రూప్ కుమారి చౌదరి
రూప్ కుమారి చౌదరి భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో మహాసముంద్ లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[1]
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 4 జూన్ 2024 | |||
ముందు | చున్నీ లాల్ సాహు | ||
---|---|---|---|
నియోజకవర్గం | మహాసముంద్ | ||
పదవీ కాలం 2013 – 2018 | |||
ముందు | దేవేంద్ర బహదూర్ సింగ్ | ||
తరువాత | దేవేంద్ర బహదూర్ సింగ్ | ||
నియోజకవర్గం | బస్నా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | ధనపాలి, మహాసముంద్ జిల్లా, ఛత్తీస్‌గఢ్ | 1976 జూలై 5||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
తల్లిదండ్రులు | క్షేమరాజ్ పటేల్ | ||
జీవిత భాగస్వామి | ఓంప్రకాష్ చౌదరి (m. 1993) | ||
సంతానం | 1 కుమారుడు, 2 కుమార్తెలు | ||
నివాసం | గరియాబంద్ , ఛత్తీస్‌గఢ్ | ||
వృత్తి | రాజకీయ నాయకురాలు | ||
మూలం | [1] |
రాజకీయ జీవితం
మార్చురూప్ కుమారి చౌదరి భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2013 ఛత్తీస్‌గఢ్ శాసనసభ ఎన్నికల్లో బస్నా నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి దేవేంద్ర బహదూర్ సింగ్ పై 70,898 ఓట్ల మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[2] ఆమెకు 2018 ఎన్నికల్లో బీజేపీ టికెట్ నిరాకరించింది.[3]
రూప్ కుమారి చౌదరి 2019లో మహాసముంద్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలిగా నియమితురాలై 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో మహాసముంద్ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి తామ్రధ్వజ్ సాహుపై 145456 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[4][5]
మూలాలు
మార్చు- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Mahasamund". Archived from the original on 31 July 2024. Retrieved 31 July 2024.
- ↑ The Economic Times (9 December 2013). "Chhattisgarh polls: 10 women candidates emerge winners". Archived from the original on 5 August 2024. Retrieved 5 August 2024.
- ↑ TimelineDaily (20 March 2024). "Roop Kumari Choudhary, The BJP Candidate From Mahasamund Constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 5 August 2024. Retrieved 5 August 2024.
- ↑ TV9 Bharatvarsh (5 June 2024). "महासमुंद लोकसभा सीट वाली बीजेपी की रूप कुमारी चौधरी कौन हैं, जानिए अपनी सांसद को". Archived from the original on 5 August 2024. Retrieved 5 August 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "LS polls: Three women win from Chhattisgarh" (in ఇంగ్లీష్). 5 June 2024. Archived from the original on 5 August 2024. Retrieved 5 August 2024.