రే ఎమెరీ
రేమండ్ విలియం జార్జ్ ఎమెరీ (1915, మార్చి 28 - 1982, డిసెంబరు 18) న్యూజీలాండ్ క్రికెట్ ఆటగాడు. 1952లో న్యూజీలాండ్ తరపున రెండు టెస్టులు ఆడాడు. రాయల్ న్యూజీలాండ్ ఎయిర్ ఫోర్స్‌లో కూడా అధికారిగా పనిచేశాడు.
దస్త్రం:Ray Emery, Hurricane pilot NZH 1942 03 16.gif | ||||||||||||||||||||||||||||||||||||||||
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | రేమండ్ విలియం జార్జ్ ఎమెరీ | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | ఆక్లాండ్, న్యూజీలాండ్ | 1915 మార్చి 28|||||||||||||||||||||||||||||||||||||||
మరణించిన తేదీ | 1982 డిసెంబరు 18 ఆక్లాండ్, న్యూజీలాండ్ | (వయసు 67)|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి మాధ్యమం | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 55) | 1952 8 February - West Indies తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1952 15 February - West Indies తో | |||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||
1936–37 to 1946–47 | Auckland | |||||||||||||||||||||||||||||||||||||||
1947–48 to 1953–54 | Canterbury | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2017 1 April |
క్రికెట్ రంగం
మార్చురే ఎమెరీ ఆక్లాండ్‌లోని తకపునా గ్రామర్ స్కూల్‌లో చదివారు.[1] 1936-37లో ఆక్లాండ్ తరపున ఒక మ్యాచ్ ఆడాడు.
రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఎమెరీ రాయల్ న్యూజీలాండ్ వైమానిక దళంలో చేరాడు. కెనడాలో శిక్షణ పొందిన తర్వాత రాయల్ ఎయిర్ ఫోర్స్‌తో హరికేన్‌లను ఎగురవేస్తూ బ్రిటన్‌లో పనిచేశాడు.[2] యుద్ధం తర్వాత వైమానిక దళంలో కొనసాగాడు, స్క్వాడ్రన్ లీడర్ స్థాయిని పొందాడు. 1947లో అతను రోడోనిస్కోప్‌ని ఉపయోగించి ఆస్ట్రేలియన్ సివిలియన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌పై ఒక నివేదికను తయారు చేశాడు, న్యూజీలాండ్‌కు దాని వర్తింపును పరిశోధించాడు.[3]
బ్రిటన్‌లో మూడున్నర సంవత్సరాల సేవ తర్వాత, న్యూజీలాండ్‌కు తిరిగి వచ్చాడు. 1945, జూలైలో ఆక్లాండ్‌లోని సెయింట్ మేరీస్ కేథడ్రల్‌లో జీన్ మిల్సన్‌ను వివాహం చేసుకున్నాడు.[4]
1943-44 నుండి 1947-48 వరకు ఆక్లాండ్ తరపున తొమ్మిది మ్యాచ్‌లు ఆడాడు. మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేస్తూ 1945-46లో ఒటాగోపై 110 పరుగులు, 1946-47లో వెల్లింగ్‌టన్‌పై 123 పరుగులు చేశాడు.[5]
1947 చివరలో క్రైస్ట్‌చర్చ్‌కు మారాడు. 1950–51లో కాంటర్‌బరీ తరపున ఆడుతూ, ప్లంకెట్ షీల్డ్‌లో 30.00 సగటుతో 240 పరుగులు చేశాడు. వెల్లింగ్టన్‌పై మొదటిసారి బ్యాటింగ్ ప్రారంభించినప్పుడు 110 పరుగులు చేశాడు.[6] 1951-52లో బ్యాటింగ్ ప్రారంభించాడు. ప్లంకెట్ షీల్డ్‌లో 72.16 సగటుతో 433 పరుగులు చేశాడు. నాలుగు 50లతో జాతీయ సగటులలో అగ్రస్థానంలో నిలిచాడు.[7]
దాదాపు 37 ఏళ్ళ వయసులో 1951-52 సీజన్ చివరిలో పర్యాటక వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్టులకు ఎంపికయ్యాడు. మొదటి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో జియోఫ్ రాబోన్‌తో కలిసి 44 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యంలో 28 పరుగులు చేసాడు.[8] రెండవ టెస్ట్‌లో అతని మీడియం-పేస్ బౌలింగ్‌తో ఫ్రాంక్ వోరెల్, క్లైడ్ వాల్‌కాట్‌ల వికెట్లు (46 బంతుల్లో 52 పరుగులకు 2 వికెట్లు) తీశాడు.[9][10]
తర్వాతి రెండు సీజన్లలో నాలుగు మ్యాచ్‌లు ఆడి 80 పరుగులు మాత్రమే చేశాడు. దాంతో అతని ఫస్ట్ క్లాస్ కెరీర్ ముగిసింది.[5]
1955లో ఎమెరీ ఆక్లాండ్‌కు తిరిగి వచ్చాడు.[11] ఆక్లాండ్ విమానాశ్రయం స్థాపనలో ప్రముఖ వ్యక్తులలో ఒకడిగా ఉన్నాడు.[12] విమానాశ్రయంలోని ఒక రహదారికి అతని పేరు మీద రే ఎమెరీ డ్రైవ్ అని పేరు పెట్టారు.[13]
మూలాలు
మార్చు- ↑ (26 April 1933). "College Cricket: Takapuna Grammar".
- ↑ "Raymond William George Emery". Auckland Museum. Retrieved 30 November 2019.
- ↑ "Raymond William George Emery papers". MOTAT. Retrieved 30 November 2019.
- ↑ Error on call to Template:cite paper: Parameter title must be specified
- ↑ 5.0 5.1 "First-class Batting and Fielding in Each Season by Ray Emery". CricketArchive. Retrieved 30 November 2019.
- ↑ "Wellington v Canterbury 1950–51". CricketArchive. Retrieved 30 November 2019.
- ↑ 1951–52 batting averages
- ↑ "1st Test, Christchurch, February 08-12, 1952, West Indies tour of New Zealand". ESPNcricinfo. Retrieved 3 September 2022.
- ↑ "2nd Test, Auckland, February 15-19, 1952, West Indies tour of New Zealand". ESPNcricinfo. Retrieved 3 September 2022.
- ↑ Wisden 1953, pp. 837–41.
- ↑ . "Departure of Emery".
- ↑ Francis Payne & Ian Smith, eds, 2021 New Zealand Cricket Almanack, Upstart Press, Takapuna, 2021, p. 26.
- ↑ David Frith, Silence of the Heart, Random House, London, 2011.