రిచర్డ్ డి గ్రోయెన్

న్యూజీలాండ్ మాజీ క్రికెట్ ఆటగాడు

రిచర్డ్ పాల్ డి గ్రోయెన్ (జననం 1962, ఆగస్టు 5) న్యూజీలాండ్ మాజీ క్రికెట్ ఆటగాడు. 1993 - 1994లో న్యూజీలాండ్ తరపున ఐదు టెస్ట్ మ్యాచ్‌లు, 12 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు.[1] ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్ అధికారి.

రిచర్డ్ డి గ్రోయెన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
రిచర్డ్ పాల్ డి గ్రోయెన్
పుట్టిన తేదీ (1962-08-05) 1962 ఆగస్టు 5 (వయసు 62)
ఓటోరోహంగా, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్ మీడియం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 185)1993 6 November - Australia తో
చివరి టెస్టు1994 25 November - South Africa తో
తొలి వన్‌డే (క్యాప్ 86)1993 16 December - Australia తో
చివరి వన్‌డే1994 19 December - Pakistan తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1987/88–1989/90Auckland
1990/91–1995/96Northern Districts
కెరీర్ గణాంకాలు
పోటీ Test ODI FC LA
మ్యాచ్‌లు 5 12 60 50
చేసిన పరుగులు 45 12 311 69
బ్యాటింగు సగటు 7.50 2.39 7.97 4.31
100లు/50లు 0/0 0/0 0/0 0/0
అత్యుత్తమ స్కోరు 26 7* 35 12
వేసిన బంతులు 1,060 549 12,352 2,340
వికెట్లు 11 8 210 56
బౌలింగు సగటు 45.90 59.75 25.07 29.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 10 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 2
అత్యుత్తమ బౌలింగు 3/40 2/34 7/50 4/16
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 2/– 10/– 10/–
మూలం: Cricinfo, 2017 4 May

డి గ్రోయెన్ వైకాటోలోని ఓటోరోహంగాలో జన్మించాడు. ఆక్లాండ్‌లోని మౌంట్ ఆల్బర్ట్ గ్రామర్ స్కూల్‌లో చదువుకున్నాడు.

క్రికెట్ రంగం

మార్చు

ఆక్లాండ్ విశ్వవిద్యాలయంలో అకౌంటెన్సీని అభ్యసించాడు. 1986 నుండి 1997 వరకు ప్రైస్ వాటర్‌హౌస్‌లో మేనేజర్‌గా పనిచేశాడు.[2]

1987-88, 1995-96 సీజన్ల మధ్యకాలంలో ఆక్లాండ్, నార్తర్న్ డిస్ట్రిక్ట్‌ల కోసం దేశీయ క్రికెట్ ఆడాడు.[3] 1992–93 షెల్ ట్రోఫీలో ఒటాగోతో జరిగిన మ్యాచ్‌లో 50కి 7, 49కి 6 వికెట్లు తీసుకున్నాడు.[4] ఆ సీజన్‌లో 16.84 సగటుతో 46 వికెట్లతో పోటీలో ప్రముఖ బౌలర్ గా నిలిచాడు.

1993-94లో టెస్ట్ జట్టుతో కలిసి ఆస్ట్రేలియాలో పర్యటించాడు, గాయపడిన విల్లీ వాట్సన్ స్థానంలో పర్యటన సమయంలో పిలవబడిన తర్వాత మూడు టెస్టుల్లో రెండింటిలో ఆడాడు.[5] 1993-94లో పాకిస్తాన్‌తో స్వదేశంలో రెండు టెస్టులు ఆడాడు. 1994-95లో దక్షిణాఫ్రికా పర్యటనలో చివరి టెస్టు ఆడాడు.[6] పాకిస్తాన్‌తో జరిగిన మొదటి టెస్ట్‌లో 40కి 3 వికెట్లు, 48కి 2 వికెట్లు.అత్యుత్తమ టెస్టు గణాంకాలు సాధించాడు.[7]

డి గ్రోయెన్ 1998 నుండి 2007 వరకు న్యూజీలాండ్ ఒలింపిక్ కమిటీతో గేమ్స్ టీమ్ మేనేజర్‌గా ఉన్నాడు. మూడు కామన్వెల్త్ గేమ్స్ (1998, 2002, 2006), మూడు ఒలింపిక్ గేమ్స్ (2000, 2002, 2004) కోసం జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.[8] 2008 నుండి కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ డెవలప్‌మెంట్ డైరెక్టర్‌గా ఉన్నారు.[9]

మూలాలు

మార్చు
  1. Richard de Groen, CricInfo. Retrieved 2019-12-14.
  2. "Richard de Groen". LinkedIn. Retrieved 14 April 2021.
  3. Richard de Groen, CricketArchive. Retrieved 2019-12-14.
  4. "Otago v Northern Districts 1992-93". ESPNcricinfo. Retrieved 5 April 2021.
  5. Greg Baum, "The New Zealanders in Australia, 1993-94", Wisden 1995, pp. 1047–59.
  6. "Test Matches played by Richard de Groen". CricketArchive. Retrieved 14 April 2021.
  7. "1st Test, Auckland, Feb 10-12 1994, Pakistan tour of New Zealand". ESPNcricinfo. Retrieved 14 April 2021.
  8. "Richard de Groen". NZOC. Retrieved 5 April 2021.
  9. "CGF Management Team". CGF. Archived from the original on 11 సెప్టెంబరు 2021. Retrieved 5 April 2021.

బాహ్య లింకులు

మార్చు