సుమన్ శెట్టి
హాస్యనటుడు
సుమన్ శెట్టి తెలుగు హాస్య నటుడు. ఇతడు తెలుగు, తమిళ భాషలలో కలిపి సుమారు 70కిపైగా చిత్రాలలో నటించాడు.
సుమన్ శెట్టి | |
జన్మ నామం | సుమన్ శెట్టి |
జననం | |
క్రియాశీలక సంవత్సరాలు | 2002 నుండి ఇప్పటివరకు |
భార్య/భర్త | నాగ భవాని |
ప్రముఖ పాత్రలు | జయం బృందావన కాలనీ యజ్ఞం ఆడవారి మాటలకు అర్థాలే వేరులే హ్యాపీ |
సుమన్ శెట్టి స్వస్థలం విశాఖపట్నం. సినీ రచయిత సత్యానంద్ అతనిలోని నటుడిని గుర్తించి సినిమాలలో ప్రయత్నించమన్నాడు. దర్శకుడు తేజ ఇతన్ని జయం చిత్రం ద్వారా సినీరంగానికి పరిచయం చేసారు. అతని ప్రత్యేకమైన సంభాషణలు, భావప్రకటన అతనికి సినిమాలలో అవకాశాలు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి విశాఖపట్నంలో నివాసముంటున్నాడు.
సుమన్ షెట్టి నటించిన చిత్రాలు
మార్చుతెలుగు
మార్చు- ఒక్కసారి ప్రేమించాక (2023)
- నాతో నేను (2023)
- జెట్టి (2022)
- మాటరాని మౌనమిది (2022)
- లై లవర్స్ (2022)
- మేరా భారత్ మహాన్ (2019)
- భాగ్యనగరవీధుల్లో గమ్మత్తు (2019)
- నేను నా నాగార్జున (2019)
- నిన్నే కోరుకుంటా (2016)
- చెంబు చిన సత్యం (2015)
- ఆడు మగాడ్రా బుజ్జీ (2013)
- జలక్ (2011)
- తిమ్మరాజు (2010)
- బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్
- 7జి బృందావన్ కాలనీ (తమిళ డబ్బింగ్ చిత్రము)
- జయం (సినిమా)
- ఉల్లాసంగా ఉత్సాహంగా
- హ్యాపీ
- సంక్రాంతి
- రణం
- సంబరం
- కోకిల (2006)
- ధీరుడు (2006)
- మీ ఇంటికొస్తే ఏం ఇస్తారు మా ఇంటికొస్తే ఏం తెస్తారు (2004)
- విజయం (2003)
- యజ్ఞం
- ఆడవారి మాటలకు అర్థాలే వేరులే
- బెండు అప్పారావ్ ఆర్. ఎం. పి
- దోషి