రాహుల్‌ సింగ్‌ లోధీ (జననం 6 డిసెంబర్ 1977) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఒకసారి మధ్యప్రదేశ్‌ శాసనభకు ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ తరువాత 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో దామోహ్ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

రాహుల్‌ సింగ్‌ లోధీ

పదవీ కాలం
4 జూన్ 2024 – 2020
ముందు ప్రహ్లాద్ సింగ్ పటేల్
నియోజకవర్గం దామోహ్

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2018
ముందు జయంత్ మలైయా
తరువాత అజయ్ కుమార్ టాండన్
నియోజకవర్గం దామోహ్

వ్యక్తిగత వివరాలు

జననం 6 డిసెంబర్ 1977
మధ్యప్రదేశ్
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్
బంధువులు ఉమాభారతి (మేనత్త)
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు

రాహుల్ లోధీ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2013లో జరిగిన శాసనసభ ఎన్నికలలో దామోహ్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయి, ఆ తరువాత 2018లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి జయంత్ మలైయాపై 798 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి డిసెంబర్ 2020లో బీజేపీలో చేరి,[2] 2021లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ టాండన్ చేతిలో ఓడిపోయాడు. రాహుల్ లోధీ ఆ తరువాత మధ్యప్రదేశ్ వేర్‌హౌస్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా క్యాబినెట్ మంత్రి హోదాలో పని చేశాడు.[3]

రాహుల్ లోధీ 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో దామోహ్ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి తర్బర్ సింగ్ లోధిపై 406426 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[4]

మూలాలు

మార్చు
  1. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Damoh". Archived from the original on 8 August 2024. Retrieved 8 August 2024.
  2. India Today (25 October 2020). "Ahead of Madhya Pradesh bypolls, Congress MLA Rahul Singh Lodhi joins BJP" (in ఇంగ్లీష్). Archived from the original on 8 August 2024. Retrieved 8 August 2024.
  3. TimelineDaily (24 March 2024). "Rahul Singh Lodhi, BJP's Candidate From Damoh Lok Sabha Constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 8 August 2024. Retrieved 8 August 2024.
  4. TV9 Bharatvarsh (5 June 2024). "दमोह सीट से जीतने वाले बीजेपी के राहुल सिंह लोधी कौन हैं? जानिए अपने सांसद को". Archived from the original on 8 August 2024. Retrieved 8 August 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)