రుద్రప్రయాగ జిల్లా
రుద్రప్రయాగ జిల్లా, ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని జిల్లాల్లో ఒకటి. దీని విస్తీర్ణం 1984 కిమీ2. రుద్రప్రయాగ ఈ జిల్లా ముఖ్యపట్టణం. జిల్లాకు ఉత్తరాన ఉత్తరకాశి, తూర్పున చమోలి, దక్షిణాన పౌరీ గఢ్వాల్ పశ్చిమాన తెహ్రీ గర్వాల్ జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి.
రుద్రప్రయాగ జిల్లా | |
---|---|
జిల్లా | |
దేశం | India |
State | దస్త్రం:..Uttarakhand Flag(INDIA).png Uttarakhand |
డివిజను | గఢ్వాల్ |
ముఖ్యపట్టణం | రుద్రప్రయాగ |
విస్తీర్ణం | |
• Total | 1,984 కి.మీ2 (766 చ. మై) |
జనాభా (2011) | |
• Total | 2,42,285 |
• జనసాంద్రత | 120/కి.మీ2 (320/చ. మై.) |
ISO 3166 code | IN-UT |
Vehicle registration | UK 13 |
జనాభా వివరాలు
మార్చుచారిత్రికంగా జనాభా | ||
---|---|---|
సంవత్సరం | జనాభా | ±% |
1901 | 70,510 | — |
1911 | 78,790 | +11.7% |
1921 | 80,700 | +2.4% |
1931 | 88,743 | +10.0% |
1941 | 1,00,305 | +13.0% |
1951 | 1,05,848 | +5.5% |
1961 | 1,19,921 | +13.3% |
1971 | 1,35,654 | +13.1% |
1981 | 1,69,743 | +25.1% |
1991 | 2,00,515 | +18.1% |
2001 | 2,27,439 | +13.4% |
2011 | 2,42,285 | +6.5% |
2011 జనాభా లెక్కల ప్రకారం రుద్రప్రయాగ్ జిల్లా జనాభా 2,42,285.[1] ఇది వానువాటు దేశానికి దాదాపు సమానం.[2] జనాభా పరంగా జిల్లా భారతదేశంలో 585వ స్థానంలో ఉంది.[1] జనసాంద్రత చ.కి.మీ.కు 119.[1] 2001-2011 దశాబ్దంలో జిల్లా జనాభా వృద్ధి రేటు 4.14%.[1] రుద్రప్రయాగలో ప్రతి 1000 మంది పురుషులకు 1120 స్త్రీల లింగ నిష్పత్తి ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో ఈ నిష్పత్తి అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఇది 6 వ స్థానంలో ఉంది.[1] జిల్లా అక్షరాస్యత రేటు 82.09%.[1]
2011 జనాభా లెక్కల ప్రకారం 94.5% జనాభా మాట్లాడే గర్వాలీ జిల్లాలో ప్రధానమైన మొదటి భాష. హిందీ 4.2% మందికి మొదటి భాష కాగా, 0.60% నేపాలీ మాట్లాడుతారు.[3]
మాట్లాడే భాష ప్రకారం జనాభా వివరాలు
మార్చురుద్రప్రయాగ్ జిల్లా: 2011 భారత జనాభా లెక్కల ప్రకారం జనాభా మాతృభాష.[4] | |||
---|---|---|---|
మాతృభాష కోడ్ | మాతృ భాష | ప్రజలు | శాతం |
006102 | భోజ్‌పురి | 371 | 0.2% |
006195 | గర్వాలీ | 228,916 | 94.5% |
006240 | హిందీ | 10,167 | 4.2% |
006340 | కుమౌని | 172 | 0.1% |
014011 | నేపాలీ | 1,444 | 0.6% |
022015 | ఉర్దూ | 155 | 0.1% |
– | ఇతరులు | 1,060 | 0.4% |
మొత్తం | 242,285 | 100.0% |
శాసనసభ నియోజకవర్గాలు
మార్చు- కేదార్‌నాథ్ విధానసభ
- రుద్రప్రయాగ విధానసభ
పుణ్యక్షేత్రాలు
మార్చు- కేదారనాథ్
- తుంగనాథ్
- మధ్యమహేశ్వర్
- మథియానా దేవి
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Vanuatu 224,564 July 2011 est.
- ↑ C-16 Population By Mother Tongue – Uttarakhand (Report). Office of the Registrar General & Census Commissioner, India. Retrieved 14 July 2020.
- ↑ C-16 Population By Mother Tongue – Uttarakhand (Report). Office of the Registrar General & Census Commissioner, India. Retrieved 14 July 2020.C-16 Population By Mother Tongue – Uttarakhand (Report). Office of the Registrar General & Census Commissioner, India. Retrieved 14 July 2020.