రెండవ పగారో
7 వ పయారో పిర్ అని విస్తృతంగా పిలువబడే రెండవ సయ్యద్ షా మర్దాన్ షా (1928 నవంబరు, 2012 జనవరి 10) హర్సు ఆధ్యాత్మిక నాయకుడు, రాజకీయ పార్టీ పాకిస్తాను ముస్లిం లీగు (ఎఫ్) అధ్యక్షుడు. ఆయన సాధారణంగా పాకిస్తానులో పిర్ సాహిబు పగారా (పిర్ షాబ్) అని పిలుస్తారు. ఆయన పాకిస్తాను రాజకీయాలలో ప్రభావవంతమైన వ్యక్తి, పాకిస్తానులోని హర్ ఫోర్సు నాయకుడు. ఆయన 1965 ఇండో-పాకిస్తాను యుద్ధంలో కూడా పాల్గొన్నాడు. ఆయన ఫస్ట్ క్లాస్ క్రికెటరు కూడా. [1] కాలేయ సంక్రమణ కారణంగా ఆయన 2012 జనవరి 10 న లండనులో మరణించాడు.
Former Member National Assembly of Pakistan | |
---|---|
వ్యక్తిగత వివరాలు | |
జననం | British Raj | 1928 నవంబరు 22
మరణం | 2012 జనవరి 10 London, UK | (వయసు 83)
పౌరసత్వం | Pakistani |
రాజకీయ పార్టీ | Pakistan Muslim League (F) |
నివాసం | Karachi |
కళాశాల | University of Liverpool |
వ్యక్తిగత జీవితం
మార్చుపిర్ పగారా అనేది పాకిస్తానులోని సింధు ప్రావింసులో ముస్లిం సూఫీ ఆర్డరు ఆఫ్ హర్సు నాయకుడికి ఇచ్చే బిరుదు. ఇది పర్షియా పదం "పిర్" (పెద్ద లేదా "సెయింట్"), సింధి పదం "పగారా" నుండి వచ్చింది. అంటే అధిపతి తలపాగా. చివరి పిర్ పగారా రెండవ పిర్ సయ్యద్ మర్దాన్ షా.[2] ఆయన 1928 లో సింధు లోని పిర్ జో గోతు లో జన్మించాడు. పిర్ పగారా తన జీవితంలో ఎక్కువ భాగం పాకిస్తాను రాజకీయాలలో నిమగ్నమయ్యాడు. ఆయన తండ్రి రెండవ పిర్ సయ్యదు సిబ్ఘతుల్లా షా బ్రిటిషు వలసరాజ్యాల పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసినందుకు బ్రిటిషు వలస ప్రభుత్వం 1943 మార్చి 20 న ఉరితీశారు.[3][4][5]
రాజకీయ జీవితం
మార్చుఅధ్యక్ష పోటీలో మొహతర్మా ఫాతిమా జిన్నాను అయుబు ఖాను ఓడించిన తరువాత మొహతర్మా ముస్లిం లీగును క్రియాత్మకంగా ప్రకటించి పిర్ పగారోను ముస్లిం లీగుకు అధిపతిగా చేశారు. ఆయన యునైటెడు ముస్లిం లీగు మొదటి అధ్యక్షుడిగా నామినేటు అయ్యాడు. ఆయన పాకిస్తాను ముస్లిం లీగు-ఫంక్షనలు (పిఎంఎల్-ఎఫ్) చీఫ్, ‘హుర్’ జమాతు ఆధ్యాత్మిక నాయకుడు. ఆయన పాకిస్తాను అత్యంత ప్రభావవంతమైన, గౌరవనీయ రాజకీయ వ్యక్తులలో ఒకడు.[6] పాకిస్తాను రాజకీయాల మీద ఆయన అంచనాలు కొన్నిసార్లు మీడియాలో కోట్ చేయబడ్డాయి.[7] పాకిస్తానుకు చెందిన షేక్ రషీదు,[8] చౌదరి షుజాతు[9] రాజా హారూను,[10] షాహ్ మెహమూదు ఖురేషి.[11]
క్రికెటు
మార్చుసాధారణంగా క్రికెట్టు సాహిత్యంలో ఆయనను పిర్ ఆఫ్ పగారో అని పిలుస్తారు. 1950 లలో పాకిస్తాను క్రికెట్టు అభివృద్ధి ప్రారంభ సంవత్సరాలలో ఆయన ప్రభావవంతమైనవాడుగా గుర్తింపు పొందాడు. ఆ సమయంలో పాకిస్తాను ఆటగాళ్ళు వారి క్రికెట్టులో ఎక్కువ భాగం మ్యాటింగు పిచ్‌ల మీద ఆడవలసి వచ్చింది. ఇంగ్లీషు పరిస్థితులకు సమానమైన వాటిలో ప్రాక్టీసు చేయడానికి అవకాశం ఉంది. అందువలన 1954 లో పాకిస్తాను మొట్టమొదటి ఇంగ్లాండు పర్యటనకు ముందు ఆయన తన తోటలో ఒక గడ్డి పిచ్ నిర్మించాడు.[12] ఆయన సింధు క్రికెట్టు అసోసియేషనును తిరిగి స్థాపించాడు.[13] 1953 నవంబరులో క్వాయిడ్-ఎ-అజాం ట్రోఫీలో మొట్టమొదటి మ్యాచులో సింధుకు కెప్టెనుగా వ్యవహరించాడు.[14] 1955 లో ఎం.సి.సి.కి వ్యతిరేకంగా తన పేరుతో ఒక జట్టును నిర్వహించి నాయకత్వం వహించాడు. [15]
మరణం
మార్చుపగారాను సోకిన ఊపిరితిత్తుల చికిత్స కోసం 2011 నవంబరు 24 న అగా ఖాను విశ్వవిద్యాలయ ఆసుపత్రిలో (ఎకెయుహెచ్) చేర్చారు. వైద్యులు తెలిపిన వివరాల ఆధారంగా ఆయన చాలా తీవ్రమైన స్థితిలో ఉన్నాడు. అందువల్ల ఆయనను వెంటిలేటరులో ఉంచి ఒక వైద్యుడు, కుటుంబ సభ్యులతో కలిసి జనవరి 5 న ప్రత్యేక ఎయిరు అంబులెన్సులో లండనుకు వెళ్లారు.[16] [17]
కాలేయ సంక్రమణతో ఆయన 2012 జనవరి 10 న మరణించాడు. ఆయన మృతదేహాన్ని మరుసటి రోజు పాకిస్తానుకు తిరిగి ఇచ్చారు. పాకిస్తానులోని అనేక రాజకీయ పార్టీలు (హర్సు సహా) కుటుంబానికి తమ సంతాపాన్ని పంపాయి.[18][16][19][20][21] ఆయన పూర్వీకులతో కలిసి ఆయన స్థానిక పిర్ జో గోతు గ్రామంలో ఖననం చేయబడ్డారు.[22][23]
ఆయన తరువాత ఆయన కుమారుడు మూడవ సయ్యదు సిబ్ఘతుల్లా షా రాష్ది పిర్ పగారా, పాకిస్తాను ముస్లిం లీగు (ఎఫ్) రెండుపార్టీలకు నాయకుడిగా ఉన్నారు.[24][25]
ఇవి కూడా చూడండి
మార్చుఅంతకు ముందువారు సిబ్ఘతుల్లా షాహు రష్ది |
పిర్ పగరా 1943 – 2012 |
తరువాత వారు మూడవ సయ్యదు సిబ్ఘతుల్లా షాహు రష్ది |
అంతకు ముందువారు Post Created |
Leader of పాకిస్థాను ముస్లిం లీగు 1985 – 2012 |
తరువాత వారు మూడవ సయ్యదు సిబ్ఘతుల్లా షాహు రష్ది |
మూలాలు
మార్చు- ↑ Pir Pagara ESPN Profile as cricketer
- ↑ "Personal Life of Pir ShahabPagara". Archived from the original on 5 సెప్టెంబరు 2016. Retrieved 30 డిసెంబరు 2019.
- ↑ "Death Syed Shah Mardan's father". Archived from the original on 30 డిసెంబరు 2019. Retrieved 30 డిసెంబరు 2019.
- ↑ "Personal Life of Peer Sahib Pagara". Archived from the original on 30 డిసెంబరు 2019. Retrieved 30 డిసెంబరు 2019.
- ↑ Pir Pagara Interview for MG Managzine Archived 15 జూలై 2012 at Archive.today
- ↑ Influential Personality of Pakistan
- ↑ "Pagara persists with political predictions". Archived from the original on 23 నవంబరు 2011. Retrieved 30 డిసెంబరు 2019.
- ↑ Former Minister MNA Sheikh Rashid meeting with Pir Pagara
- ↑ Former Minister MNA Chaudhry Shujaat meeting with Pir Pagara[permanent dead link]
- ↑ "MNA Raza Haroon meeting with Pir Pagara". Archived from the original on 13 సెప్టెంబరు 2012. Retrieved 30 డిసెంబరు 2019.
- ↑ Former Foreign Minister MNA Shah Mahmood Qureshi meeting with Pir Pagara[permanent dead link]
- ↑ Berry, Scyld (2015). Cricket: The Game of Life. London: Hodder & Stoughton. pp. 169–70. ISBN 978-1-473-61859-6.
- ↑ Wisden 2013, pp. 233-34.
- ↑ "Bahawalpur v Sind 1953-54". CricketArchive. Retrieved 4 నవంబరు 2015.
- ↑ "Pir of Pagaro's XI v Marylebone Cricket Club 1955-56". CricketArchive. Retrieved 4 నవంబరు 2015.
- ↑ 16.0 16.1 Pir Pagara died in London 10 January 2012[permanent dead link]
- ↑ Pir Pagara unwell, may head to London
- ↑ "Pir Sahib Pagara Dies In England". Archived from the original on 30 డిసెంబరు 2019. Retrieved 30 డిసెంబరు 2019.
- ↑ News of Pir Pagaro Death
- ↑ Prim Minister of Pakistan's Condolence message to Family
- ↑ Pir Pagara Died Archived 14 జనవరి 2012 at the Wayback Machine
- ↑ "Pir Pagaro - Printed on Daily The Nation : January 12, 2012". Archived from the original on 25 జనవరి 2013. Retrieved 30 డిసెంబరు 2019.
- ↑ Pir Pagara passes away on The News
- ↑ Tunio, Hafeez. "Pir Pagara passes away: The political oracle goes silent – The Express Tribune". Tribune.com.pk. Retrieved 4 మే 2013.
- ↑ "The son also rises". Dawn.Com. Retrieved 4 మే 2013.