రాస్ మోర్గాన్
రాస్ విన్‌స్టన్ మోర్గాన్ (జననం 1941, ఫిబ్రవరి 12) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ గా, ఆఫ్ స్పిన్నర్‌గా రాణించాడు. 1965 - 1972 మధ్యకాలంలో న్యూజీలాండ్ తరపున 20 టెస్టులు ఆడాడు.[1]
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | రాస్ విన్‌స్టన్ మోర్గాన్ | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | ఆక్లాండ్, న్యూజీలాండ్ | 1941 ఫిబ్రవరి 12|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఆఫ్‌బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 104) | 1965 29 January - Pakistan తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1972 20 April - West Indies తో | |||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||
1957/58–1976/77 | Auckland | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2017 1 April |
అంతర్జాతీయ కెరీర్
మార్చుమోర్గాన్ 1964-65లో ఆక్లాండ్‌లో జరిగిన రెండవ టెస్ట్‌లో పాకిస్తాన్‌తో అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో 66 పరుగులు చేశాడు. మ్యాచ్‌లో ఇరువైపులా అత్యధిక స్కోర్ ఇది.[2] క్రైస్ట్‌చర్చ్‌లో జరిగిన సిరీస్‌లోని తర్వాతి మ్యాచ్‌లో 97 పరుగులు చేశాడు. మ్యాచ్‌లో మరోసారి న్యూజీలాండ్ నుండి అత్యధిక స్కోర్ ఇది.[3] తర్వాతి కొన్ని నెలల్లో భారత్, పాకిస్థాన్, ఇంగ్లాండ్‌లలో జరిగిన మూడు సిరీస్‌ల కోసం టెస్ట్ జట్టులో కొనసాగాడు. కొన్ని ఇన్నింగ్స్‌లు ఆడుతూ, తన ఆఫ్ స్పిన్‌తో అప్పుడప్పుడు వికెట్లు తీశాడు. మొదటి 12 టెస్టుల్లో 30.13 సగటుతో 663 పరుగులు చేశాడు.[4]
తరువాతి ఏడేళ్ళలో చివరి ఎనిమిది టెస్టుల్లో కేవలం 71 పరుగులు మాత్రమే చేశాడు.[4] 1972లో వెస్టిండీస్‌లో న్యూజీలాండ్ పర్యటనలో తన చివరి మూడు టెస్ట్‌లను ఆడాడు.[5] ఈ మూడు టెస్టుల్లో మోర్గాన్ ఎనిమిది పరుగులు మాత్రమే చేసి ఒక వికెట్ తీశాడు.[6]
మూలాలు
మార్చు- ↑ "Ross Morgan". CricketArchive. Retrieved 29 December 2020.
- ↑ "2nd Test, Auckland, Jan 29 – Feb 2 1965, Pakistan tour of New Zealand". ESPNcricinfo. Retrieved 29 December 2020.
- ↑ "3rd Test, Christchurch, Feb 12 – Feb 16 1965, Pakistan tour of New Zealand". ESPNcricinfo. Retrieved 29 December 2020.
- ↑ 4.0 4.1 "Test Batting and Fielding in Each Season by Ross Morgan". CricketArchive. Retrieved 29 December 2020. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; "TB" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ "Test Cricket Tours – New Zealand to West Indies 1971-72". Test-cricket-tours.co.uk. Archived from the original on 28 January 2019. Retrieved 28 January 2019.
- ↑ Henry Blofeld, "New Zealand in the West Indies, 1971-72", Wisden 1973, pp. 879–98.