రీస్ టోప్లీ
రీస్ జేమ్స్ విలియం టోప్లీ (జననం 1994 ఫిబ్రవరి 21) ఇంగ్లాండ్ అంతర్జాతీయ క్రికెటరు. అతను ఇంగ్లండ్ క్రికెట్ జట్టు తరపున వైట్ బాల్ క్రికెట్‌లో ఎడమ చేతి ఫాస్టు మీడియం బౌలర్‌గా ఆడుతున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో సర్రే తరఫున ఆడతాడు. 2015 ఆగస్టులో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ తరఫున టాప్లీ రంగప్రవేశం చేశాడు. ఇంగ్లండ్ ICC పురుషుల T20 ప్రపంచ కప్ 2022 జట్టులో టాప్లీకి స్థానం లభించింది. అతను ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడుతున్నాడు.
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | రీస్ జేమ్స్ విలియమ్ టోప్లీ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | ఇప్‌స్విచ్, సఫోక్, ఇంగ్లాండ్ | 1994 ఫిబ్రవరి 21|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 6 అ. 8 అం. (2.03 మీ.) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | ఎడమచేతి ఫాస్ట్-మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలరు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బంధువులు | Don Topley (father) Peter Topley (uncle) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 243) | 2015 సెప్టెంబరు 13 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2023 ఫిబ్రవరి 1 - దక్షిణాఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వన్‌డేల్లో చొక్కా సంఖ్య. | 38 (formerly 23) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 74) | 2015 ఆగస్టు 31 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2022 అక్టోబరు 14 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
T20Iల్లో చొక్కా సంఖ్య. | 38 (formerly 23) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2011–2015 | ఎసెక్స్ (స్క్వాడ్ నం. 6) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2016–2018 | హాంప్‌షైర్ (స్క్వాడ్ నం. 6) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2019 | ససెక్స్ (స్క్వాడ్ నం. 23) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2020–present | సర్రే (స్క్వాడ్ నం. 24) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2021–present | Oval Invincibles (స్క్వాడ్ నం. 23) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2021/22 | మె;ల్‌బోర్న్ రెనెగేడ్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2022 | Islamabad United | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 2023 ఆగస్టు 1 |
నేపథ్యం
మార్చుఅతను 1994 ఫిబ్రవరి 21న ఇప్స్విచ్‌లో జన్మించాడు. [1] అతను రాయల్ హాస్పిటల్ స్కూల్లో చదువుకున్నాడు. తండ్రి, డాన్ టోప్లీ, ఎసెక్స్, సర్రే లకు ఫస్ట్-క్లాస్ ఆటలు ఆడాడు. తాను చదువుకున్న రాయల్ హాస్పిటల్ స్కూల్‌లో ఉపాధ్యాయుల్లో అతని తండ్రి ఒకరు. ఆయన అక్కడీ క్రికెట్ మాస్టరు కూడా.[2] అతని బాబాయి పీటర్ టోప్లీ కూడా ఫస్టు క్లాస్ క్రికెటర్.
దేశీయ ఫ్రాంచైజీ కెరీర్
మార్చు2009 జూన్లో, 15 ఏళ్ల వయస్సులో, ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ కెవిన్ పీటర్సన్‌కు లాఫ్‌బరో యూనివర్శిటీలో నెట్స్‌లో బౌలింగ్ చేస్తూ టోప్లీ గాయపడ్డాడు. పీటర్సన్ బంతిని కొట్టగా అది, టాప్లీని తలకు తగిలి అతను నేలపై పడిపోయాడు. అతన్ని లీసెస్టర్ రాయల్ ఇన్‌ఫర్మరీకి తీసుకువెళ్ళి, అక్కడ చెవికి కుట్లు వేసారు. ఈ సంఘటన తర్వాత, టాప్లీకి అతని అభిమాన ఆటగాడు పీటర్సన్, తన సంతకం చేసిన క్రికెట్ బ్యాట్‌ను బహూకరించాడు. [3]
టోప్లీ 2011 సీజన్‌లో కేంబ్రిడ్జ్ MCCU కి వ్యతిరేకంగా ఎసెక్స్ తరపున ఫస్ట్-క్లాస్ రంగప్రవేశం చేశాడు. [4] అతను కెంట్‌తో జరిగిన కౌంటీ ఛాంపియన్‌షిప్ రంగప్రవేశంలో ఆకట్టుకున్నాడు. అతను మ్యాచ్‌లో కెంట్ రెండవ ఇన్నింగ్స్‌లో 5/46 తో తన తొలి ఐదు వికెట్లను తీసుకున్నాడు. [5] మిడిల్‌సెక్స్‌తో జరిగిన తరువాతి ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లో అతను మిడిల్‌సెక్స్ మొదటి-ఇన్నింగ్స్‌లో 5/64తో తన రెండవ ఐదు వికెట్లు సాధించాడు. [6] 2011 మేలో, అతను ఎసెక్స్‌తో ఒక సంవత్సరం ఒప్పందంపై సంతకం చేశాడు. [7] ఆ నెలలో టోప్లీ క్లైడెస్‌డేల్ బ్యాంక్ 40 లో యునికార్న్స్‌కి వ్యతిరేకంగా తన లిస్టు A రంగప్రవేశం చేసాడు. [8] టోప్లీ ఆ ఫార్మాట్‌లో తొలి వికెట్‌కా రాబిన్ లెట్‌ను ఔట్ చేసాడు.[9]
సీజను మధ్యలో టోప్లీ, తన వేసవి పరీక్షల కోసం కౌంటీ క్రికెట్ నుండి విరామం తీసుకున్నాడు. [7] అయితే, అతని విరామ సమయంలో దక్షిణాఫ్రికా అండర్-19 తో జరిగిన యూత్ వన్ డే ఇంటర్నేషనల్ సిరీస్ కోసం ఇంగ్లాండ్ అండర్-19ల కోసం ఆడటానికి అతనికి పిలుపు వచ్చింది. [10] అతను ఆగస్టులో ఎసెక్స్‌కు తిరిగి వచ్చాడు, ఇప్పటి వరకు అతను రెండు లిస్టు A మ్యాచ్‌లు,[8] తొమ్మిది ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. [4] అతను తన ఫస్ట్-క్లాస్ కెరీర్‌ను చక్కగా ప్రారంభించాడు. ఇప్పటి వరకు 23.55 సగటుతో 34 వికెట్లు తీసుకున్నాడు. అతను మాజీ ఇంగ్లండ్ కెప్టెన్ మైఖేల్ వాన్ నుండి ప్రశంసలను అందుకున్నాడు. టాప్లీ భవిష్యత్ టెస్టు క్రికెటర్ కాగలడని అతను పేర్కొన్నాడు.
2015 సెప్టెంబరు 1న, హాంప్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ 2015 సీజన్ ముగింపులో టోప్లీ ఎసెక్స్‌కు సంతకం చేసాడు.[11] 2018 సీజన్ ముగింపులో, మరొక ఫ్రాక్చరవడంతో టోప్లీ, ఇంకొక శస్త్రచికిత్స చేయించుకున్నాడు.
IPL 2021 లో, చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో గాయపడిన జోష్ హేజిల్‌వుడ్‌కు బదులుగా అతనిని అడిగారు. అయితే భారతదేశంలో COVID-19 కేసుల పెరుగుదలకు భయపడి అతను ఆ ఆఫర్‌ను తిరస్కరించాడు. 2021లో, అతను ది హండ్రెడ్ ప్రారంభ సీజన్ కోసం ఓవల్ ఇన్విన్సిబుల్స్ లో చేరాడు.[12] 2021 డిసెంబరులో, అతను 2022 పాకిస్తాన్ సూపర్ లీగ్ కోసం ఇస్లామాబాద్ యునైటెడ్‌కు సంతకం చేసాడు. [13]
2022 ఏప్రిల్లో, ది హండ్రెడ్ 2022 సీజన్ కోసం అతన్ని ఓవల్ ఇన్విన్సిబుల్స్ కొనుగోలు చేసింది. [14]
IPL 2023 సీజన్‌లో ఆడేందుకు, 2022 డిసెంబరు 23న జరిగిన IPL వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అతన్ని 1.9 కోట్లకు కొనుగోలు చేసింది.[15] 2023 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో అతను భుజం గాయం కారణంగా మొత్తం IPL సీజన్‌కు దూరమయ్యాడు. [16]
2023లో ది హండ్రెడ్ 2023 సీజన్ కోసం నార్తర్న్ సూపర్‌చార్జర్స్ అతన్ని తీసుకుంది. [17]
అంతర్జాతీయ కెరీర్
మార్చుటోప్లీ, 2015 ఆగస్టు 31న ఆస్ట్రేలియాపై తన ట్వంటీ20 అంతర్జాతీయ రంగప్రవేశం చేసాడు. [18] అతని వన్డే అంతర్జాతీయ రంగప్రవేశం కూడా ఆస్ట్రేలియాపైనే. 2015 సెప్టెంబరు 13న జరిగిన ఆ మ్యాచ్‌లో 0-33 గణాంకాలను అందుకున్నాడు. [19]
అతను పాకిస్తాన్‌తో జరిగిన సిరీస్ కోసం వన్‌డే జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఆడాడు. మొదటి మ్యాచ్‌లో 3-26తో తన మొదటి అంతర్జాతీయ వికెట్లను తీసుకున్నాడు. అతను తర్వాతి మూడు మ్యాచ్‌లలో ఒక్కో వికెట్ తీశాడు. ఇంగ్లండ్ ఆ మూడు గేమ్‌లూ గెలిచింది. ఈ రెండు జట్ల మధ్య జరిగిన 1వ T20 అంతర్జాతీయ మ్యాచ్‌లో కూడా ఆడి, 3-24తో ముగించాడు.
టోప్లీ దక్షిణాఫ్రికా పర్యటన కోసం వన్‌డే జట్టులో కొనసాగాడు. సిరీస్‌లో ప్రతి గేమ్ ఆడాడు. DL పద్ధతిలో ఇంగ్లాండ్ 39 పరుగులతో గెలిచిన మొదటి గేమ్‌లో అతను 1–43 సాధించాడు. తర్వాతి గేమ్‌లో అతను 4–50 తో ఇంగ్లండ్‌కు వరుస విజయాన్ని అందించడంలో సహాయం చేశాడు. సిరీస్‌లోని తర్వాతి మూడు గేమ్‌లను ఇంగ్లండ్ కోల్పోయింది. టాప్లీ మాత్రం బాగా ఆడాడు. సిరీస్‌లోని నాల్గవ మ్యాచ్‌లో 2–39, చివరి మ్యాచ్‌లో 3–41 సాధించాడు. అతను రెండు T20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఆడినప్పటికీ అతను వికెట్ తీయలేదు.
అతను T20 ప్రపంచ కప్ కోసం ఇంగ్లాండ్ జట్టులో తన స్థానాన్ని నిలుపుకున్నాడు, కానీ వెస్టిండీస్‌తో జరిగిన మొదటి గేమ్‌లో 2.1 ఓవర్లలో 1–22 స్కోరు సాధించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన తదుపరి మ్యాచ్‌లో అతను రెండు ఓవర్లు బౌలింగ్ చేసి 33 పరుగులు ఇచ్చాడు. అతని స్థానంలో లియామ్ ప్లంకెట్ జట్టులోకి వచ్చాడు. టోప్లీ మళ్లీ టోర్నమెంట్‌లో ఆడలేదు. భారత్‌లో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్‌లో ఓడిపోయిన T20 జట్టులో టాప్లీ భాగం. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత అతని వెన్నులో ఫ్రాక్చరు ఉన్నట్లు గుర్తించారు.
2020 మే 29న, COVID-19 మహమ్మారి తర్వాత ఇంగ్లాండ్‌లో ప్రారంభమయ్యే అంతర్జాతీయ మ్యాచ్‌లకు ముందు శిక్షణను ప్రారంభించడానికి తీసుకున్న 55 మంది ఆటగాళ్ల బృందంలో టాప్లీ పేరు చేర్చారు. [20] [21] 2020 జూలై 9న, ఐర్లాండ్‌తో జరిగే వన్‌డే సిరీస్ కోసం రహస్య శిక్షణను ప్రారంభించడానికి టోప్లీ 24 మంది సభ్యుల జట్టులోకి తీసుకున్నారు.[22] [23] 2020 జూలై 27న, టోప్లీ వన్‌డే సిరీస్ కోసం ఇంగ్లాండ్ జట్టుకు ఎంపికయ్యాడు. [24] [25]
2021 మార్చి 26న, పూణెలో భారత్‌తో జరిగిన రెండవ వన్‌డేలో టోప్లీ ఇంగ్లాండ్ ప్రారంభ XIకి తిరిగి వచ్చాడు. అతను 8 ఓవర్లలో 2-50 తీసుకున్నాడు. 2021 అక్టోబరులో, ట్రావెలింగ్ రిజర్వ్‌గా 2021 ICC పురుషుల T20 ప్రపంచ కప్ కోసం టోప్లీని ఇంగ్లాండ్ జట్టులో చేర్చారు. [26]
2022 జూలై 14న, భారత్‌తో జరిగిన రెండవ మ్యాచ్‌లో, టోప్లీ 24 పరుగులకు 6 వికెట్లతో ఒక వన్‌డే మ్యాచ్‌లో ఇంగ్లాండ్ తరపున తన మొదటి ఐదు వికెట్ల పంట, అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు సాధించాడు [27]
మూలాలు
మార్చు- ↑ "Reece Topley – England". ESPN. Retrieved 17 January 2018.
- ↑ "Player profile: Reece Topley". ESPNcricinfo. Retrieved 26 August 2011.
- ↑ Davies, Gareth A. (2 June 2009). "Don Topley's son hospitalised after being floored by Kevin Pietersen drive". The Daily Telegraph. Retrieved 26 August 2011.
- ↑ 4.0 4.1 "First-Class Matches played by Reece Topley". CricketArchive. Retrieved 26 August 2011.
- ↑ "Essex v Kent, 2011 County Championship". CricketArchive. Retrieved 26 August 2011.
- ↑ "Middlesex v Essex, 2011 County Championship". CricketArchive. Retrieved 26 August 2011.
- ↑ 7.0 7.1 "Reece Topley signs one-year Essex contract". ESPNcricinfo. 26 May 2011. Retrieved 26 August 2011.
- ↑ 8.0 8.1 "List A Matches played by Reece Topley". CricketArchive. Retrieved 26 August 2011.
- ↑ "Essex v Unicorns, 2011 Clydesdale Bank 40". CricketArchive. Retrieved 26 August 2011.
- ↑ "Topley called up by England Under-19". ESPNcricinfo. 24 June 2011. Retrieved 26 August 2011.
- ↑ "Fast-Bowler Reece Topley to Join Hampshire". Hampshire County Cricket Club. 1 September 2015. Retrieved 1 September 2015.
- ↑ "The Hundred 2021 - full squad lists". BBC Sport (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2022-02-28.
- ↑ "Franchises finalise squad for HBL PSL 2022". Pakistan Cricket Board. 10 January 2014. Retrieved 12 December 2021.
- ↑ "The Hundred 2022: latest squads as Draft picks revealed". BBC Sport. Retrieved 5 April 2022.
- ↑ Quint, The (23 December 2022). "IPL Auction 2023: Reece Topley Bagged by RCB for Rs 1.90 Crore". TheQuint (in ఇంగ్లీష్). Retrieved 25 December 2022.
- ↑ Howson, Nick. "Reece Topley suffers shoulder scare as IPL injury list grows". thecricketer.com. Retrieved 2023-07-11.
- ↑ "Kate Cross, Reece Topley, Tom Banton and Georgia Wareham join Northern Superchargers in The Hundred Draft". mynewsdesk.com. Retrieved 2023-08-06.
- ↑ "Australia tour of England and Ireland, Only T20I: England v Australia at Cardiff, Aug 31, 2015". ESPNCricinfo. 31 August 2015. Retrieved 31 August 2015.
- ↑ "Australia tour of England and Ireland, 5th ODI: England v Australia at Manchester, Sep 13, 2015". ESPNCricinfo. 13 September 2015. Retrieved 13 September 2015.
- ↑ "England Men confirm back-to-training group". England and Wales Cricket Board. Retrieved 29 May 2020.
- ↑ "Alex Hales, Liam Plunkett left out as England name 55-man training group". ESPN Cricinfo. Retrieved 29 May 2020.
- ↑ "Injured Chris Jordan misses England's ODI squad to face Ireland". ESPN Cricinfo. 9 July 2020. Retrieved 9 July 2020.
- ↑ "England men name behind-closed-doors ODI training group". England and Wales Cricket Board. Retrieved 9 July 2020.
- ↑ "England Men name 14-strong squad for Royal London Series". England and Wales Cricket Board. Retrieved 27 July 2020.
- ↑ "England v Ireland: David Willey & Reece Topley recalled for ODI series". BBC Sport. Retrieved 27 July 2020.
- ↑ "Sam Curran ruled out of the ICC Men's T20 World Cup". England and Wales Cricket Board. Retrieved 5 October 2021.
- ↑ "England v India: Reece Topley takes 6-24 as hosts level series". BBC Sport. Retrieved 14 July 2022.