మనీ మనీ రామ్ గోపాల్ వర్మ నిర్మాతగా వర్మ క్రియేషన్స్ నిర్మాణ సంస్థ తీసిన 1995 నాటి తెలుగు క్రైం కామెడీ సినిమా. 1993లో విడుదలై మంచి విజయం సాధించిన మనీ సినిమాకి ఇది సీక్వెల్. మనీ మనీ సినిమాని కృష్ణవంశీ దర్శకత్వం చేసినా తన పేరు వద్దనడంతో మనీ సినిమా దర్శకుడైన శివనాగేశ్వరరావు పేరు వేశారు.

మనీ మనీ
(1995 తెలుగు సినిమా)
దర్శకత్వం శివనాగేశ్వరరావు
కృష్ణవంశీ (క్రెడిట్స్ లేకుండా)[1]
తారాగణం జయసుధ ,
పరేష్ రావల్ ,
బ్రహ్మానందం ,
జె.డి.చక్రవర్తి,
చిన్నా
సురభి
సంగీతం రాజ్ - కోటి
నిర్మాణ సంస్థ వర్మ క్రియెషన్స్
భాష తెలుగు

కథసవరించు

తారాగణంసవరించు

మనీ కథ ముగిసిన దగ్గరే మనీ మనీ సినిమా మొదలుకావడంతో మనీ సినిమాలోని ప్రధాన తారాగణమంతా ఇందులోనూ ఉంది. వీరికి తోడు జేడీ చక్రవర్తికి జోడీగా సుధ పాత్రలో సురభి, మాణిక్యంగానే కాక లాయర్ సాబ్ అనే మరో పాత్రలో తనికెళ్ళభరణి ద్విపాత్రాభినయం, బెనర్జీగా బెనర్జీ వంటి పాత్రలు కొత్తగా చేరాయి.

అభివృద్ధిసవరించు

రామ్ గోపాల్ వర్మ నిర్మాణం, శివనాగేశ్వరరావు దర్శకత్వంలో తీసిన మనీ సినిమా 1993లో చిన్న బడ్జెట్‌ సినిమాగా విడుదలై మంచి విజయం పొందింది. బ్రహ్మానందం పోషించిన ఖాన్ దాదా పాత్ర ఎంతో ప్రజాదరణ పొందింది. ఈ నేపథ్యంలో అదే పాత్రలతో మనీలో ముగిసిన కథకు కొనసాగింపుగా మనీ మనీ సినిమా తీయాలని నిర్ణయించుకున్నాడు నిర్మాత రామ్ గోపాల్ వర్మ. తనవద్ద దర్శకత్వ శాఖలో పనిచేస్తున్న కృష్ణవంశీని మనీ మనీ సినిమా తీయమని ఆదేశించాడు. దర్శకునిగా తొలి సినిమా ఎలాంటిది చేయాలన్నదానిపై ఒక ఆలోచన ఉన్న కృష్ణవంశీ ఈ సినిమా తీస్తానని, అయితే తన పేరు దర్శకునిగా క్రెడిట్స్‌లో వేయరాదని షరతు పెట్టాడు.[1]

ఇతర వివరాలుసవరించు

ఈ చిత్రంలోని కొన్ని పాటలకు శ్రీ సంగీతం అందించాడు.[2]

మూలాలుసవరించు

  1. 1.0 1.1 "Krishna Vamsi ghost-directed a film - Times of India". The Times of India (in ఆంగ్లం). Retrieved 16 January 2019.
  2. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (13 September 2015). "సంగీత దర్శకుడి శ్రీ జయంతి". andhrajyothy.com. Archived from the original on 2 August 2020. Retrieved 2 August 2020.
"https://te.wikipedia.org/w/index.php?title=మనీ_మనీ&oldid=3039672" నుండి వెలికితీశారు