తెహ్రీ గఢ్వాల్ జిల్లా

ఉత్తరాఖండ్ లోని జిల్లా

తెహ్రీ గఢ్వాల్ జిల్లా, భారతదేశం, ఉత్తరాఖండ్ రాష్ట్రం లోని జిల్లా.రాష్ట్రంలో ఇది అతిపెద్ద జిల్లా. ఈ జిల్లాకు " న్యూ తెహరీ " జిల్లా ప్రధాన కేంద్రంగా ఉంది. 2001 జిల్లా జనసంఖ్య 6,04,747 (2001. ఈ దశాబ్ధంలో జిల్లా జనసంఖ్య 16.15% అధికమైంది. జిల్లా తూర్పు సరిహద్దులో రుద్రప్రయాగ్, పడమరన డెహ్రాడూన్, ఉత్తరదిశలో ఉత్తర‌కాశి, దక్షిణదిశలో పౌరీ గఢ్వాల్ జిల్లాలు ఉన్నాయి.

Tehri Garhwal district
टिहरी गढ़वाल
district
Devprayag, confluence of the Alakananda and Bhagirathi to form the
Devprayag, confluence of the Alakananda and Bhagirathi to form the
Tehri Garhwal district is located in Uttarakhand
Tehri Garhwal district
Tehri Garhwal district
Location in Uttarakhand, India
Coordinates: 30°23′N 78°29′E / 30.38°N 78.48°E / 30.38; 78.48
Country India
రాష్ట్రంUttarakhand
DivisionGarhwal
ప్రధాన కార్యాలయంTehri
Area
 • Total4,080 km2 (1,580 sq mi)
Population
 • Total6,04,747
 • Density148/km2 (380/sq mi)
భాషలు
 • అధికారహిందీ
Time zoneUTC+5:30 (IST)

పేరువెనుక చరిత్ర సవరించు

త్రికరణాలతో (మనసు, వాక్కు, కర్మ) చేసే పపాలను తొలగించే ప్రదేశం కనుక తెహ్రీ (త్రిహరి) అని పిలువబడింది. ఘార్హ్ అనే పదానికి హిందీలో కోట అని అర్ధం. తెహ్రీ గఢ్వాల్ అంటే త్రికరణాలతో చేసే పాపాలను హరించే కోట అని అర్ధం.

చరిత్ర సవరించు

ఆరంభకాలం సవరించు

సా.శ. 888 లో ఈ ప్రాంతం 52 గర్హాలుగా ఉంటూ వాటిని స్వతంత్ర రాజులు పాలిస్తున్నారు. ఈ గర్హాలను మాల్వా రాజకుమారుడు కనక్‌పాల్ సమైక్యం చేసి ఒకేచత్రం కిందకు తీసుకువచ్చాడు. కనకపాల్ బద్రీనాథ్ వెళ్ళే సమయంలో ఆసాయంలో గర్హాలరాజ్య్లలో శక్తిమంతుడైన రాజా భానుప్రతాపును కలుసుకున్నాడు. తరువాత కనకపాల్ భానుప్రతాప్ కుమార్తెను వివాహం చేసుకున్నాడు. తరువాత భానుప్రతాప్ తనరాజ్యాన్ని కనకపాల్‌కు అప్పగించాడు. కనకపాల్ సింగ్, ఆయన వారసులు క్రమంగా గర్హాలను అన్నింటినీ జయించారు. తరువాత వారు మొత్తం గర్హాలను (గర్హా సామ్రాజ్యగా) 915-1803 వరకూ పాలించారు. ప్రస్తుతం కుమోన్ సామ్రాజ్యానికి రాజా మహేంద్రచంద్ రాజుగా ఉన్నాడు. ఆయన రాణి గీతాచందును వివాహం చేసుకున్నాడు. వారికి అకాంక్షా చంద్, రాజకుమారీ మల్లికాచంద్, రాజకుమార్ ఆర్యన్ చంద్ అనే సంతానం ఉన్నారు.

గఢ్వాల్ రాజ్యం సవరించు

 
Princely flag of Tehri Garhwal.

రాజసంస్థానం గఢ్వాల్ రాజ్యంలోని టెహ్రీ గఢ్వాల్‌ను పంవార్ (షాహ్) సామ్రాజ్యం పాలనలో ఉంటూవచ్చింది. తరువాత ఇది బ్రిటిష్ ఇండియాకు చెందిన పంజాబు హిల్‌స్టేట్స్ ఏజన్సీటెహ్రీ గఢ్వాల్ ఒకభాగంగా మారింది.[1] ప్రస్తుతం ఇది టెహ్రీ గఢ్వాల్ జిల్లా, ఉత్తర‌కాశి జిల్లాలోని అత్యధిక భాగంగా ఉంది. 1901లో గఢ్వాల్ వైశాల్యం 4,180 చదరపు కి.మీ ఉంది. అలాగే 268,885 జాసంఖ్య ఉండేది. ఈ ప్రాంతపు పాలకుడికి రాజా అనే బిరుదు ఉండేది. తరువాత 1913లో రాజా అనే బిరుదు మహారాజాగా మారింది. మహారాజాకు 11 తుపాకులతో వందన సమర్పణ చేసి 300 రూపాయలతో ప్రైవీ పర్సును బహూకరించేవారు.

గొర్కా ప్రమాదం సవరించు

 
1903 map of United Provinces showing the boundaries of Garhwal Kingdom

1803లో ఘర్వాలాను గొర్కాలు వశపరచుకున్నారు.[2] గోర్కా వీరులైన సుబ్బా అమర్సిగ్, హాస్టిడాల్ చౌతరియా, బంషాహ్ చౌతరియా, రంజార్ తపా బృహత్తర సైన్యంతో రాజా ప్రద్యుమ్నా షాహ్, ఆయన కుమారులైన కుంవర్ ప్రీతం షాహ్, కుంవర్ ప్రీతం షాహ్‌ల మీద దండెత్తారు. ఖుర్హ్బ్యూర్ వద్ద 12,000 మంది బలవంతులైన సైనికులతో పోరాడి రాజు వీరోచితంగా మరణించాడు. క్రమంగా గోర్కాలు డెహ్రాడూన్, షహరన్‌పూర్, కంగడా, సిమ్లాలను జయించి తరువాత వారి సామ్రాజ్యాన్ని కాంగరా వరకు విస్తరించారు.

1787 నుండి 1812 వరకు గోర్కాలు 200 గ్రామాలను ఆక్రమించుకుని ఈస్టిండియా ఆధ్వర్యంలోకి తీసుకువచ్చారు. బ్రిటిష్ వారు నేపాల్ రాజుతో చేసిన చర్చలు నిష్ఫలం అయ్యాయి. చివరికి 1814లో గోర్కాయుద్ధం (ఆంగ్లో నేపాల్ యుద్ధం) మొదలైంది. మేజర్ జనరల్ మార్లీ నాయకత్వంలో 8,000 ఖాట్మ్ండ్ మీద దాడిచేసారు. మేజర్ జనరల్ వుడ్ 4000 మంది సైనికులతో ఒక ఆపరేషన్ ఆరంభించాడు. మేజర్ జనరల్ జిల్స్వే ఆధ్వర్యంలో 3,500 మంది సైనికులు డెహ్రాడూన్ స్వాధీనం చేసుకోవడామికి ప్రయత్నించారు. వారిని బలబద్ర తపా 300-400 మంది సైనికులతో ఎదుర్కొన్నాడు. గోర్కాలు వీరోచితంగా పోరాడి బ్రిటిష్ వారిని ఎదిరించారు. చివరికి బ్రిటిష్ సైన్యం 1814 నవంబరు 30 న డెహ్రాడూన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

బ్రిటిష్ సైన్యం తరువాత కుమోన్ వైపు సాగింది. ఘోరమైన పోరాటం తరువాత గోర్కా సైనికాధికారులైన హాస్టిడల్, జయార్ఖా వినయాదల్ వద్ద మరణించారు. చివరికి సూఉలి ఒప్పందంతో యుద్ధం ముగింపుకు వచ్చింది. 1815 డిసెంబరు 2 న ఈ ఒప్పందం మీద సంతకం చేసారు. తరువాత కొండల మీద బ్రిటిష్ పాలన మొదలైంది. తరువాత ఈస్టిండియా కంపనీ డెహ్రాడూన్, కుమోన్, తూర్పు ఘర్వాలును బ్రిటిష్ సామ్రాజ్యంతో విలీనం చేసింది. పడమటి ఘర్వాలును సుదర్శన్ షాహ్‌కు ఇచ్చిన ప్రాంతం తరువాత టెహ్రీ రియాసత్ అని పిలువబడింది.

కొత్త రాజధాని సవరించు

రాజా సుదర్శన్ షాహ్ తనసామ్రాజ్యానికి టెహ్రీ నగరాన్ని తన రాజధానిగా చేసుకున్నాడు. తరువాత వచ్చిన ఆయన వారసులు ప్రతాప్ షాహ్, కీర్తి షాహ్, నరేంద్ర షాహ్ వారి రాజధాని నగరాలుగా వరుసగా ప్రతాప్ నగర్, కీర్తినగర్, నరేంద్రనగర్ స్థాపించుకున్నారు. 1815-1949 వరకు వారి పాలన కొనసాగింది. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో ఈ ప్రాంతపు ప్రజలు క్రియాశీలకంగా దేశస్వాతంత్ర్యం కొరకు పోరాటం పనిచేసారు. 1947లో దేశానికి స్వాతంత్ర్యం లభించగానే టెహ్రీ రియాసత్ ప్రజలు రాజరికం నుండి విడుదల కొరకు పోరాటం కొనసాగించారు. తరువాత మహారాజుకు ఈ ప్రాంతాన్ని పాలించడం కష్టతరం అయింది. ఫలితంగా పవార్ వంశానికి చెందిన 60వ రాజా మాంవేంద్ర షాహ్ భారతదేశ సామ్రాజ్యాధికారానికి అంగీకరించాడు. 1949లో టెహ్రీ రియాసత్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కలుపబడింది. అలాగే ఈ ప్రాంతానికి రుద్రప్రయాగ్ జిల్లా అంతస్తు లభించింది.[3] 1960 ఫిబ్రవరి 24న రాష్ట్రప్రభుత్వం తెహ్సీని విడదీసి ఉత్తర‌కాశి జిల్లా అంతస్తు ఇచ్చారు. పూర్వపు " మహారాజా ఆఫ్ టెహ్రీ గఢ్వాల్ " 2000లో " ఆనంద- ఇన్- హిమాలయాలు "గా మార్చబడింది.[4]

గణాంకాలు సవరించు

చారిత్రికంగా జనాభా
సంవత్సరంజనాభా±% p.a.
19011,80,788—    
19112,02,264+1.13%
19212,14,090+0.57%
19312,35,038+0.94%
19412,67,178+1.29%
19512,77,115+0.37%
19613,13,210+1.23%
19713,58,117+1.35%
19814,46,472+2.23%
19915,20,256+1.54%
20016,04,747+1.52%
20116,18,931+0.23%
source:[5]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం తెహ్రీ గర్వాల్ జిల్లా 6,18,931 జనాభాను కలిగి ఉంది,[6] సోలమన్ దీవులు [7] లేదా యుఎస్ రాష్ట్రం వెర్మోంట్‌కు దాదాపు సమానం.[8]

ఇది భారతదేశంలోని 688 జిల్లాలలో జనాభా పరంగా 520వ ర్యాంక్‌ను ఇస్తుంది.[6] జిల్లాలో జనసాంద్రత చ.కి.మీటరుకు 169 మందితో ఉంది .[6]

2001-2011 దశాబ్దంలో దాని జనాభా వృద్ధి రేటు 1.93%.[6] తెహ్రీ గర్వాల్‌లో ప్రతి 1000 మంది పురుషులకు 1078 స్త్రీల లింగ నిష్పత్తి ఉంది [6] అక్షరాస్యత రేటు 75.1%. జనాభాలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు వరుసగా 16.50% శాతం మంది, 0.14% శాతం మంది ఉన్నారు.[6]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం జిల్లా మొత్తం జనాభాలో 90.5% శాతం మంది గర్వాలీ మొదటి భాషగా మాట్లాడతారు. హిందీ భాషను విస్తృతంగా వాడతారు, అయితే ఇది కేవలం 6% శాతం మంది ప్రజలలో మాత్రమే మొదటి భాష. జౌన్సారి భాష (0.98%) శాతం మంది, నేపాలీ భాష (0.95%) శాతం మంది ఇతరభాషలతో కలిపి మాట్లాడతారు.[9]

ఆర్ధికం సవరించు

2006లో పంచాయితీ మంత్రిత్వశాఖ భారతదేశంలోని జిల్లాలు (688) వెనకబడిన 250 జిల్లాలలో తెహ్రీ గఢ్వాల్ ఒకటి అని గుర్తించింది.[10] ఉత్తరాంచల్ రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల సహాయనిధిని (బి.ఆర్.గి.ఎఫ్) అందుకుంటున్న 3 జిల్లాలలో తెహ్రీ గఢ్వాల్ ఒకటి.[10]

ప్రధాన పట్టణాలు సవరించు

నరేంద్ర నగర్, చంబా, ఘంసలి, ప్రతాపనగర్ (తెహ్రి), చమియాల, లాంగోయన్, దేవప్రయాగ, కీర్యినగర్, గజ

నిర్వహణా ఏర్పాటు సవరించు

తెహ్రీ జిల్లా రెండు ఉపవిభాగాలుగా కీర్తినగర్ , ప్రతాపనగర్ అనే విభజించబడింది. జిల్లాలో 7 తాలూకాలు ఉన్నాయి. ఒక ఉప తెహ్సిల్, 9 బ్లాకులు, రెండు పురపాలకాలు , 4 పట్టణ ప్రాంత కమిటీలు ఉన్నాయి. జిల్లాలో 76 కొత్త పంచాయితీలు ఉన్నాయి. 92 గ్రామ పంచాయితీలు ఉన్నాయి. జిల్లాలో 1,847 రెవెన్యూ గ్రామాలు, 2,508 క్లస్టర్లు ఉన్నాయి.

ప్రత్యేకతలు సంఖ్య పేరు
ఉపవిభాగాలు

2

కీర్తినగర్, తెహ్రీ-ప్రతాపనగర్, ధనోల్టి
తాలూకాలు

7

దేవప్రయాగ్, ఘంసలి, నరేద్రనగర్, ప్రతాపనగర్, తెహ్రీ, జఖనిధర్, ధనోల్టి, కండిసౌర్, నైన్‌భాగ్
ఉప-విభాగాలు

1

గజ
బ్లాకులు

9

భిలాంగన, చంబ, దేవప్రయాగ్, జఖనిధర్, జౌంపుర్, కీర్తినగర్, నరేంద్రనగర్, ప్రతాపనగర్, తాలుధర్
పురపాలకాలు

2

తెహ్రీ, నరేంద్రనర్
పట్టణప్రాంత కమిటీలు

4

చంబ, దేవప్రయాగ్, కీర్తినగర్, మునికి రీతి

గ్రామాలు సవరించు

బికానెర్ టౌన్ , ఘంషాలి సమీపంలో సవరించు

సామన్ గావ్, పాల్మ, బగ్గి, బంగర్ ఖల్, కొండ్, పైనుయాల, బుడోగి, పాటా, కైంసారి, క్యాంసు, నవగర్, ఖంద్ఖోలి.

గజ సమీపంలో సవరించు

ఖండ్, తాలియా, చదేలీ, నకోట్.

చంబా సమీపంలో సవరించు

పాలి, ఫాకోట్, భోనబగి, ఘాన్.

చిన్యాలి సమీపంలో సవరించు

అనువాన్, ఖ్వాలా బహేది, ఘంసాలి, సెందుల, షెన్, సునేరిఘాడ్, దెవ్లి, బద్వాలి కుమార్గావ్, తుంగ్, షెంజ్, కద్తల్, సమేందిదర్, జఖని పో లాంబ్గ్వాన్ ధనేద్రసెంవాల్ (డాన్ని), తిత్రానా.

ఆధునిక అభివృద్ధి పనులు సవరించు

1960లో తెహ్రీ గఢ్వాల్ తూర్పు దిశగా మరింత విస్తరించబడింది.[11] 1997లో తెహ్రీ గఢ్వాల్ లోని తూర్పు భాంలో అధికంగా వేరు చేసి పౌరీ గఢ్వాల్, చమోలి జిల్లాలలో కొంత భాభాగాలతో కలిపి రుద్రప్రయాగ్ జిల్లాగా రూపొందించారు.

మూలాలు సవరించు

 1. Tehri Garhwal The Imperial Gazetteer of India, 1909, v. 23, p. 269.
 2. http://www.1911encyclopedia.org/Garhwal
 3. History Archived 2008-08-09 at the Wayback Machine Rudraprayag Official district.
 4. Himalayan Spa for Sybarites By CELIA W. DUGGER. New york Times. July 30, 2000.
 5. Decadal Variation In Population Since 1901
 6. 6.0 6.1 6.2 6.3 6.4 6.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 30 September 2011.
 7. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 13 June 2007. Retrieved 1 October 2011. Solomon Islands 571,890 July 2011 est.
 8. "2010 Resident Population Data". U.S. Census Bureau. Archived from the original on 1 January 2011. Retrieved 30 September 2011. Vermont 625,741
 9. "Table C-16 Population by Mother Tongue: Uttarakhand". www.censusindia.gov.in. Registrar General and Census Commissioner of India.
 10. 10.0 10.1 Ministry of Panchayati Raj (8 September 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 5 ఏప్రిల్ 2012. Retrieved 27 September 2011.
 11. Times World Atlas, 1967 Edition, Plate 30.

వెలుపలి లింకులు సవరించు