రెచ్చిపో (సినిమా)

(రెచ్చిపో నుండి దారిమార్పు చెందింది)

రెచ్చిపో 2009 తెలుగు రొమాంటిక్ యాక్షన్ చిత్రం. ఇందులో నితిన్, ఇలియానా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని టి. సురేంద్ర రెడ్డి ఛాయాగ్రహణంలో, పరుచూరి మురళి దర్శకత్వంలో జి.వి.రమణ నిర్మించారు. ఈ చిత్రం 2009 సెప్టెంబరు 25 న విడుదలైంది. తరువాత, దీనిని తమిళంలో ధనా అని, హిందీలో ఆజ్ కా నయా ఖిలాడి (2010) గా అనువదించారు.[1] దీనిని బెంగాలీలో మాకో మస్తానాగా రీమేక్ చేశారు.

రెచ్చిపో
(2009 తెలుగు సినిమా)
దర్శకత్వం పరుచూరి మురళి
తారాగణం నితిన్, ఇలియానా, ఆలీ, రఘుబాబు, భానుచందర్, తణికెళ్ళ భరణి, వేణుమాధవ్
నిర్మాణ సంస్థ శ్రీ స్పెక్ట్రా మీడియా
విడుదల తేదీ 25 సెప్టెంబర్ 2009
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

శివ (నితిన్) ఒక దొంగ. అతను రాబిన్ హుడ్ తరహాలో పెద్దలను దోచుకుని పేదలకు పెడితూంటాడు. అతను ధనవంతుల నుండి నల్లధనాన్ని దోచుకుంటాడు. అనాథల విద్య వంటి మంచి ప్రయోజనాల కోసం ఖర్చు చేస్తూంటాడు. తాను తెలివైన నేరస్థుడనని చెప్పుకుంటాడు. ఒకసారి పోలీసులు క్రికెట్ బెట్టింగ్ రాకెట్ మాఫియాను ఛేదించి, ముఠా సభ్యులలో ఒకరి ద్వారా రూ .500 కోట్ల గురించిన కీలక సమాచారాన్ని సేకరిస్తారు. అయితే, హోంమంత్రి (అహుతి ప్రసాద్) కమిషనర్ (భాను చందర్) ను బదిలీ చేసి, ఆ డబ్బును సొంతం చేసుకుంటాడు. అతను డబ్బును తన ఇంటి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ లో దాచుకుంటాడు. ఈ సమాచారం తెలుసుకున్న శివ, ఆ డబ్బును దోచుకుని తప్పించుకుంటాడు. అయితే, అతను ఒక వృద్ధ మహిళ (రమాప్రభ) తో కలిసి ఒక పెళ్ళి పార్టీలో కలిసిపోతాడు.

అక్కడికి వెళుతుండగా, శివ అనుకోకుండా పెట్రోల్ పంప్ దగ్గర కృష్ణవేణి (ఇలియానా) ను కలుసుకున్నాడు. వెంటనే, ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటారు. శివ తానొక దొంగనని నిజాయితీగా ఒప్పుకోవాలని నిర్ణయించుకుంటాడు. కాని దురదృష్టవశాత్తు అతను వేదికకు చేరుకునే సమయానికి అందరికీ దాని గురించి తెలిసిపోతుంది. కృష్ణ హడావుడిగా అక్కడినుండి వెళ్ళిపోయి, తన దుబాయ్‌లో ఉన్న స్నేహితుడి దగ్గరకు వెళ్లాలని నిర్ణయించుకుంటుంది. మాఫియా ముఠా ఆమెను కిడ్నాప్ చేస్తుంది. తరువాత రూ .500 కోట్ల నగదుతో పాటు తన నలుగురు గ్రూపు సభ్యులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హోంమంత్రికి మాఫియా డాన్ షకుర్ అహ్మద్ కాల్ చేస్తాడు. కమిషనర్ సూచనను అనుసరించి, కృష్ణను సురక్షితంగా తిరిగి తీసుకురాగల శివను దుబాయ్‌కు పంపడానికి హోంమంత్రి అంగీకరిస్తాడు. ఆమెను విడుదల చేయడంలో శివ ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? అతను షకుర్ అహ్మద్‌ను ఎలా కలుస్తాడు? శివ, కృష్ణలు డాన్ నుండి తప్పించుకోవడానికి ఏ పరిస్థితులలో ఎడారిలో ప్రయాణం చేస్తారు? వాళ్ళ ప్రేమ ఫలించిందా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు క్లైమాక్స్‌లో భాగం.[2]

నటవర్గం

మార్చు

పాటలు

మార్చు

మణి శర్మ స్వరపరిచిన పాటల కాసెట్లు సీడీలను 2009 సెప్టెంబరు 10న సుప్రీం సంగీతం మార్కెట్లోకి విడుదల చేసింది.[3] అన్ని పాటల రచయిత భాస్కరభట్ల రవికుమార్

క్రమసంఖ్య పేరుArtist(s) నిడివి
1. "భయం"  రాహుల్ నంబియార్ 03:36
2. "ఓరోరి"  వేణు గీతామాధురి 04:51
3. "తొలితొలిగా"  రంజిత్, శ్వేత 04:26
4. "గాలైనా"  హేమచంద్ర, మాళవిక 05:17
5. "ఎత్తుకో"  గీతా మాధురి 04:07
6. "పాతికేళ్ళ"  రంజిత్, సైంధవి 04:08
26:25

మూలాలు

మార్చు
  1. "Rechipo Telugu movie images, stills, gallery". IndiaGlitz. Retrieved 2012-08-04.
  2. http://entertainment.oneindia.in/telugu/reviews/2009/rechipo-review-260909.html[permanent dead link]
  3. http://www.indiaglitz.com/channels/telugu/article/49832.html