రుద్రప్రయాగ
రుద్రా ప్రయాగ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఒక చిన్న పట్టణం[1]. దీనికి ఈ పేరు హిందువుల ఆరాధ్య దైవమైన శివుడి మరొక అవతారం అయిన రుద్రుడి పేరు మీదుగా వచ్చింది. పురాణాల మేరకు ఈ ప్రదేశంలో నారద మహర్షి శివుడిచే ఆశీర్వదించబడ్డాడు. రుద్రప్రయాగ జిల్లా మూడు జిల్లాలలో నుండి కొంత కొంత భాగం తీసుకొనబడి ఏర్పరచబడింది. ఆ జిల్లాలు చమోలి, పౌరి, తెహ్రి జిల్లాలు. ఈ జిల్లాను 1997 సెప్టెంబరు 16 లో ప్రకటించారు. ఈ టవున్ మందాకినీ, అలకనంద నదుల సంగమంలో ఉంది.
రుద్రప్రయాగ్ रुद्र प्रयाग | |
---|---|
city | |
![]() Confluence of Alaknanda (bottom, from right) and Mandakini River (flowing from top - North) at Rudraprayag. Before 17 June 2013, there was a footbridge (jhula) over the Mandakini; this was washed away in the 2013 Uttarakhand floods. The stones at the bottom of the stairs were not there; instead, there was a viewing platform, and a large rock called Narad Shila. | |
Country | ![]() |
రాష్ట్రం | Uttarakhand |
జిల్లా | Rudraprayag |
సముద్రమట్టం నుండి ఎత్తు | 895 మీ (2,936 అ.) |
జనాభా వివరాలు (2001) | |
• మొత్తం | 2,242 |
భాషలు | |
• అధికార | Hindi |
కాలమానం | UTC+5:30 (IST) |
జాలస్థలి | rudraprayag |
[1] |
ఆలయలు ఆకర్షణలుసవరించు
రుద్రప్రయాగ్ ఆలయ సమీపంలో జగదంబ ఆలయం ఉంది. .అగస్త్యముని టవున్ లో కల అగస్తేశ్వర్ మహాదేవ ఆలయం ఉంది. అగస్త్య మహర్షి ఇక్కడ చాలా కాలం తపస్సు చేసాడని పురాణకథనాలు వివరిస్తున్నాయి. రుద్రప్రయాగ్ లో ప్రసిద్ధ ఆకర్షణలలో దేవోరియ సరస్సు ఒకటి. సముద్ర మట్టానికి 2438 మీటర్ల ఎత్తున కల ఈ సరస్సు శిఖర శ్రేణులతో ఇక్కడే కల గంగోత్రి, బద్రీనాథ్, కేదార్ నాథ, యమునోత్రి, నీల కంట శిఖరాలను చూపుతుంది. ఇక్కడ బర్డ్ వాచింగ్ (పక్షుల వీక్షణ) వాటర్ బోటింగ్, యాన్గ్లింగ్ లు ఆనందించవచ్చు.
ఇక్కడ కల త్రియుగినారాయణ్ అనే చిన్న గ్రామంలో హవన్ కుండ్ అనే నిరంతరం వెలిగే జ్యోతిని కూడా చూడవచ్చు. స్థానికుల నమ్మకాల మేరకు ఈ గ్రామం హిమవత్ రాజ్య రాజధాని అని ఇక్కడ ఈ జ్యోతి సమక్షంలో పార్వతీ పరమేశ్వర్లు వివాహం చేసుకున్నారని చెపుతారు. రుద్ర ప్రయాగ్ లో ఇంకనూ చూడవలసినవి గుప్తకాశి, ఉఖి మట్, వాసుకి తాల్, జఖోలి, తుంగనాత్ వంటివి ఉన్నాయి. టూరిస్టులు కలిమాట్, కార్తిక్ స్వామీ టెంపుల్, ఇంద్రసాని మానస దేవి టెంపుల్, చంద్రశిల, మా హరియాలి దేవి టెంపుల్, కోటేశ్వర్ టెంపుల్,, మాడ మహేశ్వర్ గుళ్ళు చూడవచ్చు[2].
ఘాటులుసవరించు
ఇండియా లోని సిద్ధ పీటాలలో కాళీ మట్ ఒకటి. ఇక్కడ కాళీ మాత గుడి ఉంది. నవరాత్రి ఉత్సవాలకు దేశంలోని వివిధ ప్రదేశాల నుండి వేలాది భక్తులు వస్తారు. ఉఖి మట్, గుప్త కాశీ ప్రదేశాలు దీనికి సమీపంలోనే వుంటాయి.
రుద్రప్రయాగ ఆలయంసవరించు
అలకనంద, మందాకినీ అనే రెండు నదుల సంగమంలో కల రుద్రప్రయాగ్ టెంపుల్ ప్రధాన మతపర ప్రదేశం. శివుడు కల ఈ గుడికి ప్రతి సంవత్సరం అనేక మంది భక్తులు వస్తారు. ఇక్కడ సంగీతంలో సాధన పట్టు కొరకు తపస్సు చేస్తున్న నారదుడిని శివుడు రుద్రుడి అవతారంలో వచ్చి దీవించాడని పురాణాల కథనాలు వివరిస్తున్నాయి. ఇక్కడ కల జగదంబ దేవి ఆలయం కూడా ఒక ఆకర్షణ.
త్రియుగ నారాయణ్ ఆలయంసవరించు
రుద్ర ప్రయగ్ లో కల త్రియుగి నారాయణ్ ఒక పవిత్ర ప్రదేశం. ఇది హిమవత్ కు రాజధానిగా చెపుతారు. ఇక్కడ శివ పార్వతుల వివాహం సత్యయుగంలో జరిగింది. ఇప్పటికి ఇక్కడ వెలుగుతున్న హవాన కుండ్ జ్యోతి సమక్షంలో వారి వివాహం జరిగిందని చెపుతారు. ఈ అగ్ని బూడిద భక్తుల వివాహ జీవితాలను ఆశీర్వదిస్తుందని చెపుతారు. ఈ ప్రదేశ సమీపంలో ఒక విష్ణు ఆలయం ఉంది. దీని శిల్పశైలి కేదార్ నాథ్ ఆలయాన్ని పోలి వుంటుంది. ఈ ప్రదేశం చూసే పర్యాటకులు రుద్రకుండ్, విష్ణు కుండ్, బ్రహ్మ కుండ్లు తప్పక చూడాలి. ఈ మూడు కుండ్ లకు సరస్వతి కుండ్ మూల స్థానం. స్థానికుల నమ్మిక మేరకు ఈ కుండ్ నీరు విష్ణు నాభి స్థానం నుండి వస్తుందని చెపుతారు. ఈ నీరు మహిళల సంతానవిహీనతను లేకుండా పోగొడ్తుందని విశ్వసిస్తున్నారు.
ప్రయాణ సౌకర్యాలుసవరించు
రోడ్డు, రైలు మార్గాలలో కలుపబడి ఉంది. ఈ ప్రదేశ సందర్శనకు వేసవి అనుకూలం.
రోడ్డు ప్రయాణంసవరించు
రుద్రప్రయాగ్ నేషనల్ హై వే 58 మార్గంలో అంటే ఢిల్లీ నుండి బద్రీనాథ్ మార్గంలో ఉంది. కనుక బస్సు సేవలు బాగా వుంటాయి. వేసవిలో న్యూ ఢిల్లీ నుండి బద్రీనాథ్ వెళ్ళే బస్సులు రుద్రప్రయాగ్ మీదుగా నే వెళతాయి. రిషికేశ్ నుండి రుద్రప్రయాగ్కు రెగ్యులర్ బస్సులు ఉన్నాయి. రుద్రప్రయాగ్ వాయు,
రైలు మార్గంసవరించు
రుద్రప్రయాగ్ కు ఋషి కేష్ రైలు స్టేషను సమీపం. కొన్ని రైళ్ళతో ఇది ఒక చిన్న రైలు స్టేషను. అయితే 24 కి. మీ. ల దూరంలో కల హరిద్వార్ రైలు జంక్షన్ నుండి దేశం లోని వివిధ ప్రాంతాలకు రైళ్ళు ఉన్నాయి.
వాయుమార్గంసవరించు
రుద్రప్రయాగ్ కు సమీప ఎయిర్ బేస్ సుమారు 183 కి. మీ. ల దూరం లోని దేహ్రా దూన్ లోని జాలీ గ్రాంట్ ఎయిర్ పోర్ట్ ఈ ఎయిర్ పోర్ట్ నుండి రుద్రా ప్రయగ్ కు టాక్సీలు లభిస్తాయి.