వ్యవసాయం కోసం పెట్టుబడిని ఋణంగా నగదు రూపంలో రైతులకు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకమే రైతుబంధు పథకం.[1][2] ఈ పథకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు 2018, మే 10న కరీంనగర్‌ జిల్లా, హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని శాలపల్లి - ఇందిరానగర్‌ వద్ద ప్రారంభించాడు. మొట్టమొదటి సారిగా ధర్మరాజుపల్లి వాసులు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా చెక్కులు, పట్టాదార్‌ పాసు పుస్తకాలు అందుకున్నారు.[3]

రైతుబంధు పథకం
రైతుబంధు పథకం లోగో
ప్రాంతంధర్మరాజుపల్లి, తెలంగాణ, భారతదేశం
ప్రధాన వ్యక్తులుతెలంగాణ ప్రజలు
స్థాపనమే 10, 2018
వెబ్ సైటువెబ్సైటు
నిర్వాహకులుముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు,
తెలంగాణ ప్రభుత్వం

2023 ఆగస్టు నాటికి 11 విడుతల్లో మొత్తం రైతుబంధు పథకం ద్వారా 72,910 కోట్ల రూపాయలు రైతులకు పెట్టుబడి సాయంగా అందించబడింది.[4]

వివరాలు

మార్చు
 
2018, భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా , రైతుబంధు పథకం నిధులకు సంబంధించిన చెక్కును అధికారులకు అందజేస్తున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు

రైతుబంధు పథకం కింద ప్రభుత్వం ఎకరానికి రూ.5 వేల చొప్పున సాగుకు పెట్టుబడి సాయం చేయనుంది. ఖరీఫ్, రబీ సీజన్ లకు ఎకరానికి రూ. 5000 చొప్పున రెండు సీజన్లకు కలిపి రూ. 10000 పెట్టుబడిగా ఇవ్వనుంది. ఈ మొత్తాన్ని రైతుకు చెక్కుల రూపంలో ఇవ్వనున్నారు. అదే విధంగా ఈ పథకం కింద నిల్వ ఉంచిన సరుకుపై రుణం తీసుకున్న రైతులకు ఆరు నెలల పాటు వడ్డీ రాయితీ ఇస్తారు. రైతులు తాము తీసుకున్న రుణాలపై ఎలాంటి వడ్డీని చెల్లించాల్సిన అవసరం లేదు. ఆరు నెలల తర్వాత అనగా 181 వ రోజు నుంచి 270 వ రోజు వరకు వారు తీసుకున్న రుణంపై 12 శాతం చొప్పున వడ్డీ వసూలు చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 58.34 లక్షల మంది రైతులకు పెట్టుబడిసాయం అందిస్తుంది. ( గిరిజనభూములు కలిపి మొత్తం కోట్ల ఎకరాలకు )[5] ఈ పథకం అమలుకోసం బడ్జెట్‌లో రూ.12 వేల కోట్లు కేటాయించారు. తెలంగాణా రాష్ట్ర గణాంక సంకలనం 2020 ఉన్న వివరములను పరిశీలిస్తే , రైతుబంధు పథకం కింద పొందిన వ్యవసాయదారులలో 90% చిన్నరైతులు , సన్నకారు రైతులే ఉన్నారు . ఈ పథకం మొత్తం లబ్ది పొందిన వాటిలో నల్గొండ జిల్లాలోని 4,32,059 రైతులు ఈ పథకం ద్వారా ప్రయోజనము పొందినారు. రాష్ట్రము మొత్తములో ఎక్కువ మొత్తంలోరైతుబంధు పథకం ప్రయోజనం పొందిన రైతులలో నల్గొండ జిల్లా ప్రథమ స్థానం లో ఉన్నది, తర్వాతి స్థానాలలో సంగారెడ్డి, రంగారెడ్డి, ఖమ్మం, నాగర్ కర్నూల్ జిల్లాలు ఉన్నవి . రైతుబంధు లబ్దిదారులను క్రింది పట్టిక ద్వారా చూడ వచ్చును [6]

లబ్ది దారులు
క్రమ సంఖ్య రైతులు ప్రయోజనం పొందినవారు
1 సన్నకారు 2-47 ఎకరాలలో ఉన్నవారు 40,46,969
2 చిన్న రైతులు 2-48- 4-94 ఎకరాలలో ఉన్నవారు 11,33,829
3 తక్కువ , మధ్య తరగతి రైతులు 4-95 - 9-88 ఎకరాలలో ఉన్నవారు 5,01,994
4 మధ్య తరగతి రైతులు 9-89 -24-78 ఎకరాలలో ఉన్నవారు 92,997
5 పెద్ద రైతులు 24-79 ఎకరాల పైన ఉన్నవారు 6,099
భూ కమతాలు రైతుల సంఖ్య
2 ఎకరాల లోపు 42 లక్షలు (90%)
5 ఎకరాల లోపు 11 లక్షలు
5-10 ఎకరాల లోపు 4.4 లక్షలు
> 10 ఎకరాల కంటే ఎక్కువ 94,000
> 25 ఎకరాల కంటే ఎక్కువ 6488

బడ్జెట్ వివరాలు

మార్చు

ఈ పథకం అమలుకు 2018 తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో 12వేల కోట్ల రూపాయలు కేటాయించారు.[7][8]

పథక అమలు వివరాలు

మార్చు

మొదట్లో 2018-19 సంవత్సరంలో ఎకరానికి రూ.4వేల చొప్పున రెండు పంటలకోసం రెండు విడతల్లో ప్రతి రైతుకు మొత్తం ఏడాదికి రూ. 8వేలను ప్రభుత్వం అందించారు. పునాస పంట పెట్టుబడిని ఏప్రిల్‌ నుంచి, యాసంగి పంట పెట్టుబడిని నవంబర్‌ నుంచి పంపిణీ చేశారు. 2019-20 నుంచి పంట పెట్టుబడి సాయాన్ని ఎకరాకు రూ.4 వేల నుంచి రూ.5 వేలకు పెంచి, రైతుకు ఎకరాకు సంవత్సరానికి రూ.10 వేలు అందజేస్తున్నారు. ఈ పథకం కింద 2021 వరకు రూ.50 వేల కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో జమచేయబడ్డాయి. పంట పెట్టుబడి పథకం వల్ల 90.5 శాతం ఉన్న పేద రైతులు లబ్ధి పొందారు.[9]

2022 జూన్ 28న తొమ్మిదో విడత రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీ ప్రారంభమైంది. ఈ వానకాలం సీజన్‌కు 68.94 లక్షలమంది రైతులు రైతుబంధుకు అర్హులు కాగా, రైతుబంధు పంపిణీ కోసం రూ.7,654.43 కోట్లు పంపిణీ చేశారు. ఈ సీజన్ పంపిణీతో ఇప్పటివరకు అందించిన సాయం రూ. 58,102 కోట్లకు చేరింది.[10][11]

2022 డిసెంబరు 28న పదో విడత రైతుబంధు పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లోకి పంపిణీ ప్రారంభమయింది.[12] పదో విడత కింద రూ.7,676.61 కోట్లు విడుదల చేయగా, అర్హులైన 70.54 లక్షల మంది రైతలు ఖాతాల్లో రైతు బంధు నిధులు జమయ్యాయి.[13]

2023 జూన్ 26న పదకొండో విడత రైతుబంధు పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లోకి పంపిణీ ప్రారంభమయింది.[14] రైతులు, భూ విస్తీర్ణం పెరగడంతో ఈ సీజన్‌లో రైతుబంధు కోసం రూ.7,624 కోట్లు ఖర్చు చేసి 1.52 కోట్ల ఎకరాలకుపైగా 68.99 లక్షల మంది రైతులకు రైతుబంధు అందించింది. అలాగే 1.5 లక్షల మంది పోడు రైతులకు చెందిన 4 లక్షల ఎకరాలకు కూడా రైతుబంధు సాయం అందించారు.[15]

ఐక్యరాజ్యసమితి ప్రసంశ

మార్చు

ప్రపంచ దేశాల్లో రైతుల అభివృద్ధి కోసం చేపట్టిన వినూత్న కార్యక్రమాల్లో ఐక్యరాజ్యసమితి ఎంపిక చేసిన 20 పథకాలలో రైతుబంధు పథకం ఒకటి. 2018 నవంబరు 20 నుండి 23 వరకు 'వ్యవసాయాభివృద్ధిలో వినూత్న ఆవిష్కరణలు' అనే అంతర్జాతీయ సదస్సు ఐరాసలోని వ్యవసాయ విభాగం ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఎవో) కేంద్ర కార్యాలయం రోమ్ నగరంలో జరిగింది. ఈ సదస్సులో తెలంగాణ రాష్ట్రానికి చెందిన రైతుబంధు, రైతుబీమా పథకాలను ఎంపిక చేయగా, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలపై ప్రత్యేక ప్రజంటేషన్ ఇచ్చాడు.[16]

రైతుబంధు వారోత్సవాలు

మార్చు

రైతుబంధు పథకంలో భాగంగా రూ.50వేల కోట్లు రైతులకు నేరుగా అందించిన సందర్భంగా 2022 జనవరి 3 నుండి 10 వరకు రాష్ట్రవ్యాప్తంగా రైతుబంధు వారోత్సవాలు జరిగాయి. ఈ వారోత్సవాలలో రైతుబంధు సంబురాల రంగవల్లులు, వరినారుతో కేసీఆర్ చిత్రపటాలను తయారు చేయడం, ట్రాక్టర్-ఎడ్లబండ్ల ర్యాలీలు, సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పూలాభిషేకం-పాలాభిషేకాలు, చిత్రలేఖన-వ్యాసరచన పోటీలు వంటివి నిర్వహించబడ్డాయి.[17][18]

విమర్శలు

మార్చు

2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తమ ప్రభుత్వం నడిపించిన రైతు బంధు పథకాన్ని తమ సానుకూలాంశంగా ప్రచారం చేసుకుంది. అయితే విపక్షాలు మాత్రం ఈ పథకం కేవలం పెద్ద రైతులకు, భూస్వాములకు లాభం చేకూర్చడానికే నడిచిందనీ, అసలు వ్యవసాయం చేసి కష్టనష్టాలు అనుభవించే కౌలు రైతులకు దీని వల్ల రూపాయి కూడా లాభం లేదని విమర్శించారు.[19]

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "రైతు బంధు పథకానికి నిధులు విడుదల". నమస్తే తెలంగాణ. www.ntnews.com. Retrieved 12 April 2018.[permanent dead link]
  2. నమస్తే తెలంగాణ, బతుకమ్మ (ఆదివారం సంచిక) (2 June 2019). "మన తెలంగాణ ఘన తెలంగాణ". Archived from the original on 2 June 2019. Retrieved 15 June 2019.
  3. Namasthe Telangana (15 June 2021). "తొలిరోజు రూ.65.26 కోట్లు జమ". Archived from the original on 5 July 2021. Retrieved 5 July 2021.
  4. "TS: గుడ్‌న్యూస్‌.. నేటి నుంచే రైతుబంధు జమ". Sakshi. 2023-06-26. Archived from the original on 2023-06-26. Retrieved 2023-06-26.
  5. "పంట నిల్వకు రైతు బంధు పథకం." నమస్తే తెలంగాణ. www.ntnews.com. Retrieved 12 April 2018.[permanent dead link]
  6. "ఈనాడు : Eenadu Telugu News Paper | Eenadu ePaper | Eenadu Andhra Pradesh | Eenadu Telangana | Eenadu Hyderabad". epaper.eenadu.net. Retrieved 2020-10-28.
  7. "తెలంగాణ బడ్జెట్ 2018: ఈటల ప్రసంగం". Samayam Telugu. 2018-03-15. Archived from the original on 2022-10-12. Retrieved 2022-10-12.
  8. Mar 15, TIMESOFINDIA COM / Updated:; 2018; Ist, 13:23 (2018-03-15). "Telangana Budget 2018: Highlights of Telangana budget 2018-19 | Hyderabad News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 2018-04-17. Retrieved 2022-10-12. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)
  9. "రైతుబంధు సాయం 50,000 కోట్లు". Namasthe Telangana (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-12-11. Archived from the original on 2021-12-12. Retrieved 2021-12-12.
  10. telugu, NT News (2022-06-28). "3.64 లక్షల మంది రైతులకు కొత్తగా రైతుబంధు". Namasthe Telangana. Archived from the original on 2022-06-29. Retrieved 2022-06-29.
  11. "Rythu Bandhu 2022: గుడ్ న్యూస్.. నేటి నుంచే రైతుబంధు.. కొత్తగా 3.64 లక్షల మందికి కూడా". Samayam Telugu. 2022-06-28. Archived from the original on 2022-06-29. Retrieved 2022-06-29.
  12. "నేటి నుంచే పదో విడత రైతుబంధు నిధుల విడుదల". ETV Bharat News. 2022-12-28. Archived from the original on 2023-06-26. Retrieved 2023-06-26.
  13. "Rythu Bandhu: పదో విడత రైతుబంధు నిధుల జమకు అంతా సిద్ధం". Sakshi. 2022-12-27. Archived from the original on 2022-12-27. Retrieved 2023-06-26.
  14. "Rythu Bandhu Funds Releasing Today : నేటి నుంచి కర్షకుల ఖాతాల్లో రైతుబంధు నిధులు జమ". ETV Bharat News. 2023-06-26. Archived from the original on 2023-06-26. Retrieved 2023-06-26.
  15. telugu, NT News (2023-06-26). "Rythu Bandhu | తెల్లారేస‌రికి రైతుబంధు నిధుల‌తో.. మోగిన రైత‌న్నల మొబైల్స్". www.ntnews.com. Archived from the original on 2023-06-26. Retrieved 2023-06-26.
  16. "నాడు దండగ అన్న వ్యవసాయం.. నేడు పండగైంది." Namasthe Telangana (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-06-01. Archived from the original on 2021-06-07. Retrieved 2022-01-10.
  17. "పండుగలా రైతుబంధు వారోత్సవాలు". Namasthe Telangana (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-01-04. Archived from the original on 2022-01-10. Retrieved 2022-01-10.
  18. "రైతుబంధు సంబురం". Namasthe Telangana (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-01-09. Archived from the original on 2022-01-10. Retrieved 2022-01-10.
  19. శాండిల్య, అరుణ్ (4 December 2018). "టీఆర్ఎస్, మహాకూటమి ముందున్న సవాళ్లు". BBC News తెలుగు. Retrieved 9 December 2018.