendra Kushwaha resigns, attacks Nitish Kumar". The Economic Times. 2013-01-04. Archived from the original on 2020-04-25.
  4. Raj, Dev (29 June 2018). "Split wide open: RLSP bloc forms new party". Telegraph India (in ఇంగ్లీష్). Archived from the original on 5 August 2022. Retrieved 2020-04-25.
  5. "Nagmani resigns, accuses Kushwaha of "selling" party tickets". Business Standard India. 2019-02-10. Archived from the original on 7 April 2020. Retrieved 2020-04-25.
  6. "Jolt to Upendra Kushwaha's RLSP, all 3 of its legislators join JDU". India Today (in ఇంగ్లీష్). 26 May 2019. Archived from the original on 5 August 2022. Retrieved 2020-04-25.
  7. "RLSP chief Upendra Kushwaha announces merger with JDU". India Today (in ఇంగ్లీష్). Archived from the original on 4 August 2022. Retrieved 2021-09-18.
  8. 8.0 8.1 Banerjee, Shoumojit (2009-11-27). "Rashtriya Samata Party merges with JD(U)". The Hindu. ISSN 0971-751X. Archived from the original on 2020-04-25.
  9. Singh, Abhay (8 February 2009). "Upendra Kushwaha forms new political party". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 2020-04-25.
  10. "Bihar 2015". eci.gov.in. Election Commission of India. 20 August 2018. Archived from the original on 15 May 2019. Retrieved 5 October 2020.
  11. "General Election 2014". eci.gov.in. Election Commission of India. 10 August 2018. Archived from the original on 26 April 2019. Retrieved 5 October 2020.
  12. "Lok Sabha election results 2014: Bihar". The Indian Express (in ఇంగ్లీష్). 2014-05-17. Archived from the original on 5 August 2022. Retrieved 5 October 2020.
  13. "General Election 2019". eci.gov.in. Election Commission of India. 11 October 2019. Archived from the original on 20 October 2020. Retrieved 5 October 2020.
  14. "SAMATA PARTY – Official Website". Archived from the original on 15 February 2022. Retrieved 2022-04-25.

బాహ్య లింకులు మార్చు