రెడ్డప్పగారి రాజగోపాల్ రెడ్డి

రెడ్డప్పగారి రాజగోపాల్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఆంధ్రప్రదేశ్ శాసనసభకు లక్కిరెడ్డిపల్లె శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పనిచేశాడు.[2][3]

ఆర్. రాజగోపాల్ రెడ్డి

నీటిపారుదల, వ్యవసాయ, రవాణాశాఖ మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1972 - 1978

శాసనసభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1967
1972
1983
1985
1989
నియోజకవర్గం లక్కిరెడ్డిపల్లి

వ్యక్తిగత వివరాలు

జననం 1933 అక్టోబరు 20
లక్కిరెడ్డిపల్లె
మరణం 18 సెప్టెంబర్ 2013
తిరుపతి
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్
జీవిత భాగస్వామి హైమావతమ్మ[1]
సంతానం ఆర్. రమేష్ కుమార్ రెడ్డి, ఆర్. శ్రీనివాస్ రెడ్డి (కుమారులు), రాధా (కుమార్తె)

రాజకీయ జీవితం

మార్చు

ఆర్. రాజగోపాల్ రెడ్డి 1962లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1967లో లక్కిరెడ్డిపల్లె శాసనసభ నియోజకవర్గం నుండి తొలిసారి ఆ తరువాత 1972లో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 1978లో కాంగ్రెస్‌ను వీడి జనతా పార్టీలో చేరాడు. రాజగోపాల్ రెడ్డి 1978లో జరిగిన ఎన్నికల్లో జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయి తిరిగి మళ్లీ కాంగ్రెస్‌లో చేరాడు. ఆయన ఆ తరువాత 1983లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి 1984లో టీడీపీలో చేరి ఎన్టీఆర్‌తో విభేదాల కారణంగా 1989లో తిరిగి కాంగ్రెస్‌ పార్టీలో చేరాడు.

ఆర్. రాజగోపాల్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పివి నరసింహారావు, ఎన్‌టి రామారావు మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశాడు. ఆయన లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గం నుండి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

ఆర్. రాజగోపాల్ రెడ్డి గుండె సంబంధిత సమస్యతో బాధపడుతూ తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2013 సెప్టెంబరు 18న మరణించాడు.[4][5]

మూలాలు

మార్చు
  1. Deccan Chronicle (26 March 2019). "Kadapa: 80-year-old campaigns for her son". Archived from the original on 3 January 2024. Retrieved 3 January 2024.
  2. Sakshi (19 September 2013). "రాజకీయ దిగ్గజం ఆర్‌ఆర్". Archived from the original on 3 January 2024. Retrieved 3 January 2024.
  3. The Hindu (18 September 2013). "Ex-Minister Rajagopala Reddy passes away" (in Indian English). Archived from the original on 3 January 2024. Retrieved 3 January 2024.
  4. Business Standard (18 September 2013). "Former AP minister R Rajagopal Reddy no more". Archived from the original on 4 January 2024. Retrieved 4 January 2024. {{cite news}}: |last1= has generic name (help)
  5. The New Indian Express (19 September 2013). "Ex-minister Rajagopala Reddy dead". Archived from the original on 4 January 2024. Retrieved 4 January 2024.