రేణుకా సహాని ఒక భారతీయ చలనచిత్రనటి. ఈమె మరాఠీ, హిందీ, తెలుగు తదితర భాషా చిత్రాలలో నటించింది. దూరదర్శన్‌లో జనాదరణ పొందిన సురభి అనే ధారావాహిక కార్యక్రమం ఈమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది.

రేణుకా సహాని
స్థానిక పేరుरेणुका शहाणे
జననంరేణుకా సహాని
(1966-10-07) 1966 అక్టోబరు 7 (వయసు 58)
మహారాష్ట్ర, భారతదేశం India
వృత్తిభారతీయ చలనచిత్ర నటి
క్రియాశీలక సంవత్సరాలు1990-2010
మతంహిందూ మతం
భార్య / భర్తఅశుతోష్ రాణా
పిల్లలుశౌర్యమన్, సత్యేంద్ర
తల్లిశాంతా గోఖలే

విశేషాలు

మార్చు

ఈమె మహారాష్ట్రలో 1966 అక్టోబర్ 7న జన్మించింది. ముంబాయిలోని మితిబాయ్ కాలేజీలోను, సెయింట్ జేవియర్స్ కాలేజీలో చదివింది. ముంబాయి యూనివర్సిటీ నుండి క్లినికల్ సైకాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. హచ్ సున్‌బైచా భావ్ అనే మరాఠీ సినిమాతో నటనకు శ్రీకారం చుట్టి ఆ తర్వాత ఎన్నో మరాఠీ సినిమాలు చేసింది. ఈమె తల్లి శాంతా గోఖలే రాసిన రిటా వెలింగ్కర్‌నవల ఆధారంగా రిటా అనే మరాఠీ సినిమాకు తొలి సారి దర్శకత్వం వహించి అందులో నటించింది. సర్కస్ అనే తొలి దశపు భారతీయ సీరియల్‌లోనూ ఈమె నటించింది. ఆ తర్వాత సురభి అనే ప్రాయోజిత సంచికా కార్యక్రమాన్ని సిద్దార్థ్ కక్‌తో కలిసి సమర్పించింది. మరాఠీ సినిమాల ద్వారా రాని పేరు ప్రఖ్యాతులు సురభి ద్వారా వచ్చాయి. అవే ఈమెను "హమ్ ఆప్ కే హై కౌన్" వంటి సూపర్‌హిట్ సినిమాలో ప్రాధాన్యమున్న పాత్రను వరించేలా చేశాయి. హిందీలో జాకీష్రాఫ్, పల్లవి జోషి తదితరులతో నటించింది. ఇంతిహాన్ అనే టివీ సీరియల్‌లో పోషించిన బలమైన ఆత్మవిశ్వాసం కలిగిన యువతి పాత్ర ఈమెకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. తెలుగులో రామ్‌గోపాల్‌వర్మ నిర్మాణంలో మనీ సినిమాలో చిన్నాకు జోడీగా నటించింది. కొన్నేళ్ల తర్వాత దానికి సీక్వెల్‌గా తీసిన మనీ మనీ సినిమాలోనూ నటించింది. అటు నటిగా జన్మనిచ్చిన చిన్నితెరని వదలకుండానే వెండితెర మీదా రాణించిన రేణుక తెరమీద నటించింది తక్కువే అయినా ఎక్కువగా గుర్తుండిపోయే పాత్రలు పోషించింది. 1998 వరకూ వరుసగా నటిస్తూ వచ్చి ఆ తర్వాత అరకొరగా అదీ 2010 దాకా కనిపించింది[1].

కుటుంబ జీవితం

మార్చు

బలుపు, తడాఖా, బంగారం వంటి తెలుగు సినిమాలలో నటించిన బాలీవుడ్ నటుడు అశుతోష్ రాణాను ఈమె ప్రేమించి 2001లో వివాహం చేసుకుంది. వీరికి శౌర్యమన్, సత్యేంద్ర అనే ఇద్దరు పిల్లలు కలిగారు.

దర్శకత్వం వహించిన సినిమా

మార్చు

మూలాలు

మార్చు
  1. ఎస్., సత్యబాబు (6 April 2017). "నవ్వుల రేణు... నువ్వెలా ఉన్నావు?". సాక్షి. Retrieved 15 March 2017.

బయటి లింకులు

మార్చు