రియా సేన్
రియా సేన్ (ఆంగ్లం: Riya Sen) ఒక భారతీయ నటి మరియు మోడల్. బాలీవుడ్ బ్యూటీగా పేరున్న ఆమె హిందీతో పాటు బెంగాలీ, తమిళ చిత్రాలలో నటించారు.
రియా సేన్ | |
---|---|
![]() 2017లో రియా సేన్ | |
జననం | రియా దేవ్ వర్మ 1981 జనవరి 24 కోల్ కతా, పశ్చిమ బెంగాల్, భారతదేశం |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 1991–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | శివం తివారీ (m. 2017) |
తల్లిదండ్రులు | భరత్ దేవ్ వర్మ మూన్ మూన్ సేన్ |
బంధువులు | రైమా సేన్ (సోదరి) సుచిత్ర సేన్ (అమ్మమ్మ) |
వెబ్‌సైటు | riyasen |
కుటుంబనేపథ్యంసవరించు
రియా సేన్ అసలు పేరు రియా దేవ్ వర్మ. ఆమె 1981 జనవరి 24న జన్మించింది. ఆమె తండ్రి భరత్ దేవ్ వర్మ త్రిపుర రాజకుటుంబానికి చెందినవాడు. అతను కూచ్ బెహార్ యువరాణి ఇలా దేవి కుమారుడు. జైపూర్ మహారాణి గాయత్రీ దేవి మేనల్లుడు. రియా సేన్ తల్లి మూన్ మూన్ సేన్, అమ్మమ్మ సుచిత్రా సేన్ ప్రముఖ నటీమణులు.
కెరీర్సవరించు
1991లో విష్ కన్య చిత్రంలో బాలనటిగా రియా సేన్ నటనా జీవితాన్ని ప్రారంభించింది. 2001లో ఎన్. చంద్ర దర్శకత్వంలో వచ్చిన హిందీ చిత్రం స్టైల్‌తో ఆమె మొదటి వాణిజ్య విజయం సాధించింది. రియా సేన్ 16 ఏళ్ల వయసులో 1998లో వచ్చిన ఫల్గుణి పాఠక్ మ్యూజిక్ వీడియో యాద్ పియా కి ఆనే లగి తో మంచి సక్సెస్ అందుకుంది. అప్పటి నుంచి ఆమె మ్యూజిక్ వీడియోలు, టెలివిజన్ వాణిజ్య ప్రకటనలు, ఫ్యాషన్ షోలతో బిజీ అయింది. మ్యాగజైన్ కవర్లలో కనువిందుచేసింది. అపోహలను తొలగించే లక్ష్యంతో ఎయిడ్స్ అవగాహన మ్యూజిక్ వీడియోలో కనిపించింది. పీడియాట్రిక్ కంటి సంరక్షణ, నిరుపేద పిల్లల కోసం నిధులు సేకరించడంలో కూడా ఆమె సహాయం చేసింది.
ఫిల్మోగ్రఫీసవరించు
సంవత్సరం | సినిమా | పాత్ర | భాష | నోట్సు |
---|---|---|---|---|
1991 | విష్ కన్య | నిషి | హిందీ | చైల్డ్ ఆర్టిస్ట్ గా |
1994 | గజముక్త | బెంగాలీ | చైల్డ్ ఆర్టిస్ట్ గా | |
1999 | తాజ్ మహల్ | మచకాని | తమిళం | |
2000 | గుడ్ లక్ | ప్రియా | ||
2001 | స్టైల్ | షీనా | హిందీ | |
మోనే పోర్ టోమేక్ | రియా | బెంగాలీ | బంగ్లాదేశీ సినిమా | |
2002 | దిల్ విల్ ప్యార్ వ్యార్ | గౌరవ్ గర్ల్ ఫ్రెండ్ | హిందీ | కామియో అప్పియరెన్స్ |
2003 | సాజిష్ | |||
ఖయామత్: సిటీ అండర్ థ్రెట్ | శీతల్ | |||
ఝంకార్ బీట్స్ | ప్రీతి | హిందీ, ఇంగ్లీష్ భాషలు మిశ్రమంగా సినిమా | ||
2004 | దిల్ నే జిసే అప్నా కహా | కామిని | కామియో అప్పియరెన్స్ | |
ప్లాన్ | షాలిని | ఐటమ్ నెంబరు | ||
అరసట్చి | ఇరువతు వైసు | తమిళం | ఐటమ్ నెంబరు | |
2005 | అనంతభద్రం | భామ | మలయాళం | |
షాదీ నెం.1 | మాధురి | హిందీ | ||
తుమ్... హో నా! | రీమా | |||
జేమ్స్ | – | ఐటమ్ నెంబరు | ||
సిల్ సిలే | అనుష్క | |||
ఇట్ వాజ్ రెయినింగ్ దట్ నైట్ | సావిత్రి బెనర్జీ | ఇంగ్లీష్ | ||
2006 | అప్నా సప్నా మనీ మనీ మనీ | శివానీ | హిందీ | |
రోక్డా | – | అన్-ఫినిఫ్డ్ | ||
దిల్ కహిన్ హోష్ కహిన్[1] | - | వీడియో ఆల్బమ్ | ||
లవ్ యు హమేషా | మేఘన | వాస్తవానికి 1999లో విడుదల కావాల్సి ఉంది. | ||
2007 | హే బేబీ | – | ఐటమ్ నెంబరు | |
2008 | నేను మీకు తెలుసా | మధు | తెలుగు | తమిళం లోనికి డబ్బింగ్ చేయబడింది |
హీరోస్ | శివానీ | హిందీ | ||
జోర్ లగా కే... హయ్యా | – | |||
లవ్ కిచిడీ | దీప్తి మెహతా | |||
2009 | పేయింగ్ గెస్ట్స్ | అవని | ||
2010 | బన్నీ అండ్ బబ్లూ | రియా | ||
అబోహోమాన్ | చంద్రిక | బెంగాలీ | ||
2011 | నౌకదుబి | కమల | తన సోదరి రైమా సేన్ తో మొదటిసారి కనిపించారు | |
తేరే మేరే ఫేర్ | ముస్కాన్ | హిందీ | ||
2012 | 3 బ్యాచిలర్స్ | నిషా | దాదాపు 10 సంవత్సరాల క్రితంది | |
2013 | జిందగీ 50-50 | నైనా | ||
రబ్బా మెయిన్ క్యా కరూన్ | ||||
మై లవ్ స్టోరీ | ఐటమ్ గర్ల్ | ఒడియా | ||
2014 | జాతీశ్వర్ | సుదేష్ణ | బెంగాలీ | |
కోల్ కతా కాలింగ్ | ||||
2015 | రోగ హోవర్ సోహోజ్ ఉపయే | |||
ఫ్యామిలీ ఆల్బమ్ | ||||
2016 | హీరో 420 | రియా | ||
డార్క్ చాక్లెట్ | ఇషానీ బెనర్జీ | |||
2017 | లోన్లీ గర్ల్ | రాధికా కపూర్ | హిందీ | షార్ట్ ఫిల్మ్ |
వెబ్ సిరీస్సవరించు
Year | Title | Role | Platform | Notes | Ref. |
---|---|---|---|---|---|
2017 | రాగిణి MMS: రిటర్న్స్ | సిమ్రాన్ | ALTBalaji | Debut Series | |
2019 | పాయిజన్ | నటాషా | ZEE5 | [2][3] | |
2019 | మిస్ మాచ్ 2 | మిషికా | Hoichoi Originals | [4] | |
2020 | పతి పత్నీ ఔర్ వోహ్ | రిమ్ఝీమ్ | MX Player |
మూలాలుసవరించు
- ↑ "Riya Sen's Biography". koimoi.com. Archived from the original on 7 March 2016. Retrieved 2 March 2016.
- ↑ "Poison actor Riya Sen: I am doing damage control on my past film choices". The Indian Express (in Indian English). 19 April 2019. Retrieved 18 June 2019.
- ↑ "Arbaaz Khan returns as the baddie with ZEE5 original 'Poison'". DNA India (in ఇంగ్లీష్). 18 April 2019. Retrieved 18 June 2019.
- ↑ "Riya Sen speaks about 'Mismatch 2'". LaughaLaughi (in అమెరికన్ ఇంగ్లీష్). 25 April 2019. Retrieved 3 September 2021.